Guppedantha Manasu Rishi హీరో రియల్ లైఫ్

Rishi

Guppedantha Manasu Rishi హీరో రియల్ లైఫ్.

రిషి చిన్నతనం:

గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోగా నటిస్తున్నా రిషి రియల్ నేమ్ ముఖేష్ గౌడ. తెలుగు, కన్నడ భాషల్లో నటించాడు. ఈయన కర్ణాటకలోని మైసూర్ లో 1994 నవంబర్ 8న జన్మించాడు. ఈయనకు ఒక అక్క కూడా ఉంది. మైసూర్ లో మహావీర్ విద్యా మందిర్లో పాఠశాల విద్యను పూర్తిచేసి, మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పొందాడు.

నటన మీద మీద ఆసక్తితో మొదట మోడలింగ్ చేయడం ప్రారంభించాడు. 2017 సంవత్సరంలో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను పొందాడు. తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్, తల్లి హౌస్ వైఫ్.

mukesh gowda
Mukesh gowda

నటన:

ఈయనకు మొదటిగా 2017 లో కన్నడ భాషలో (నాగ కన్యకే )నాగ మండల సీరియల్ లో నటించాడు. ఈ సీరియల్లో తనకు జోడిగా ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటిస్తున్న వర్ష నటించింది. ఈ సీరియల్ కన్నడ భాషలో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది.

naga mandala serial in kanada
naga mandala serial in kanada

తెలుగులో మొదటగా ప్రేమనగర్ సీరియల్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకుపరిచయమయ్యాడు. ప్రస్తుతం స్టార్ మా లో గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్నాడు.

సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలు చెప్పిన రిషి:

సీరియల్ క్యారెక్టర్ కొంత రియల్ లైఫ్ కు తగ్గట్టుగా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లోముఖేష్ గౌడ్ కు 250 వేల మందిఫాలోవర్స్ ఉన్నారు. ఈయన కన్నడ స్టార్ హీరో రాజ్ పునీత్ కు వీరాభిమాని. ఆయన మీద అభిమానంతో తన కళ్ళను దానం చేశాడు. ఇంజనీరింగ్ లో ఒక అమ్మాయిని చూడగానే తనకు బాగా నచ్చింది అని సోషల్ మీడియా ద్వారా చెప్పాడు.

అలాగే వర్షం పడినప్పుడు మట్టి వాసన ఎంతో ఇష్టం, చాలాసార్లు తిన్నానని కూడా చెప్పాడు. ఇలా తన మనసులో మాటను బయట పెట్టాడు. తనకు ఫార్మింగ్ లో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, అలాగే గుర్రాలు అంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు.

mukesh favourite    serial   Karthika Deepam
Mukesh favourite serial Karthika Deepam

తనకు హైదరాబాద్ బిర్యానీ అలాగే రసం చాలా ఇష్టమని, తనకి ఇష్టమైన సినిమా కేజీఎఫ్ అని, తనకి ఇష్టమైన సీరియల్ కార్తీకదీపం, దేవత ఇలా తన పర్సనల్ విషయాలు చాలా చెప్పాడు. అలాగే తనకు ఒక అక్క ఉందని తెలుసు కదా! ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. కరోనా కారణంగా మానేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు, తన అల్లునితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమని కూడా చెప్పారు.

తన తండ్రి గురించి చెప్పిన ముఖేష్ గౌడ:

ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్ లోనటిస్తున్నాడు. ఈ సీరియల్ ఈ సీరియల్ తెలుగులో వేలకోట్ల అభిమానులను సొంతం చేసుకుంది. బెంగాలి సీరియల్ ను రీమేక్ చేసి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్ పాపులారిటీ అంతా కాదు, అందులో రిషి, వసుల మధ్య లవ్. జగతి రిషి ల మధ్యఎమోషన్ అన్నీ చాలా బాగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. తండ్రితో ఉండే బాండింగ్ అయితే చెప్పలేం. వీళ్ళు నిజంగా తల్లిదండ్రుల అన్నట్టు ఉంటుంది.

తాజాగా జరిగిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో ముఖేష్ తన తండ్రి గురించి చెప్పాడు. తండ్రి అంటే ఎంతో ఎమోషనల్ బాండింగ్. తండ్రి కి, కొడుకుకి ఉండే అనుబంధం వివరించలేనిది. అంతటి విలువైన తండ్రి ఉన్నప్పుడు వారికి ఎటువంటి విలువ ఇవ్వలేం. వారు దూరమయ్యాక బాధ తెలుస్తుంది.

Mukesh  Gowda father
Mukesh Gowda father

ముఖేష్ స్టార్ మా పరివార్ అవార్డ్స్ స్టేజ్ మీద చెప్పాడు. ముఖేష్ రియల్ లైఫ్ లో సంతోషంతోపాటు, బాధ కూడా ఉంది. అని తండ్రి పక్షవాతంతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రిని చంటి బిడ్డ లాగా అన్ని ఆయనే చూసుకున్నాడని, తాజాగా జరిగిన స్టార్ మా పరివార్డు వేదికపై తన తండ్రిని పరిచయం చేశాడు.

సీరియల్లో తండ్రి తో ఉండే సన్నివేశాన్ని గుర్తుకు చేసుకొని తన తండ్రితో అలా గడప లేకపోయానని బాధపడ్డాడు. స్టార్ మా స్టేజ్ పై చూపించిన ఏవి లో ముకేశ్ తండ్రికి తినిపిస్తూ, గడ్డం గీస్తూ, ఆయన చూసుకున్న విధానం, తండ్రికి కన్నతండ్రిగా మారిన విధానం చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

నేను నా తండ్రికి కొడుకుగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. ఒక కొడుకుగా శిఖరాన్ని అందుకున్నారని చెప్పాడు. ఈ విధంగా తన తండ్రి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker