Gandhada Gudi Trailer:పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్- స్పందించిన నరేంద్ర మోదీ
Gandhada Gudi Trailer: కన్నడ పవర్ స్టార్ గా అభిమానుల హృదయాలలో చోటు సంపాదించుకున్న పునీత్ రాజకుమార్ 46 సంవత్సరాల వయస్సు లో అక్టోబర్ 29 2021న గుండెపోటుతో మరణించారు అన్న విషయం అందరికీ తెలిసిందే. పునీత్ రాజకుమార్ మరణంతో కేవలం కన్నడ ఫిలిం ఇండస్ట్రీనే కాదు, భారతీయ మూవీ ప్రపంచమే ఉలిక్కిపడేలా చేసింది.
మూవీ మేకర్స్ ఇప్పుడు ఆ సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినీ మేకర్స్ ఆ పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పునీత్ నటించిన గంధద గుడిఅనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పునీత్ రాజకుమార్ మొదటి వర్ధంతికి ఒకరోజు ముందే అంటే 28 అక్టోబర్ 2022 న థియేటర్ లలో ఈ మూవీ విడుదల అవుతుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.
ఈ మూవీ ట్రైలర్ ని పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని సోషల్ మీడియాలో ట్విట్టర్ లో షేర్ చేశారు. నమస్తే నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు భావోద్వేదమైన రోజు గంధద గుడి ట్రైలర్ ని విడుదల చేస్తున్నాం.
ప్రాజెక్టు అప్పు హృదయానికి చాలా దగ్గర అయింది. అప్పు ఎప్పుడు మీతో జరిగిన ఇంటరాక్షన్స్ ని ఎంతో ఆదరించేవాడు. దానిని ఇష్టపూర్వకంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడేవాడు అనే క్యాప్షన్ తో ఈ మూవీ టైలర్ లింకును ట్విట్టర్ లో షేర్ చేశారు అశ్విని పునీత్ రాజ్ కుమార్.
అదిరిన బాలయ్య అన్ స్టాప పబుల్ 2 ప్రోమో స్ట్రీమింగ్ డేట్ ప్రకటన..
పునీత్ రాజ్ కుమార్ గారి భార్య అశ్విని ట్విట్ కు ప్రధాని మోదీ స్పందించారు. పునీత్ వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ప్రజల హృదయాలలో జీవిస్తూనే ఉంటాడు. అతను శక్తివంతమైన, అద్వితీయమైన ప్రతిభను కలిగినవాడు. గంధద గుడి మూవీకి కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి పర్యావరణ పరిరక్షణకు నివాళి. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు అంటూ అశ్విని ట్విట్ కి నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు.
దివంగత కథానాయకుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లాస్ట్ మూవీ గంధద గుడి జాతీయ పురస్కార గ్రహీత అమోఘ వర్ష దర్శకత్వం వహించాడు. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. అది చూస్తే అడవిలో నివసించే వన్యప్రాణుల మధ్య తీసినట్లు తెలుస్తుంది. ఓ స్పెషల్ ఐర్లాండ్ కు పునీత్ వెళ్లడం.. ఆ ఐర్లాండ్లో వైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం ఈ ట్రైలర్ చూపించారు. అభిమానులు ఈ ట్రైలర్ చూసి డిస్కవరీ ఛానల్ లో విజువల్స్ కి ఏమాత్రం తక్కువగా లేకుండా చూపించారు. ఇందులో సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్ని బాగున్నాయి.