Anshu Ambani: ఇంస్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో మెరుస్తున్న నాగార్జున హీరోయిన్.
Anshu Ambani: ప్రస్తుతం సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యింది. ప్రపంచం మొత్తం ఎక్కడ జరిగిన విషయాలైనా ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఏది అవసరమైన సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ముందుకు వెళుతున్నారు. ఏ విషయం గురించి కానీ, ఎవరి గురించి కానీ తెలుసుకోవాలన్న సోషల్ మీడియానే ఆధారపడి ఉన్నారు.
సోషల్ మీడియాలో ఫేస్బుక్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటి ద్వారా ప్రముఖుల గురించి, హీరోల గురించి, ప్లేయర్స్ గురించి, తెలియని విషయాలన్నిటిని తెలుసుకుంటున్నారు. అంతే కాదు పాత హీరోయిన్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు. అలా ఒకప్పుడు మంచి సినిమాలలో నటించి ఆ తర్వాత కనిపించకపోయిన కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ను అభిమానులు తెగ వెతుకుతున్నారు.
దీనిలో భాగంగా రిచా pallond గురించి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఆమె ఎవరో కాదు నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్. హీరో తరుణ్ పక్కన హీరోయిన్గా నటించింది. కొన్ని రోజుల క్రితం రిచా ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి.
తాజాగా నాగార్జున సరసన మన్మధుడు సినిమాలో నటించిన అన్షు అంబానీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఈమె నట సామ్రాట్ నాగార్జునతో కలిసి మన్మధుడు సినిమాలో నటించింది. ఆ సినిమాలో పక్క తెలుగు అమ్మాయిల కనిపించి, ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది.
ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించి మెప్పించింది. శివాజీ, భూమిక, లయ కలిసి నటించిన మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత తమిళ్లో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. అది జీన్స్ సినిమా హీరో ప్రశాంతతో కలిసి జై సినిమాలో నటించింది. ఆ తర్వాత ఒక సినిమా కూడా చేయలేదు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టి ఒక్క సంవత్సరంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.
అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న టైం లో సచిన్ సగ్గర్ అనే అతనిని పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయ్యింది. అన్షు హీరోయిన్ మాత్రమే కాక ఫ్యాషన్ డిజైనర్ కూడా. తనకు సంబంధించిన ఫోటోలు, తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ, తన అభిమానులకు దగ్గరగానే ఉంది.
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అయినా టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఇప్పటికే గౌరవిస్తుంది. కొన్ని రోజుల క్రితం కృష్ణ గారు మరణించినప్పుడు, అలాగే సమంత హెల్త్ గురించి ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించింది. హిందూ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తుంది. ఇప్పుడు ఈమె ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.