Kantara: కాంతార మూవీపై, రిషబ్ శెట్టి పై స్పందించిన హృతిక్ రోషన్, నవాజుద్దీన్
ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న మూవీస్ లో కాంతార మూవీ కూడా ఒకటి. ఈ మూవీ 2022 సంవత్సరంలో విడుదలైన కన్నడ భాషకు చెందిన యాక్షన్ డ్రామా చిత్రం. ఈ కథను రాసిన వారు రిషబ్ శెట్టి. ఈ మూవీకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు.బి. అజనీష్ లోక్నాథ్ ఈ మూవీకి సంగీతం అందించడం జరిగింది.
కొద్దిరోజుల నుంచి ఈ మూవీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఈ మూవీ పై , రిషబ్ శెట్టి పై హృతిక్ రోషన్, నవాజుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ చాలా రోజులైంది. ఇప్పటికీ బాలీవుడ్ లో దీని క్రేజ్ తగ్గలేదు . సెప్టెంబర్ 30 2022 నా ఈ మూవీ కర్ణాటక మొత్తం మీద 250 కంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కానీ ఇప్పటికీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో కాంతారా మూవీ గురించి వస్తూనే ఉంది. ఈ మూవీ 16 కోట్ల బడ్జెట్తో నిర్మించడం జరిగింది. 420 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. 2022 అక్టోబర్ 14వ తేదీ ఈ మూవీ హిందీలో, అక్టోబర్ 15వ తేదీన తెలుగు, తమిళంలో రిలీజ్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే కాంతారా మూవీ తీసిన” రషబ్ శెట్టి నీ చూస్తే తనకు అసూయగా ఉందని బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకడైన నవాజుద్దీన్ సిద్ధీఖి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను ఎవరైనా గొప్ప పని చేస్తే వాళ్లపై అసూయ రావడం సాధారణమే. నాకు పోటీ పెరిగింది అనే భావన కలిగింది. అతని విషయంలో కూడా ఇలాగే అనిపించింది. చాలా అద్భుతంగా ఈ మూవీని తీశాడు.
కష్టపడి పనిచేసి రిషబ్ లాగా మంచి విజయం అందుకోవాలనిపించింది”అంటూ నవాజుద్దీన్ తన అభిప్రాయం తెలియజేశారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొని రిషబ్ శెట్టి నవాజుద్దీన్ మాటలకు స్పందిస్తూ”నవాజుద్దీన్ నటించిన ఎన్నో సినిమాలు చూశాను. శ్రమించే గుణము, చాలా కష్టాలతో ఆయన జీవితం సాగింది. ఆయన కూడా మాలాంటి మధ్యతరగతి వ్యక్తి.
మేమంతా ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఘన విజయం అందుకోవాలి అనుకుంటున్నాం. నవాజుద్దీన్ చాలామందికి స్ఫూర్తి దాయకంగా ఉంటాడు. థియేటర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి ఎన్నో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ, నేను కూడా ఈ విజయం చూడకముందు చిన్న చిన్న పాత్రలే పోషించాను. దీన్నిబట్టి మా ఇద్దరి ప్రయాణం ఒకటే అని రిషబ్ శెట్టి చెప్పారు”.
ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కూడా ఈ మూవీ తీసిన ఫిలిం మేకర్స్ ని మెచ్చుకున్నారు. ఈ మూవీ తనకెంతో నచ్చిందంటూ చెప్పుకొచ్చారు. రి ష బ్ శేట్టి పై ఈ మూవీ తీసిన విధానం పై ప్రశంసలు కురిపించడం జరిగింది.