ఒకప్పుడు టాప్-ఇప్పుడు రేటింగ్ ఫ్లాప్ అయిన కామెడీ షోలు
టెలివిజన్లో ఎన్ని షోలున్న తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న షో జబర్దస్త్. ఎంతోమంది కమెడియన్స్ ని, ఎంతోమంది ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి అందించిన షో జబర్దస్త్. ఎంతోమందికి అన్నం పెట్టి, జీవితాన్నిచ్చిన షో జబర్దస్త్. కొత్త కొత్త యాంకర్లను ఇండస్ట్రీకి అందించిన షో జబర్దస్త్.
అందరినీ నవ్విస్తూ, అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ, టెన్షన్స్ నుంచి ప్రేక్షకులను బయటికి తీసుకొస్తున్న షో జబర్దస్త్. ఈటీవీ కి సంబంధించిన రేటింగ్స్ ని నిలబెడుతున్న షో లలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ముఖ్యమైనవి. ఇది ఇంతకుముందు. ప్రస్తుతం వీటి రేటింగ్స్ పడిపోయాయి.
ఈ షోలలో బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయినా సరే ప్రేక్షకులు వీటిని చూస్తూనే ఉన్నారు. ఈ షోకు సంబంధించి కొంతకాలంగా ఎంతో మంది కమీడియన్స్ బయటకు వెళ్తున్నారు. మరికొందరు సినిమాలలో చాన్సులు వచ్చి సినిమాలలో చేస్తున్నారు.
యాంకర్స్ అయితే నేమి, జడ్జెస్ అయితే నేమి, స్టార్ కమెడియన్ అయితేనేమి. ఈ షో నుంచి బయటికి వెళ్లారు కొంతకాలంగా. మరి తమకు కావలసిన రెస్పెక్ట్ దొరకక పోవడం వలన కానీ, రెమినరేషన్ ప్రాబ్లం అయిన గాని అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఈ షోలకు సంబంధించిన రేటింగ్స్ అనేవి చాలా తగ్గాయి. ఒకప్పుడు ఈ షోలో స్కిట్ని ,స్కిట్ గానే ప్రదర్శించేవాళ్లు.
ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ షోలు ఎంత నాసిరకంగా మారినా కూడా, మిగతా చానల్లో కామెడీ షోలు పెద్దగా అందరికీ క్లిక్ కాకపోవడం వల్ల కూడా ఈటీవీ కామెడీ షోలు ప్రస్తుతం నడవడానికి కారణంగా చెప్పొచ్చు. ఇదంతా కూడా గతమే. ప్రస్తుతం జనాలు జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ షోలను కూడా చూడడం మానేశారు.
ఈ షోలో కొత్తగా చేరిన కమీడియన్స్ లో నూకరాజు, ఇమ్మానుయేల్ తప్ప మిగతావారు అంత గా కామెడీ చేయట్లేదు. ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం తక్కువైంది. గతంలో ఈటీవీలో టాప్ 30 లో జబర్దస్త్, జబర్దస్త్ కచ్చితంగా ఉండేవి. ప్రస్తుతం టాప్ 30 లో ఈ షోలు లేవు.
గత వారంలో జబర్దస్త్ షో కి సంబంధించిన బార్క్ రేటింగ్ చూస్తే 3.19. ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన పార్క్ రేటింగ్ గతవారం ది చూస్తే2.86 స్థాయికి పడిపోయింది. అక్టోబర్, నవంబర్ నెలల నుంచి ఈ డౌన్ ఫాల్ అనేది ఎక్కువవుతుంది. కొద్దిగా బెటర్ రేటింగ్స్ ఉండే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా3.82 రైటింగ్స్ కి పడిపోయింది.
రేటింగ్స్ ఈ విధంగా పడిపోవడం వల్ల మల్లెమాల సంస్థకి, ఈటీవీ కి కాస్త కళ్ళు తెచ్చుకున్నాయి. ఈ సంస్థ ఈగో లకు పోకుండా సీనియర్ కమెడియన్స్ ని మళ్లీ జబర్దస్త్ షోలోకి పిలుస్తుంది. కొత్త టీమ్ లు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇటీవల కాలంలోనే సద్దాం, యాదమ్మ రాజు, శాంతికుమార్ వచ్చి చేరారు. శాంతి కుమార్ చాలా రోజులుగా బుల్లితెరపై కనబడట్లేదు.
ఇక సద్దాం, యాదమ్మ రాజు అయితే ఆహా ఓటీటి లో వచ్చే కామెడీ ఎక్స్చేం జూలో చేస్తున్నారు. మంచి టైమింగ్, ఎనర్జీ ఉన్న కమెడియన్సు వీళ్లే. పనిలో పనిగా హరిని కూడా తీసుకొచ్చిం టే సరిపోయేది. వేణు, అవినాష్ ఆహా ఓటీటిలో చేస్తున్నారు. గతంలో వీళ్ళకి ఈ కమెడియన్స్ తో గొడవల కారణంగా పిలవలేదు. మిగతా వారితో పెద్దగా గొడవలు ఏం లేవు.
వీళ్లంతా ఈటీవీ ప్లస్ పటాస్ షో లో కనిపించిన వాళ్లే కాబట్టి పెద్దగా గొడవలు ఏం లేవు. ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్స్ పడిపోవడం కారణంగా కొత్త యాంకర్ సౌమ్య ను తీసేస్తారేమో. ప్రస్తుతానికి తను బాగానే యాంకరింగ్ చేస్తుంది. చాలా సీనియర్ యాంకర్ అయిన రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా రేటింగ్స్ లేవు కదా!