Guppedantha manasu serial today episode:తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్న వసుధార

తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్న వసుధార:

దేవయానిని బెదిరించిన సాక్షి:

సాక్షి నువ్వంటే రిషికి ఇష్టం లేదు. రిషి నిన్ను ప్రేమించట్లేదు. నిన్ను పెళ్లి చేసుకోడని దేవయాని అంటుంది. మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. రిషి నన్నే పెళ్లి చేసుకోవాలి అంటుంది సాక్షి. రిషి నిన్ను ప్రేమించలేదు. నువ్వంటే రిషి కి ఇష్టం లేదు. ఇంట్లో వారికి ఎవరికీ ఇష్టం లేదు. అని అంటుంది దేవయాని. ఏంటి మీరు రిషి కి సపోర్ట్ చేస్తున్నారా అంటుంది సాక్షి. అవును నువ్వు ఏం చేస్తావో చేసుకో. నువ్వేం చేసుకున్నా మాకు నష్టం లేదు నిన్ను మాత్రం రిషి పెళ్లి చేసుకోడు అని చెబుతుంది దేవయాని.

ఇంతవరకు నాకు సపోర్ట్ చేశారు. పెళ్లి చేస్తానన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. నేనంటే ఏంటో నిరూపిస్తాను అని బెదిరిస్తూ ఇదే ఇంట్లో నేను విషం తాగి చనిపోయి దానికి కారణం మీరే అని చెప్పి రెండు రోజుల్లో లగ్నపత్రిక రాసుకోవడానికి పిలుపు రావాలి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి.

కారు ఆగిపోయి ఏం చేయాలని రిషి, వసుధార ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీరు చాలా మంచివారు. మిషన్ ఎడ్యుకేషన్ ద్వారానే మా పిల్లలు చదువుకుంటున్నారు. మా ఇల్లు ఇక్కడే. మీరు మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోండి. మెకానిక్ వచ్చి కారు రిపేర్ చేస్తాడు. రండి వెళ్దాం అని తీసుకొని వెళ్తాడు.

రిషికి అబద్ధం చెప్పమన్నా దేవయాని: దేవయాని తన భర్తతో సాక్షి నన్ను ఎన్నో మాటలు అన్నది. చాలా బెదిరించింది. నామీద కేసు కూడా పెడతానంది. నాకు చాలా భయంగా ఉంది. రిషి నా పక్కన ఉంటే ఇలా జరిగేది కాదు అంటూ గౌతమ్ నాకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి రిషికిచెప్పు. ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని చెప్పమని దేవయాని అంటుంది. జగతి దేవయాని అందరూ కలిసి రిషి మహేంద్ర వచ్చాక ఈ విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ అనుకుంటారు. 

రిషి ,వసుధార దామోదర్ ఇంటికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటూ, మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. భోజనం చేయండి మీ కారు రిపేరు కావటానికి చాలా లేట్ అవుతుందని అనగా రిషి సరే అంటాడు.

దేవయానిని ఎందుకు భయపడుతున్నావు అని ప్రశ్నించిన జగతి: దేవయాని నీ కాఫీ తీసుకోమని తన కోడలు ధరణి అంటుంది. సాక్షి మీద కోపంతో ధరణిని అరుస్తూ ఉండగా జగతి అక్కడికి వచ్చి ఏమైంది అంటుంది. సాక్షి గురించి భయపడుతున్నాను. నీకేం మీరు బాగానే ఉన్నారు సాక్షి కోపం నా మీదనే చూపిస్తుంది. నా మీద కేసు పెడతానంది. దానితో నాకు భయంగా ఉంది. నాకేమో అవుతుందని కాదు. కాలేజ్ పరువు పోతుందని, కుటుంబం పరువు పోతుందని, రిషి బాధపడతానని పడతాడని ఆలోచిస్తూ ఉన్నాను అంటుంది దేవయాని. అవసరం లేని విషయాల గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు. సాక్షికి మీరు భయపడడం ఏంటని అడుగుతుంది జగతి. బెదిరింపులు ఎవరు చేశారని కాదు. కుటుంబం పరువు మీద పుడుతుంది. నన్ను రిషి మాత్రమే అర్థం చేసుకుంటాడు మీరు అర్థం చేసుకోరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.

రిషి పై ప్రేమను చెప్పబోతున్న వసుధార: ఇక్కడ దామోదర్ ఇంట్లో పిల్లలు చదువుతుండగా కరెంట్ పోతుంది. వసు ఫ్యూజ్ పోయిందని బాగు చేస్తూ ఉండగా ఉరుముల శబ్దానికి భయపడి రిషి మీద పడుతుంది. ఒకరినొకరు చూస్తూ వసు మనసులో ఏముందో ప్రేమ గురించి చెప్పడం లేదనిరిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. వసు తన ప్రేమ విషయం రిషికి చెప్పాలని నిర్ణయించుకొని రిషితో చెప్పాలనె లోపు దామోదర్ భార్య అయిపోయిందా అని అడుగుతుంది. వసు, రిషి మీద నుండి లేచి ఫ్యూజ్ పెడుతుంది. దామోదర్ తన భార్య వారి దగ్గరకు వచ్చి భోజనం చేయండి. మెకానిక్ రాలేదు. అందుకని రాత్రి ఇక్కడే ఉండమని వేడుకుంటారు. దానికి రిషి సరే అంటాడు. ఇక్కడ జగతి ,మహేంద్ర గౌతమ్, సాక్షికి అంత ధైర్యం ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటారు.

 ఇది 520 ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ కథ. 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker