Guppedantha manasu serial today episode: జగతి విషయంలో రిషికి షాక్ ఇచ్చిన వసుధార!

రిషి ఇంట్లో జరిగే పూజకు వసుధార వస్తుంది. కట్టుకోమని ఇచ్చిన వాళ్ళ అత్తయ్య గారి చీరను ధరణికి కట్టిస్తుంది. జగతి కోపంతో అరుస్తుంది.రిషి కూడా కోపంగా మాట్లాడుతాడు. దేవయాని వసు తో ఇంటికి సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంది. పూజ అయిపోగానే జగతి మాట్లాడాలి అని వసుధారను పిలుస్తుంది.

జగతి, రిషి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ, ఉండగానే వసు వస్తుంది. ఇక ఎప్పటికీ ఇంటికి రావద్దు అని అంటుంది. వసూ చెప్పబోయేది వినకుండా, నేను వినను అని అంటుంది. మనిషి ఎలా బాధపెట్టాలో నీకు తెలియదా! నువ్వు తెలివైన దానివి నాకు తెలుసు. అని అరుస్తుంది. అందరి ముందు తలవంచుకొనేలా చేశావు.

Vasudhara in saree

రిషి ఎంతగానో బాధపడ్డాడు. అని అంటుంది. చీర కట్టుకుంటే నేను పెళ్లికి ఓప్పుకున్నట్టే అని మనసులో అనుకుని రిషి సార్ మారాలి అని అనుకుంటున్నాను అంటుంది. 20 ఏళ్ల బాధను నువ్వు ఒక్క క్షణoలో మారుస్తావా ?అద్దంలా చూసుకున్న రిషి మనసును పగలగొట్టావు అంటుంది. అమ్మ అని పిలవాలని, గురుదక్షిణ అని అనగానే జగతి వసును చెంప దెబ్బ కొడుతుంది. అది చూసి మేడం ఎందుకు కొట్టారు? తను బాధ పడితేనే చూడలేను. అలాంటిది మీరు కొట్టారు అని బాధపడతాడు. వాసు రిషి ఇచ్చిన చీర కట్టుకోలేదని దేవయాని రిషిని రెచ్చగొడుతుంది.

ఇంట్లో ప్రేమలు, బంధాలు ఎక్కువ. వాటికోసం ఆరాటం ఎక్కువ .అని వసు మహేంద్రతో మాట్లాడుతూ ఉండగా, జగతి మాట్లాడుతుండగా రిషి చాలు, మీకు దండం పెడతాను, మనిషికి భరించే శక్తి కొంతవరకే ఉంటుంది. అది మనసున్న వారికే తెలుస్తుంది. పసివాడిని వదిలి వెళ్ళిన వారికి కాదు అని వసును తీసుకొని వెళ్ళిపోతాడు. మొన్న జరిగిన గుప్పెడంత మనసు 582 ఎపిసోడ్ పూర్తి కథ.

 రిషి ఇచ్చిన చీర కట్టుకోకపోవడం వల్ల వారి బంధం నిలుస్తుందో, లేదో.ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం

వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉన్న జగతి మహేంద్ర:

మహేంద్ర, జగతి వసుధారనుకొట్టిన దానిని గురించి ఆలోచిస్తూ నువ్వు అలా కొట్టడం సరికాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్ గా ఉంటావు కద ఎందుకు ఇలా చేశావు అంటాడు. అమ్మ స్థానంలో ఉండి ఆలోచించాను. రిషి మనసుకు తగిన గాయం గురించి ఆలోచిస్తున్నాను.

మనం ఇష్టపడేవారు తప్పు చేస్తే ఎక్కువ కోపం వస్తుంది అని అంటుంది. వాళ్ళు బయటికి వెళ్లారు ఏం జరుగుతుందో భయం వేస్తుందని అంటాడు. వసు తప్పు చేస్తుంది. అది సరిదిద్దుకోవాలి అని అనుకునే లోపే పెద్ద తప్పుగా మారుతుందని చెబుతుంది. ఇదంతా నావల్ల జరుగుతుంది ఏమో అని మహేంద్ర బాధపడతాడు.

జగతి విషయంలో వసుధారపై కోప్పడ్డ రిషి:

జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక చీర, గురుదక్షిణ మన మధ్య బంధానికి అడ్డుకట్ట వేస్తుందా అని అంటుంది. వసుధర జరిగిన దానివల్ల నీకు బాధగా లేదా అని అడుగుతాడు. నేను మేడం మాట్లాడుకున్నాం, ఆవిడకు తప్పు అనిపించింది, అందుకే కొట్టారు. ఆ హక్కు ఆవిడకు ఉందని సమాధానం ఇస్తుంది. చీర కట్టుకుంటే ఇంటి కోడలు హోదా అని చెప్పారు కదా అని అంటాడు. చీర కట్టుకోకపోతే సంబంధం లేకుండా ఎలా అవుతుంది? ఆ మాట దేవయాని మేడం అనడం ఆవిడ అభిప్రాయం.

Rishi, jagathi and vasudhara

ఎవరి అభిప్రాయాలు వారి ఉంటాయని చెబుతుంది. ఆ చీర నేను తెచ్చాను అని అంటాడు. ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాల చీర ఎంత అంటుంది. అంత ప్రేమ ఉండగా చీర విలువ ఎంత ఉంటుంది. ఎవరు ఏమన్నా మన బంధం మారదు అంటుంది. అభిప్రాయాలు వేరు కానీ ఇద్దరం ఒకటే అంటే ఆ బంధం ఎలా నిలుస్తుందని అంటాడు. ప్రేమ అన్నిటిని కలుపుతుంది. ఓదార్చుకుంటుంది. మన మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి, కానీ అంత చిక్కని విభేదాలు లేవు. అనంతమైన ప్రేమ ఉందని, మీరు నన్ను మార్చుకోమంటే, నేను మిమ్మల్ని మార్చుకోవాలని అంటున్నాను.

మన బంధాన్ని చీరతో కొలవలేం. చీర కట్టుకుంటేనే బంధం పెరగదు. వద్దు అంటే తగ్గదు. ఆ చీర మీ నానమ్మ గారిది అని మీకు గౌరవం, ఎమోషన్, ఒక గొప్ప వరం అందుకే ఫీలవుతున్నారు. ఆ చీర నాకు ఇవ్వాలని ఆలోచన మీకు వచ్చిందని అనుకోనని అంటుంది. రిషికి దేవయాని చీర ఇచ్చి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని ఆ చీర పెద్దమ్మ నీకు ఇవ్వమన్నారు అని నిజం చెబుతాడు.

చీర కట్టుకునే విషయంలో నాకు అభిప్రాయం ఉంది. కొందరు అభిప్రాయాలు మారాలని, మారుతాయి అని ఆశపడాలి, కాని మార్చాలని, మార్చుకోవాలని బలవంతం చేయడం మంచిది కాదు. నాకు నేను ప్రశాంతంగా ఉంటాను. ఇంత జరిగినా ఇంత కూల్ గా ఎలా ఉన్నావని  అంటాడు. అక్కడ ఏమి జరగలేదు. ఒక చీర, ఒక చెంప దెబ్బ. మిగిలినవన్నీ పాతవి అంటుంది.

మేడం తరఫున నేను నీకు సారీ చెబుతున్నాను అని అంటాడు. ఒకరిని ప్రేమించినప్పుడు, దగ్గర వాళ్ళను ఫీల్ అయినప్పుడే మనం వారి తరఫున క్షమించమని అడుగుతాం. మీరు మేడం తరఫున సారీ చెప్పారని అంటే, మీ మనసులో మేడం అని అంటుండగానే రిషి కోపంతో ఇక వెళ్దామా అని చెప్పి వెళ్ళిపోతాడు.

ధరణిని మెచ్చుకున్న దేవయాని:

దేవయాని కాఫీ తాగుతూ, ఆలోచిస్తూ ఉంటే ఈ లోకం ఏమవుతుందో అని అంటూ, మనుషులలో మంచితనం, గౌరవం, మానవత్వం, కృతజ్ఞతా భావం లాంటివి కనిపించడం లేదని అంటుండగానే, దయ్యాలు ధర్మసూత్రం గురించి మాట్లాడడం అంటే ఇదేనేమో అని ధరణి మనసులో అనుకుంటుంది.

నేను ఇలా మాట్లాడుతుంటే ఆలోచిస్తున్నావా అని అంటుంది దేవయాని. వసు ఎందుకు చీర కట్టుకోలేదు. రిషి మీద గౌరవం, నేనంటే భక్తి లేవు అని, చీర నీకు కూడా బాగుందని, కాఫీ బాగా కలిపావు థాంక్స్ అని అంటుంది. ఈమె  నాతో ఇలా మాట్లాడుతుంది అంటే ఏదో తుఫాన్ రాబోతుందని అర్థమని అనుకుంటుంది ధరణి. ఎందుకలా నిలబడ్డావ్ వచ్చి కూర్చో అని పిలుస్తుంది. దేవయాని జగతి, మహేంద్ర చాలా బాధపడుతు ఉంటారు. వారు మాట్లాడుకున్నవి వచ్చి నాకు చెప్పమని ధరణిని పంపిస్తుంది.

రిషికి,జగతి మేడమే ముఖ్యం అని చెప్పిన వసు:

రిషి ,వసుధారను తన రూమ్ దగ్గర దింపి వెళ్లాలని అనుకుంటూ,  తన రూమ్ దగ్గర దింపుతాడు. తనకు బాయ్ చెప్పకుండా వెళ్తున్నావు అని అడిగితే కి తీసుకొని వెళ్ళిపోతుంది.  ఎందుకు ఇలా చేశావు అనగా లోపలికి రమ్మని అర్థం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి రావడం లేదని దేవయానికిచెప్పి లోపలికి వెళ్తాడు. మంచినీళ్లు ఇచ్చి, కాఫీ ఇవ్వనా అని అడిగితే వద్దంటాడు. నీ రూమ్ లోకి రాగానే తెలియని ఫీలింగ్ వస్తుంది అంటాడు. దాన్ని ప్రేమ అంటారు.

మనసుకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. వాళ్ళ దగ్గరకు వస్తే తెలియని ఒక శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఫీలింగ్ నాకు కాలేజీకి వస్తే వస్తుందని అంటుంది. నా జీవితం, ప్రయాణం చాలా విచిత్రంగా ఉందని, ఎక్కువ ప్రేమ కలిగితే నాకు ఎక్కువ భయం వేస్తుందని అంటాడు. ఎందుకని అడగగా నీ జీవితంలో నీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, నీ జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత అని అడుగుతాడు.

మేడం అని సమాధానం ఇస్తుంది. మరి నేను అని అడుగుతాడు. మీరు నా జీవితమని సమాధానం చెబుతుంది. మీరు నేను ఒకటే, నా జీవితం మీరే అయినప్పుడు నా జీవితంలో ప్రాధాన్యత, ప్రయారిటీ అనే వాటిలో సందేహం ఉండదు అని సమాధానం ఇస్తుంది. ఇది ఈరోజు జరిగిన గుప్పెడంత మనసు ఎపిసోడ్ 583 సీరియల్ పూర్తి కథ.

వసుధార అన్న మాటలకు రిషి రియాక్షన్ ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker