Guppedanth manasu today: రిషి మనస్సు మార్చాలని ప్రయత్నిస్తున్న వసుధార!
బయట ఉన్న వసుధారను చూడగానే కోపంతో సాక్షి అసలు నిన్ను అనాలి. నువ్వు ఎందుకు వచ్చావు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది అని అంటుంది. సాక్షి ఏం మాట్లాడుతున్నావ్ అని వసుదార అడుగుతుంది. అంతా నీవల్లే జరిగింది. నా జీవితం అంతా నాశనం అవుతుంది నీవల్ల. వెళ్ళిపొమ్మని సాక్షి అంటున్నాగా రిషి తలుపులు తెరిచి వసుధారని చూస్తాడు.
ఇదినిన్న జరిగిన 524 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి ని కలవాలని నిర్ణయించుకున్న వసుధార: నాతో చిన్న పని ఉండి వచ్చింది అని రిషికి చెప్పగానే రిషి నేను అడగలేదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాక్షి మాటలు గుర్తుకు చేసుకొని మేడం నేను రిషి సార్ తో మాట్లాడుతాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అర్థం కావడం లేదు అంటుంది. ఇది కరెక్ట్ టైం కాదు, రిషి మూడ్ ఆఫ్ లో ఉన్నాడు, ఎప్పుడు వెళ్లి మాట్లాడడం సరైన పద్ధతి కాదు నా మాట విని సైలెంట్ గా ఉండు రిషిని చూడాలని వచ్చావు, చూసి వెళ్ళమని వసుధారకు చెప్తుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తెలుసుకొని బాధ్యత ఉంది.
హక్కులు ,బాధ్యతలు ఇప్పుడు సమయం కాదు మనం రిషి నీ ఈ విషయం గురించి అడిగితే ఊహించని పరిణామాలు జరుగుతాయి. నా మాట విని సైలెంట్ గా ఉండమని జగతి అంటుంది. సరే నేను అడగను అని చెప్పి వసుధార వెళ్తు మెట్లమీద కింద పడుతుండగా రిషి వచ్చి పట్టుకుంటాడు. చూసుకోలేదు అంటుంది. రిషి ఆ పరధ్యానం ఏంటని అడుగుతాడు, పరధ్యానమేమీ లేదు మీ ధ్యానమే అంటుంది వసు. ఏంటని అడుగుతాడు వినపడింది కదా మళ్ళీ అడుగుతారు ఎందుకు? మనం ఒకసారి మాట్లాడాలని అంటుంది వసుధార.
లగ్న పత్రిక రాసుకోవడానికి సాక్షి తల్లిదండ్రులు వస్తున్నారని చెప్పిన దేవయాని: రిషి ,వసు దగ్గరికి దేవయాని వచ్చి సాక్షి వాళ్ళ తల్లిదండ్రులు రేపు లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తున్నారంట అని చెప్పి వసుధారను చూస్తూ నువ్వు కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంటుంది. వసు సరే అని సమాధానం ఇస్తుంది. రిషి కూడా సరే అని చెప్పి పని ఉందని బయటికి వెళ్తాడు.
దేవయానిని పెళ్లి ఆపేయమని వేడుకున్న మహేంద్ర:
దేవయాని మహేంద్ర దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడే ఉన్నావా, నిన్ను పిలవాలని అనుకుంటున్నాను, ధరణి అందరికీ మంచి స్వీట్ చెయ్యి, ముఖ్యంగా జగతికి ఏ స్వీట్ కావాలో అడిగిమరీ చేయమని చెప్తుంది. ఎందుకు అని మహేంద్ర అడుగుతాడు. లగ్నపత్రిక రాసుకోవడానికి సాక్షి పేరెంట్స్ వస్తున్నారని చెబుతుంది. ఇది కరెక్ట్ కాదు, సాక్షిని వద్దు అనుకున్నాడు రిషి, ఇప్పుడు ఎందుకో తెలియదు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని మహేంద్ర అంటాడు. ఇవన్నీ తెలిసిన వాడివి ఇది కరెక్ట్ కాదని ఎలా అంటున్నావు అంటుంది దేవయాని. మీకు దండం పెడతాను, ఈ పెళ్లి ఆపేయండి అని దేవయానిని వేడుకుంటాడు. ఈ పెళ్లి వద్దని సాక్షితో నేను కూడా గొడవపడ్డాను కదా. ఈ పెళ్లికి రిషి ఒప్పుకున్నాడు. నేను సరే అన్నాను అంటుంది.మీరు ఏం చెప్తే అది వింటాం .
జగతిని రిషి జీవితాంతం అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు మేము ఎప్పుడూ మీకు ఎదురు చెప్పను, ఈ పెళ్లిని ఆపేయండి. ఈ పెళ్లికి నాకు ఏంటి సంబంధం రిషి ఒప్పుకున్నాడు, నేను ఓకే అన్నాను. నీకు బాధగా ఉంటే నీ కొడుకు కునువ్వే వెళ్లి చెప్పుకో అంటుంది. జగతి చాలా పండుగలకు కారణాలు రాక్షసులు పోవడమే అని మనకు తెలుసు కదా, అలాగే ఏదో ఒక రోజు మనసులలో నుంచి రాక్షసత్వం పోతుంది. మహేంద్ర పోవాలని ఆశించాలి, ఎవరిని బతిమాల వద్దు, అంతే కానీ ఏదైనా మంచి పని జరగాలి అని కోరుకోవాలి. అదే చెయ్యకూడని పని అయితే జరగవద్దు, జరగదు అని మనసులో గట్టిగా అనుకోవడమే మంచిదని మహేంద్రను జగతి అంటుంది. ఈ పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో, ఈ పెళ్లి జరగదని దేవయానిని అంటుంది జగతి. దేవయాని సరే అని చెప్పి వెళ్ళిపోతుంది.
రిషి మనసును మార్చడానికి ప్రయత్నిస్తున్న వసుధార: వసుధార, రిషి కారుకు అడ్డంగా వెళుతుంది. రిషి ని మీతో మాట్లాడాలి అంటుంది. మీకు చెప్పే బాధ్యత నాకు ఉందని అనుకుంటున్నాను. రిషి వద్దని అంటాడు. నేను నిర్ణయం తీసుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తాను అంటాడు. మీరు ఎవరికి సమాధానం చెప్పకపోయినా మీ మనసుకు మీరు సమాధానం ఇవ్వాలి అంటుంది.
ఇష్టం వేరు, జీవితం వేరని ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకో నీ ఆశలు నీవి ,నా ఆశయాలు నావి అంతే కానీ, నీ మీద అభిమానం నాకు దక్కదు, నామీద గౌరవం నీకు దక్కదని దానిని గురించి మాట్లాడటం అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని అంటాడు రిషి. సాక్షి ఎలాంటిదో మీకు తెలుసు, ఏం చేసిందో కూడా మీకు తెలుసు అయినా మీరు సాక్షిగా చేసుకుంటానని అనడం నాకు అర్థం కావడం లేదు. నేను కాలేజీ ఎండి, విద్యాసంస్థలను నడిపే వాడిని. నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానని నువ్వెలా అనుకుంటావు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నా జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. నా గురించి నువ్వు బాధపడుతున్నావు కొన్ని రోజుల క్రితం జరిగినవి గుర్తుకు చేసుకోమని అంటాడు రిషి.
రిషి గురించి బాధపడుతున్న జగతి, మహేంద్ర: రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు. సాక్షితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు. ఎందుకు వాడి మనసులో ఇలాంటి ఆలోచన పెరిగింది ఎందుకని మహేంద్ర ఏడుస్తూ ప్రతి చిన్న విషయాన్ని నాతో చర్చించేవాడు. ఇప్పుడు ఏమయింది నా ఫ్రెండ్ షిప్ ను కటీఫ్ చేశాడని అంటాడు. నువ్వు తప్పు చేశావు అని అడిగితే నేను సరి చేసుకునే వాడిని. వసు అంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు వసూ సంగతి ఏం చేద్దాం అని మాట్లాడవేంటి జగతి అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నాకు కూడా సమాధానం తెలియదని జగతి అంటుంది.
కొడుకు ఎదిగిపోతూ పోతూ ఉంటే చాలా ఆనందపడే వాడిని, నన్నే కాదు అనే ఎత్తుకు ఎదిగిపోయాడని మహేంద్ర అంటాడు. దీనికి ఒక రకంగా నేను కూడా కారణం. నా ఉనికిని భరించలేని రిషి ఎదురుగా నేను ఇక్కడ కనిపిస్తున్నాను. నేను ఈ ఇంటికి రావడానికి నువ్వే కారణం. మన ఇద్దరం ఒకటయ్యామని రిషి నీకు దూరమయ్యాడేమో? మనం దీని గురించి తెలుసుకోలేకపోయాం అంటుంది జగతి. మన కోసం మనం ఆలోచించి స్వార్థపరులయ్యామా అంటాడు మహేంద్ర. తెలిసో తెలియకో మనం రిషి విషయంలో తప్పు చేశామని ఒప్పుకోవాలని జగతి అంటుంది. ఇది ఈరోజు జరిగిన 524 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.