RRR Japan: అటు నందమూరి హీరో, ఇటు మెగా హీరో కలిసి జపాన్ వీధుల్లో సందడి.

RRR Japan: ప్రతిరోజు మనకుండే బిజీ లైఫ్ ద్వారా మనకు కలిగి ఒత్తిడి, శ్రమ, మూడ్ ఆఫ్ నుండి మనల్ని కొంతవరకు ఉపశమనం కలిగించేవి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన సినిమాలయితేనేమి, షోస్, స్పోర్ట్స్ అలాంటివి ఏమైనా సరే మనకు రోజువారిగా ఉండే ఒత్తిడి నుంచి కొంతవరకు మనకు ఉపశమనం కలిగిస్తాయి.

ఇలాంటి సినిమాలకు సంబంధించి కొందరికి కామెడీ మూవీస్ నచ్చుతాయి. మరికొందరికి యాక్షన్ మూవీస్ ఇలా ఒక్కొక్క రికి తగిన విధంగా నచ్చదు ఉంటాయి. దీంట్లో భాగంగా మరికొందరికి సీరియల్స్, మరికొందరికి మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకోవడం అంటే ఇష్టం. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని ద్వారా ఒత్తిడి నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతూ ఉంటారు. దీంట్లో భాగంగా హీరో హీరోయిన్స్ కు సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అటు నందమూరి హీరో, ఇటు మెగా హీరో కలిసి జపాన్ వీధుల్లో సందడి.
అటు నందమూరి హీరో, ఇటు మెగా హీరో కలిసి జపాన్ వీధుల్లో సందడి.

అదేంటో తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి మరల చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అటు నందమూరి హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్, ఇటు మెగా హీరో అయినా రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్లుగా నటించి తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా కాసుల వర్షం కురిపించింది. 1200 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. తాజాగా ఈ మూవీ ని డబ్ చేసి జపాన్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం ఆర్ఆర్ఆర్ టీం జపాన్ కు వెళ్ళింది. అక్కడ రామ్ చరణ్, తారక్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అటు నందమూరి హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్, ఇటు మెగా హీరో అయినా రామ్ చరణ్, కార్తికేయలు సతీసమేతంగా జపాన్ వీధుల్లో సందడి చేశారు.

రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నడుస్తూ అందరి దృష్టిలను ఆకర్షించారు. గులాబీ పువ్వులను చేతిలో పట్టుకుని ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, తారక్ లను ఒక్క ఫ్రేమ్లో చూస్తేనే కళ్ళు చాలవు. లాంటిది వాళ్ల భార్యలతో కూడా కలిసి ఒకరి చేతుల్లో మరొకరు చేయి వేసి అలా నడుస్తూ ఉంటే అటు నందమూరి అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు చూడ్డానికి కళ్ళు చాలవు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker