Guppedantha manasu serial today:దేవయానిని బెదిరించిన వసుధార.
guppedantha manasu serial ఈ రోజు కథ:నేను మీ ఇంటికి కోడలిగా రావడం ఎవరు ఆపలేరని దేవయానిని బెదిరించిన వసుధార:
వసుధార రిషి ఇద్దరు వారి ప్రేమ గురించి మాట్లాడుకోవడం, అలాగే గౌతమ్ కు రిషి తన బాధను తెలియజేయడం, జగతి, మహేంద్రతో రిషిని మనసును గాయపెట్టానని బాధపడటం జరుగుతుంది.
రిషి ఇంటికి వెళ్లలేదని వసుధార తనకోసం క్యారేజ్ తీసుకొని కాలేజీకి వెళ్లడం. అది గౌతమ్ తీసుకొని వచ్చి బయట నుంచి భోజనం తెచ్చానని చెప్పి, ఇద్దరూ తింటుండగా వంట టేస్ట్ చేసినా రిషి ఇది వసుధార చేసిందని గుర్తుకు పట్టి, వసుధాలను లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇది నిన్న జరిగిన గుప్పెనంత మనసు సీరియల్ కథ.
ఈరోజు కూడా నిన్న జరిగిన వసుధార వంట చేసి తీసుకొని వచ్చిందని రిషి గుర్తించడం జరిగింది. ఎక్కువసేపు బయట నిలబడితే కాళ్ల నొప్పులు వస్తాయని తననీ లోపలికి పిలవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు కథ ఇక్కడి నుంచి మొదలు కాబోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధర లోపలికి వెళ్తే రిసి ఏం చెప్తాడు తను చేసిన భోజనం తింటాడా లేదా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.
రిషి తన ప్రేమను వ్యక్తపరచడం:
లోపలికి రా, నాటకాలు వద్దు అని వసుధారను లోపలికి పిలుస్తాడు. ఎలా కనుక్కున్నారని? వసు అడగగా ,వంట టేస్ట్ చేసి ఈ మాత్రం చెప్పలేనా! అని అంటాడు. గౌతమ్ నవ్వుతూ చెప్పవద్దని చెప్పిందని అంటాడు. భోజనాలు ఎందుకు పంపించావు? ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయవా? అని అంటాడు. మనసు ప్రశాంతంగా ఉండాలి, అంటే కడుపు ఖాళీగా ఉండకూడదని అంటుంది.
సూపర్ అని గౌతమ్ సెటైర్ వేస్తాడు. ఇంత రాత్రివేళ వచ్చావు, వెళ్లేటప్పుడు గౌతమ్ ను తోడుగా తీసుకొని వెళ్ళమని చెప్పి, తిన్నావా? అని అడుగుతాడు. వసు మౌనంగా ఉండటం చూసి, కూర్చొని తిను ,తిని వెళ్ళమని చెబుతాడు. ప్రేమ ఇది అమర ప్రేమ అని పాటలు పాడుకుంటూ సెటైర్ వేస్తూ ఉంటాడు గౌతమ్.
దేవయాని ఏం ప్లాన్ చేస్తుందో అని అనుకుంటున్నా వసుధార:
మరుసటి రోజు వసుధార కాలేజీకి రెడీ అవుతూ సెల్ఫోన్లో రిషి ఫోటో చూస్తూ, మీరు ఇంటికి వెళ్లకుండా ఉంటే జగతి మేడం వాళ్ళు ఎంత బాధ పడతారు? మిమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించాలి, మిమ్మల్ని ఎలా పంపించాలో నాకు తెలుసు అనుకొని, డోర్ తీయగానే దేవయాని ని చూసి మీరేంటి ఇలా వచ్చారని? అడుగుతుంది. నీతో మాట్లాడాలని అంటుంది దేవయాని.
వసుధారను లోపలికి తీసుకుని వెళ్లి ,నువ్వు తెలివైన దానివి, నిన్ను సాంప్రదాయంగా మా ఇంటి కోడలుగా తీసుకొని వెళ్ళాలని వచ్చాను, అని గురుదక్షిణ విషయం మర్చిపో? జీవితాంతం అందరి కోసం త్యాగం చేయకూడదు, నీ గురించి, నీ లైఫ్ గురించి ఆలోచించు, జగతిని అమ్మ అని పిలిస్తే నీకెందుకు? పిలువకపోతే నీకెందుకు? నీకు రిషి కావాలి, రిషి కి నువ్వు కావాలి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను అంటూ అంటుంది.
ఇలా మాట్లాడుతుందంటే ఏదో ప్లాన్ తోనే వచ్చింది .ఇందులో ఏదో మోసం ఉందని మనసులో అనుకుంటుంది వసుధార. ఏం మాట్లాడినా ప్రమాదమే! ఇప్పుడు ఏం చెప్పాలని వసు ఆలోచించుకుంటుంది. దేవయాని అన్ని వదిలేయ్ నీ ఆనందం, రిషి ఆనందమే నాకు ముఖ్యం. మీ పెళ్లి జరిగితే నాకు ఏం వస్తుందని? చెప్పి మొత్తం సర్దుకొని త్వరగా వచ్చేయ్, నేను వెయిట్ చేస్తుంటానని అంటుంది.
వసుధారణ ఎందుకు దూరం పెడుతున్నావని అన్న గౌతమ్:
గౌతమ్ రిషి గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఆడుతూ నీది మంచి మనసు, కల్మషం లేని మనసు అని మాట్లాడుతూ ఉంటాడు. గేమ్స్ అంటే గుర్తుకు వచ్చింది. జీవితంలో అందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం మోసం చేయకుండా ఫెయిర్ గేమ్ ఆడతావు.ఎందుకు వసుధారని పక్కకు పెడుతున్నావని? అంటాడు.
వసుధారకు నాకు మధ్య దూరం ఏమీ లేదు. వసదార ని దూరంగా ఉంచాను, అని ఎందుకు అనుకుంటున్నావు. మా ఇద్దరి మధ్య చిన్న బేధం ఉంది. అంతే కానీ మేము దూరం కావడం లేదని చెబుతాడు.
- Guppedantha manasu serial today:దేవయానికే ఎదురు సమాధానం ఇచ్చిన వసుధార.
- Guppedantha manasu serial today;రిషి ని చూసిన మహేంద్ర జగతి, కావాలనే తన నుంచి తప్పించుకుంటున్నారు అన్న రిషి:
- Guppedantha manasu:ప్రియుడినే చంపబోయిన గుప్పెడంత మనసు సీరియల్ నటి.
- Guppedantha manasu serial today:ప్రేమతో ఒక్కటైపోయినా రిషి, వసుధార..
- Guppedantha manasu serial today:రిషి వసుధార మధ్య చిచ్చు పెట్టబోతున్న దేవయాని..
దేవయానితో మీ అందరి ముచ్చట తీరుస్తానని అన్న వసుధార:
వసుధార రూమ్ నుండి రిషికి కాల్ చేసి, ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక్కడ దేవయాని నువ్వు రిషికి ఫోన్ చేశావు కదా ,ఇదే నాకు కావాల్సింది, నేను ఆడే గేమ్ కు అదే ఫినిషింగ్ టచ్ అంటుంది. పెద్దమ్మ ఎందుకు వెళ్ళింది? అంతా అవసరం ఏంటని? అనుకుంటూ, దేవయానికి ఫోన్ చేస్తాడు, నీతో ఫోన్ మాట్లాడితే నువ్వు ఇక్కడికి రావు అని ఫోన్ కట్ చేస్తుంది.
ఈవిడ ఏదో ప్లాన్ చేసి అల్లకల్లోలం చేయడానికి వచ్చిందని మనసులో అనుకుంటుంది వసుధార. మీరు ఎందుకు వచ్చారు? అని అడుగుతాడు. వసు చెబుతుండగా ఆగమని చెప్పి, నీ ఆనందమే, నా ఆనందం, నేను బ్రతికేది నీకోసం, నీ బాధను నేను చూడలేను, ఎలాంటి షరతులు లేకుండా, గురుదక్షిణను మరిచిపోయేలా ఒప్పించి మన ఇంటికి తీసుకొని వెళ్దామని వచ్చానని అంటుంది దేవయాని.
ఈ విషయంలో మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని? అంటాడు రిషి. నీ మనసు నాకు తెలుసు కదా! అని సమాధానం ఇస్తుంది. మనసు తెలుసుకోవాల్సిన వారికి తెలియడం లేదని, ఏదైనా మనసులో నుంచి రావాలి. బలవంతంగా మారడం కష్టం. అలా మారితే తాత్కాలికం అవుతుందని దేవయానితో అంటాడు. మీరు కరెక్ట్ గా చెప్పారు.
ఒకరి అభిప్రాయాలను గౌరవించాలి. బలవంతంగా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకోమని చెప్పకూడదని చెప్పి, సార్ కి నాకు చిన్న అడ్డుతెర ఉంది, అభిప్రాయ బేధం తప్ప వేరేది కాదు, ఇది ఒక్క విషయం తప్పితే మిగతా అన్నిటిలో మా ఇద్దరి మధ్య నుంచి మంచి అవగాహన ఉందని, ఈ విషయంలో మీరు కలగజేసుకొని, ఇబ్బంది పడుతూ, కష్టపడకూడదని, జరగాల్సినవి సాఫీగా జరుగుతాయని, మాకోసం ఆలోచించినందుకు చాలా థాంక్స్ అని చెబుతుంది.
నేను చెప్పినవన్నీ మర్చిపోయావా? అంటుంది దేవయాని. మీరు పెద్దవారు, మాకోసం ఆలోచించి ఇక్కడిదాకా వచ్చారు, మీరు కోరుకున్నట్టే జరుగుతుందని సమాధానం ఇస్తుంది వసుధార. రోడ్డుమీద ఇవన్నీ అవసరమా? అని దేవయానిని రిషి అంటాడు. మీ మనసులో ఏముందో కానీ, నేను మాత్రం మీ ఇంటి కోడలిగా తప్పకుండా వస్తాను, అని అందరి ముచ్చట తీరుస్తాను, నేను రాకుండా ఎవరూ ఆపలేరని దేవయానని బెదిరించినట్టుగా మాట్లాడుతుంది వసు.
నేను చెప్పేది కూడా అదే కదా ,నా మాట విన్నట్టుగా ఉంటూ, తెలివిగా నటిస్తున్నావా? అని వసుధారను అంటుంది దేవయాని. నీకు తెలివి ఉందని మీరే అన్నారు కదా అని సమాధానం ఇస్తుంది.
ఇది తన కుటుంబ వ్యవహారం అని అన్న వసుధార:
ఇంతలో ఇంటిపక్క ఆవిడ వచ్చి, ఏమైంది? ఏమైనా గొడవ? అని అడుగుతుంది. లేదు ఇది మా కుటుంబ వ్యవహారం అని వసు అంటుంది. కుటుంబ విషయం అయితే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బయట ఏంటని అంటుంది. మీరు చాలా బాగా చెప్పారు. ఒక్కొక్కసారి మనకే తెలియకుండా కొంతమంది బయట మాట్లాడాలని అనుకుంటారని వసుధార సమాధానం ఇస్తుంది.
రిషి మనం వెళ్దాం రండి పెద్దమ్మ, ఇలాంటివి బయట మాట్లాడకూడదని చెప్పి, దేవయాని కారు ను డ్రైవర్ను తీసుకొని రమ్మని చెప్పి, దేవయాననీ తీసుకుని వెళ్తాడు.
వసు తప్పకుండా మారుతుందని చెప్పిన రిషి:
రిషి కార్లో వెళుతూ, వసుధార మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. దేవయాని ఏడుస్తున్నది చూసి ,ఏమయింది? ఎందుకలా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నారని? అడుగుతాడు. నీ గురించి ఆలోచిస్తున్నాను, మీ డాడీ పట్టించుకోడు, జగతికి బాధ్యత లేదు, నీ గురించి నేను తప్ప ఇంకొక ఇంకెవరు ఆలోచిస్తారని అంటుంది.
ఇప్పుడు నాకేమైంది? నేను బాగానే ఉన్నానని అంటాడు. బాగుండడం అంటే ఇది కాదు, సాక్షి వదిలి వెళ్ళిన రోజే నా మనసు ముక్కలు అయింది, నువ్వు ఏమైపోతావో? అని అనుకున్నాను. నీ లైఫ్ లోకి వసుధారవచ్చింది. అంతా బాగుంటుందని అనుకునే లేపే, మీకు తగాదాలు వచ్చాయని, మీరు కలిసారని అనుకుంటే, వసుధార గురుదక్షిణ అని అంటుంది.
నేను బాగానే ఉన్నానని అంటాడు. ఎక్కడ బాగున్నావ్! అని చెప్పి ,రిషిని పెళ్లి చేసుకోమని, నా పెద్దరికం పక్కనపెట్టి మరీ అడిగాను, కానీ నా మాట వినడం లేదని అంటుంది. మీరు చూస్తున్న వసుధార వేరు, నేను చూసిన వసుధార వేరు, తన గురించి నాకు బాగా తెలుసు, జగతి మేడం మీద ఉన్న అభిమానం, గౌరవం వల్లే ఇలా ఉంది.
అంతకంటే ఎక్కువ ప్రేమ నామీద ఉందని, మీరు చూస్తూ ఉండండి నాకోసం తన మనసు మారి మన ఇంటికి వస్తుందని రిషి అంటాడు. ఇది ఈరోజు జరిగిన 585 ఎపిసోడ్ గుప్పడంతా మనసు సీరియల్ పూర్తి కథ.
ఈ మాటలు విన్న దేవయాని వీళ్లిద్దరిని విడదీయడానికి ఏం ప్లాన్ వేస్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.