Karthika deepam serial today:మౌనితను నిజం చెప్పమని నిలదీసిన కార్తీక్: ఈరోజు జరిగిన  కార్తీకదీపం సీరియల్ కథ

మౌనితనునిజం చెప్పమని నిలదీసిన కార్తీక్: ఈరోజు జరిగిన  కార్తీకదీపం సీరియల్ కథ.

దీప పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్లని చూసే అవకాశమే లేకుండా పోయింది. అత్తయ్యకు ఫోన్ చేద్దామంటే వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయారు. నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు. మేము లేమని ఎంత బాధ పడుతున్నారో, అందరూ ఉండి ఎవరిని కలవలేక పోతున్నాను. ముందు ఆయనని వెతికి నా దగ్గరికి తెచ్చుకుంటే, ఆయనే అంతా చూసుకుంటారని అనుకుంటూ ఉంటుంది దీప.

 ఇది నిన్న జరిగిన 1443 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

దీప కార్తీక్ ను కలుసుకుందో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

కార్తీక్ తనతోనే శాశ్వతంగా ఉండాలని ఉపాయం ఆలోచిస్తున్న మోనిత:నిద్రపోతున్న కార్తీక్ దగ్గరికి మౌనిత  వచ్చి మన ప్రేమకు ఎన్ని ఆటంకాలు ఏంటి? యాక్సిడెంట్లో అది చనిపోయింది. మనకు ఏ ఆటంకం లేదు అని అనుకుంటే, మళ్ళీ వచ్చేసింది. నీ ఫోటో పట్టుకొని తిరుగుతుంది. ఈసారి నిన్ను నా చేయి దాటనివ్వను. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నువ్వు నా దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతానికి కార్తీక్ కు గతం గుర్తుకు రాకుండా మేనేజ్ చేస్తున్నాను, కానీ ఎంతకాలం. గతం గుర్తుకు వస్తే నా పరిస్థితి ఏంటి అని, గతం గుర్తుకు చేసుకొని కార్తీక్ మాటలు గుర్తుకు వచ్చి, ఆ మౌనితగా అయితే నన్ను అసలు అంగీకరించడు. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని. ఇంతకీ నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని కొడుకును గుర్తుకు చేసుకుంటుంది.

మౌనిత కుట్రను బయట పెట్టాలని నిర్ణయించుకున్న సౌందర్య: సౌందర్య దగ్గరికి వచ్చి నువ్వు సంతోషంగా, విచారంగా, ఉన్నావా అని అంటూ అడుగుతాడు ఆనందరావు. ఆలోచనలో ఉన్నానని సమాధానం ఇస్తుంది. మౌనిత ఇక్కడికి ఎందుకు వచ్చింది. తను ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత లేకుండా చేస్తుందని అంటుంది. అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నామని అంటాడు.మనమంటే సౌర్య కోసం వచ్చాం. ఒకవేళ సౌర గురించి తెలిసి వచ్చిందా అని అంటుంది. శౌర్య కోసం రాదు, తన లక్ష్యం కార్తీక్. కార్తీక్ ఇప్పుడు లేడు.

తన పని మీదనే వచ్చే ఉంటుందని అంటాడు. తన పని కోసం వస్తే ఎందుకు చెప్పలేదు. ఇంకా నా కార్తీక్, మీ అబ్బాయి, సర్వస్వం అంటుంది. అలాగే పోనీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది అనుకుంటే తెల్లచీర నుండి రంగుల చీరలోకి వచ్చిందని అంటుంది. మళ్లీ పెళ్లి చేసుకొని ఉండవచ్చు అని ఆనందరావు అంటాడు. అంత సులువుగా కార్తీక్ ను మరిచిపోయేది అయితే, దీపతో కార్తీక్ పెళ్లి అయినప్పుడే పెళ్లి చేసుకునేది అని అంటుంది.

నిజంగా పెళ్లి చేసుకుంటే కార్తీక్ ను ఎందుకు వదలడం లేదు అని అంటుంది. అది మనల్ని చూసి కంగారు పడింది. కార్తీక్ గురించి మాట్లాడినప్పుడుఎందుకు కన్నీళ్లు కూడా రాలేదు. ఏదో తప్పు చేస్తుంది. అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఏం చేస్తుందో, నేను బయట పెడతాను అని సౌందర్య నిర్ణయించుకుంటుంది.

దీప కంటపడ్డ కార్తిక్: కార్తీక్ కార్ డ్రైవ్ చేస్తున్నాడని మేడంకి చెప్పాలని ఫోన్ చేస్తున్నానని అంటాడు శివ. కారు దిగు అంటే, మిమ్మల్ని ఒక్కడినే విడిచిపెట్టి వెళ్లలేను అని అంటాడు. అయితే నేను కార్ దిగి వెళ్ళిపోతాను అని కార్తీక్ కిందికి దిగి వచ్చి వెళ్ళిపోతుంటాడు. శివ మీరే డ్రైవ్ చేయండి సార్ అని అంటూ, మేడంకు చెప్పను అని మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ను చూసిన దీప పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. కార్తీక్ వెళ్ళిపోతాడు ఇవాళ ఆయన ఎక్కడున్నారో, ఎవరి ఇంట్లో ఉన్నారో రు తెలుసుకొని వస్తాను. అని డాక్టర్ కు ఫోన్ చేసి, అమ్మకు కూడా చెప్పమని చెబుతుంది.

శౌర్యతోనేఉంటానని చెప్పిన వారణాసి: ఇక్కడ శౌర్య ఆటోకు అతికించిన స్టిక్కర్ను చూసి గతం గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. వారణాసి సౌర్య దగ్గరికి వస్తాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడగక  ఇక్కడే లేను, ఊరు వెళ్లి మళ్ళీ వచ్చాను. నేను నీ దగ్గరే ఉంటానని అంటాడు. నిన్ను మా నానమ్మ వాళ్ళు పంపలేదు కదా అని అడుగుతుంది. వారణాసి వాళ్ళ తాతయ్య పంపిన విషయం మనసులో అనుకొని నన్ను ఎవరు పంపలేదని అంటాడు.

లోపల పిన్ని బాబాయ్ కి నేను సౌర్య అని, నా బ్యాక్ గ్రౌండ్ తెలియదు. నువ్వు కూడా చెప్పవద్దు అని చెప్పి వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు బయటికి రాగానే మా పిన్ని చంద్రమ్మ, బాబాయ్ చంద్రుడు అని చెప్పి వారణాసి మా మామయ్య, మా మాకు అక్కడ చాలా సహాయం చేశాడు. ఇప్పుడు ఇక్కడ సహాయం చేయడానికి వచ్చాడు అని అంటుంది. బాబాయ్ మీరు ఆటో తోలనవసరం లేదు. వారణాసి తోలుతాడు అని చెప్పి ఇకనుండి మీరు హోటల్ పెట్టుకోండి అని చెబుతుంది. సరే మేము అలా బయటకు వెళ్లి వస్తామని చంద్రమ్మ, చంద్రుడు అంటారు. సౌర్య కూడా బయటికి వెళ్తానని వారణాసి ఆటోలో బయటకు వెళ్ళిపోతుంది.

కార్తీక్ మౌనిత దగ్గరే ఉన్నాడని తెలుసుకొని మౌనితకు షాక్ ఇచ్చిన దీప: దీప కార్తీక్ వెనకాలే వస్తుంది. ఇల్లు ఇదే అని శివ కార్తీక్ కు చెప్పగానే ఇల్లు గుర్తుంది. నువ్వు ఇలా చెప్పడం మీ మేడం వింటే బయటికి కూడా పంపించదు అని కార్తీక్ అంటాడు. మరి లోపలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా, భయం. ఎవరికైనా ఇంట్లో అడుగుపెడితే భార్య ఎదురు వస్తుంది. నాకు ప్రాబ్లమ్స్ ఎదురు వస్తాయి, అని ఇంట్లోకి వెళుతుండగానే దీప వెనకాలనే వెళుతుంది. కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ బాబు అని పిలుస్తుంది.

డాక్టర్ బాబు ఏంటి? నేను ఎప్పుడైనా సూది వేశానా, చీటీ రాసిచ్చానా, డాక్టర్ బాబు అని పిలుస్తున్నావు. అసలే నా టెన్షన్స్ లో నేను ఉంటే మధ్యలో నీ గోల ఏంటి? మీరు అనుకున్నవారు నేను కాదని అంటాడు. ఇంతలో మౌనిత ఎవరితో కార్తీక్ మాట్లాడుతున్నామని బయటకువస్తుంది.దీపనుచూసిమోనితషాక్అవుతుంది. నాకు తెలుసు నీ గురించి. ఆయన్ని నీ దగ్గరనే పెట్టుకొని, నాకు తెలియకూడదని, నా ఎదురుగా ఫోటో పట్టుకొని నటిస్తూ తిరిగావు, నాకు అనుమానం వచ్చిన ,నాకు దొరికేంతవరకు వెయిట్ చేశాను అని, దీని మాయలో ఎలా పడ్డావు. రండి వెళ్ళిపోదాం అని దీప కార్తీక్ ను పిలుస్తుంది.

మోనిత దగ్గరకు వచ్చి ,ఎవరే నువ్వు, నా కార్తిక్ వెంటపడుతున్నావు, పోవే బయటికి అని శివను తనని బయటికి పంపించమని చెప్పి, కార్తీక్ ను లోపలికి తీసుకొని వెళ్తుండగా, మోనిత అని కోపంగా అరిచి అడుగు లోపలికి పడిందో ప్రాణాలు తీస్తానని బెదిరిస్తుంది. కార్తీక్ నిన్ను మౌనిత అని పిలిచింది కదా, నీ పేరు అదే కదా, నువ్వు తనకు తెలుసా ?అప్పుడు నేను కూడా తనకు తెలుసు కదా అంటాడు. అది పిచ్చిది .

పిచ్చిదానిలా పిచ్చి వాగుడు వాగుతుందని మోనిత అనగా, ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీ పిచ్చి వల్ల నా డాక్టర్ బాబు మీద పిచ్చితో పిచాచిలా తిరుగుతుంది నువ్వు అంటుంది. మౌనిక శివకు దీపను బయటికి తీసుకెళ్ళమని చెబుతుంది. శివ బలవంతంగా దీపం బయటికి తీసుకుని వెళుతుండగా కార్తీక్ వదలమని చెబుతాడు. మోనిత ఆవిడతో ఏం పని అంటుంది. నిజంగా ఆవిడ తెలియదా? అని అడుగుతాడు. లేదు.

ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. అయితే నీ పేరు మౌనిత అని ఎలా తెలిసింది. నా పేరు డాక్టర్ బాబు కాదు, నేను నీ మాయలో పడ్డాను అంటుంది. అసలు ఈమె ఎవరు? నేను ఎవరు? నువ్వు ఎవరు ?అని కార్తీక్ మౌనితను ప్రశ్నిస్తాడు .ఏంటి కార్తీక్ పేరుతో పిలిస్తే పరిచయం ఉన్నట్లేనా అంటుంది. నేను నా భర్త కోసం వచ్చాను అని అంటుంది దీప.

ఇది ఈరోజు జరిగిన 1444 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

కార్తీక్ ను తన వెంట దీప తీసుకొని వెళ్ళిందో లేదో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker