Allu Arjun: పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ చెప్పని అల్లు అర్జున్
తెలుగు సినీ పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ రెండు కుటుంబాలు కనిపిస్తే ఫ్యాన్స్ కు కన్నుల పండుగే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు చక్కర్లు కొడుతున్నా విషయం మనకు తెలిసిందే కదా!
ఎందుకంటే మెగా ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగిన అల్లు ఫ్యామిలీ ఆ ఇంట్లో వాలిపోతుంది. అయితే ఈ మధ్య వారు కలిసి ఉండడం లేదని ఎక్కడ కూడా కనిపించడం లేదని. చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో బన్నీ కొడుకు తప్ప అల్లుకు సంబంధించిన ఫ్యామిలీ వారెవరు కనిపించకపోవడంతో మరోసారి రూమర్స్ తెర పైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ ఈ వార్తల ను ఖండించారు. మొదటినుంచి ఉన్న ఈ బంధుత్వాo ఇప్పటివరకు ఉందని తమ కుటుంబాల మధ్య వచ్చిన వార్తలు ఎలాంటి నిజం లేదని ఆయన తెలియజేశారు.
ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తాజాగా బన్నీ తీరు చూసి కొందరు మరోసారి వీరి బంధుత్వం చెడిందా? అనే సందేహాలను లేవనేత్తున్నారు. దీనికి కారణం శుక్రవారం(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకు అల్లు అర్జున్ విష్ చేయకపోవడమే.
చిరంజీవి బర్త్‌డేకు విష్ చేసిన అల్లు అర్జున్ మరి పవన్ కళ్యాణ్ కు ఎందుకు విషెస్ చెప్పకపోవడం. ఈ వార్తలకు మరోసారి సందేహం పడింది. ఒక బన్నీ మాత్రమే కాదు అల్లు శిరీష్ కానీ బన్నీ భార్య స్నేహ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ కి విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
దీంతో మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయన్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తలపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చిన బన్నీ విషెస్ చేయకపోవడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.