Prabhas UV creation: ప్రభాస్ సొంత సంస్త పై జీఎస్టీ అధికారుల దాడులు

Prabhas UV creation: ప్రభాస్ సొంత సంస్త పై జీఎస్టీ అధికారులు సోదాలు చేయటం జరిగింది యూవీ క్రియేషన్స్ ఆఫీసులో ఇటీవల జరిగిన జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహించారు. హైదరాబాద్​లోని ఆఫీసులో సోదాలు నిర్వహించి. వస్తున్న ఆదాయం మరియు చెల్లిస్తున్న జీఎస్టీకి తేడాగా ఉండడాన్ని అధికారులు గమనించరు .

మరింత లోతైన పరిశీలన చేయుటకు సంస్థకు చెందిన అన్ని పత్రలను స్వాధీనం చేసుకున్నారు. టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటీ అయిన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద జీఎస్టీ అధికారులు దడులా విషయం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Prabhas UV creation
Prabhas UV creation

పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ ఆఫీసుల మీద తనికిలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు విడుదల చేసిన సమయాలలో ఏదైనా పన్ను ఎగవేశారా? లేదా అనే విషయం మీద అధికారులు సోదాలు చేసి ఆరా తీసినట్లు ఫిల్మ్ నగర్ లో ప్రచారం కొనసాగుతోంది.

అయితే జీఎస్టీ అధికారుల తనిఖీ విషయాలు మాత్రం ఆలస్యంగా బయటకు వచ్చాయి. కాగ ఈ తనిఖీ జరిగిన విషయం మీద అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు .యూవీ క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి సోదాలు సర్వ సాధారణం అని చెబుతోంది.

అయితే యువీ క్రియేషన్స్ సంస్థను హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుసకు సోదరుడైన ఉప్పలపాటి ప్రమోద్ ఆయన స్నేహితులు వంశీకృష్ణా రెడ్డి, విక్రమ్ కృష్ణా రెడ్డి తో ముంబై బేస్ తో 2013లో ప్రారంభించారు . ఈ సంస్థ ప్రభాస్ హీరోగా సూపర్ హిట్ గా నిలిచిన తెలుగు ఫిల్మ్ మిర్చి తీశారు.

ఆ తర్వాత నాని హీరోగా భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా , రన్ రాజా రన్, మహానుభావుడు శర్వానంద్ హీరోగా , గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ, విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా ,ప్రభాస్ హీరో గా నటించిన రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు నిర్మించారు. ఇప్పుడు
త్వరలో రాబోతున్న ఆది పురుష్ ని కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker