అభిమానులకు షాక్ ఇచ్చిన బుల్లితెర నటి తేజస్విని గౌడ…

బుల్లితెర నటి తేజస్విని  ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. తేజస్విని గౌడ తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎటువంటి ప్రకటన చేయకుండానే బుల్లితెర నటుడు అమర్దీపుతో (3-8-2022) ఎంగేజ్మెంట్ జరిగింది. అమర్దీప్ తేజస్వినిల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ పూలదండలు మార్చుకొని సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ ఫంక్షన్ కు బిగ్ బాస్ బ్యూటీ హరియన హాజరైంది. ప్రముఖ సిని తారలు బుల్లితెర నటులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

తేజస్విని గౌడ భారతీయ తమిళ భాష నటి. ఈమె మోడల్ మరియు సీరియల్ ఆర్టిస్ట్. 22-నవంబర్ 1995 సంవత్సరంలో కర్ణాటకలోని సిరా లో జన్మించింది. తండ్రి గౌడ తల్లి భ్రమరాంబ ఉపాధ్యాయురాలు.ఈమె తన పాఠశాల చదువును కన్నడ భాషలోనే పూర్తి చేసింది. 2010లో బెంగుళూరులోని రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ని పొందింది. 2018 లో కన్నడ సీరియల్ బిలిహైంఠ్డ్ తో నటనను ప్రారంభించింది.

తెలుగులో  2019లో వచ్చిన కోయిలమ్మ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. తమిళంలో సుందరినీయుమ్, సుందరి నానుమ్ సీరియల్ లో కూడా నటించింది. అశ్విని స్టార్ మా టీవీ రియాలిటీ గేమ్ కు హాజరయ్యి టైటిల్ ని గెలుచుకుంది. ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తుంది ఇది స్టార్ మా లో 2021 నుండి ప్రసారం అవుతుంది. ఈమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

అమర్దీప్ పూర్తి పేరు అమర్దీప్ చౌదరి. అతను భారతీయ నటుడు. మరి డాన్సర్ కూడా. అమర్దీప్ నవంబర్ 20 -1990 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జన్మించాడు. సీరియల్స్ వెబ్ సిరీస్, సినిమా, షార్ట్ ఫిలిం నటనకు అమర్దీప్ పెట్టింది పేరు. అమర్దీప్ తల్లిదండ్రులు ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్స్. అందుకే అతను కూడా డాన్స్ ను నేర్చుకున్నాడు.

అతను దమ్ దమ్ దిగ దిగా డాన్స్ షోలో మూడు సీజన్లో టైటిల్ని గెలుచుకున్నాడు. ఈటీవీలో ప్రసారం అయ్యే డాన్స్ బేబీ డాన్స్ సోలో కూడా పాల్గొన్నాడు. కంప్యూటర్ సైన్స్ లో బ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీ చేశాడు. మాస్టర్ ఆఫ్ సైన్స్ చదవడానికి యూకే లండన్ కు వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత నటించాలన్న కోరికను నెరవేర్చుకోవాలని 2016 లో వచ్చిన షార్ట్ ఫిలిం తో నటుడుగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇది పెద్ద విజయాన్ని అందించింది. ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు ,సీరియల్స్ లో కూడా పనిచేశాడు. ఇవేకాక సాఫ్ట్ర్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు.

మంగమ్మగారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ,కపుల్ వర్క్ ఫ్రంహోం, రాజు గారి కిడ్నాప్, వెన్ యు మ్యారి యువర్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ,లవ్ యు జిందగీ ,లాంటి అనేక వెబ్ సిరీస్ లో నటించారు. విధంగా అనేకమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.  ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా తెలుగులో నటనను ప్రారంభించాడు.

2021లో జానకి కలగనలేదు సీరియల్ లో రాముడిగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కేరాఫ్ అనసూయ స్టార్ పరివార్ లీగ్, ఆయుష్మాన్ భవ, కృష్ణార్జున యుద్ధం ,హరితో వాసిని మొదలైన వాటిలో నటిస్తున్నాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker