Guppedantha manasu serial today: రిషి కి తన ప్రేమ గురించి చెప్పి దగ్గరవుతున్న వసుధారా

 రిషి కి తన ప్రేమ గురించి చెప్పి దగ్గరవుతున్నవసుధారా:

జగతితో, మహేంద్ర, రిషి వసుధార కలిసినప్పుడు లక్ష్యం గెలుపు అంటాడు, వారి ప్రేమ గురించి చెప్పడు. అని అనుకుంటూ ఉండగా, గౌతమ్ వచ్చి వసుధారా వచ్చి వెళ్లిన విషయం చెప్తాడు. జగతి నన్నెందుకు కలవకుండా వెళ్ళిపోయింది అని  ఆలోచిస్తూ ఉంటుంది. వసు రిషి గురించి మాట్లాడుతూ ,ఆలోచిస్తూ వెళ్తుంది. జగతి ఫోన్ చేసి ఏమైంది కల్వకుండ వెళ్లిపోయావు గొడవ పడ్డారా అని అడిగి, అన్ని విషయాలు పక్కన పెట్టి లక్ష్యం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు గెలవాలని అంటుంది.

 ఇంతలో సాక్షి వచ్చి వసుధారతో మాట్లాడుతూ రిషి బంగారం కాదు, కాకి బంగారం, రోల్డ్ గోల్డ్ ఈపాటికి రింగ్ తొడిగి ఉంటాడని అనుకున్నాను, ఇంకా లేదా చరిత్రలో నిలిచి పోయేంత గొప్ప ప్రేమ కాదు. ఎప్పుడో ఒకసారి మునిగిపోతావు జాగ్రత్త అని చెబుతుంది. నా గురించి నువ్వు ఆలోచించకు నాకు తెలుసు అని అంటుంది. రిషి సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జాగ్రత్త అని చెప్పి వసుధార వెళ్ళిపోతుంది. కాలేజీలో రిషి సార్ కారే కదా అని గుర్తించి, ఏంటి ఇదంతా నేను చెప్పింది వినరు చెప్పేదాకా వినాలి కదా ,చెప్పక ముందే సరే అని స్టైల్ గా చెప్తారు ,అనీ కార్ తో మాట్లాడుతుంది. మీరు నా ఎదురుగా కనిపిస్తే పట పట అని ప్రశ్నలు అడుగుతాను అంటుంది వసుధార.

ఇది నిన్న జరిగిన 535 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్.

వసుధార మాటలు విన్న రిషి: వసుధార అన్న మాటలకు రిషి తన ఎదురుగా నిలబడతాడు. అది చూసిన వసుదారా దగ్గరకు వచ్చి కంగారుపడుతూ మీరేంటి ఇక్కడ అని అడిగి, మొత్తం విన్నారా అంటూ, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది.  ఎదురుగా వస్తే మామూలుగా ఉండదు, టపటపామని అడుగుతానన్నావు అని అంటాడు రిషి . ఏమీ లేదు, నేనేమీ అడగను అని క్లాస్ కు టైం అవుతుంది వెళ్తాను అంటుంది వసుధర. మొత్తం చదివాను అన్నావు కదా బుక్కు ఇవ్వమని రిషి అడుగుతాడు, అలాగే అని వసుధర బుక్ ఇస్తుంది రిషి బుక్ తీసుకొని, నాకు మీటింగ్ ఉందని వెళ్తుండగా, వసుధార కార్ తో మాట్లాడకూడదని అనుకోని వెళ్ళి పోతుంది.

ఫేర్ వల్ ఫేర్వెల్ పార్టీ చేయాలి అన్నరిషి: ఎగ్జామ్స్ వచ్చాయి అని లెక్చరర్స్ మాట్లాడుకుంటూ ఉండగా రిషి వస్తాడు. జగతి రిషి తో మాట్లాడుతూ మన ప్రిపరేషన్ అంతా కరెక్ట్ గా ఉందని అంటుంది. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ రిజల్ట్స్ తెచ్చుకోవాలని అంటారు లెక్చరర్స్. స్పెషల్ క్లాస్ పెట్టించమంటారా అని అంటారు.

ఎక్కువ సేపు చదవడం వల్ల మార్పులు రావు, వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. అప్పుడే బాగా చదవగలరని రిషి సమాధానం ఇస్తాడు. జగతి మేడం చెప్పిందే రిషి సార్ చెప్పారని అందరూ అనుకుంటారు. వాళ్లు ఫ్రీగా ఉండేలా చేయాలని ఫేర్వెల్ పార్టీని చేద్దాం, వాళ్లని కూల్ గా చేసి చదువుకోవడం కోసం స్పీచ్ లు ఇద్దాం. అని చెప్పి నోటీస్ బోర్డులో కూడా ఫేర్వెల్ పార్టీ గురించి పెట్టమని చెప్తా డు.

ఎగ్జామ్స్ అయిపోతే రిషి వసుధారాలు కూడా దూరం అవుతారని అనుకుంటున్నా జగతి మహేంద్ర గౌతమ్: ఎగ్జామ్స్ అయిపోతే స్టూడెంట్స్ వెళ్లిపోతారు. అలాగే రిషి ,వసుధార కూడా విడిపోతారు. పరీక్షలు అయ్యే లోపల వారిద్దరి మధ్య అపార్ధాలు తొలగి, ఇద్దరూ కలిసి పోతే బాగుంటుందని, వసు ప్రక్కన ఉంటే రిషికి ప్రతిరోజు అందమైన జ్ఞాపకంగా ఉంటుందని, జగతి మహేంద్ర తో అంటుంది. దీని గురించి ఏం చేయాలో గౌతమ్ కు చెప్పాను అని మహేంద్ర అంటాడు.

రిషి దగ్గరికి గౌతమ్ రాగానే నేను నీతో తరువాత మాట్లాడతాను నువ్వు వెళ్ళిపో అంటాడు. గౌతమ్ ఫేర్వెల్ అంటే వీడ్కోలు అని చెప్పి వసుధార నిన్ను ప్రేమిస్తుంది కదా, అది నిజమే కదా అని అడుగుతాడు. ఇప్పుడు దాని గురించి అవసరం లేదని అంటాడు రిషి ఒకసారి ఏదో జరిగిందని, అలాగే ఉంటే ఎలా నీ మనసులో ఏముందో నాకు చెప్పు,నేను వెళ్లి మాట్లాడతాను అని అంటాడు గౌతమ్. ఒక సమస్య వచ్చింది దానంతట అదే తీరిపోతుందని అంటాడు. రిషి నీకు అర్థం కాని విషయం ఏమిటంటే మీరిద్దరూ విడిపోతారు. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ రాసుకోవచ్చు, కానీ మీరు మళ్ళీ కలుసుకోలేరు నీ మనసులో ఏముందో చెప్పు, నేను వెళ్లి మాట్లాడుతాను అని అంటాడు గౌతమ్. దేనికైనా టైం ఉంటుంది. నేను ఏం చేయాలో అది చేస్తాను అంటాడు రిషి. 

ప్రాబ్లమ్ ఏమి లేదు వసుధారను వదులుకోకు, చిన్నచిన్న విషయాలకు గొడవ పడుతుంటారు, వసుధార బంగారం, ఎట్టి పరిస్థితుల్లో తనను వదులుకోవద్దని గౌతమ్ చెప్తున్నా మాటలు వసుధార విని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

 తన మనసును అర్థం చేసుకునేలా రిషి సార్ ను మార్చమని అమ్మవారిని వేడుకున్న వసుధార: వసుధార దేవత దగ్గరికి వచ్చి  అందర్నీ వదిలేసి వచ్చాను. నాకు కొంచెం ధైర్యం ఇవ్వు. రిషి సార్ను నాకు దూరం చేయకు, రిషి సార్ నా మనసు అర్థం చేసుకునేలా చెయ్యి, నాకు కష్టం వచ్చినా నీకే చెబుతున్నాను, సాక్షి గండం నుంచి రిషి సార్ ను నువ్వే తప్పించావు, నా మనసులో మాట రిషి సార్ వినేలా చేయమని వేడుకుంటుండగా మహేంద్ర అక్కడికి వస్తాడు . వసు అతనిని చూసి అమ్మవారిని అడిగింది విన్నారా సార్ అంటుంది. కొంత విన్నాను ,కొంత అర్థం చేసుకున్నాను అని చెప్పి, డబ్బులు దాచుకున్నట్లుగా మనసును దాచుకుంటే లాభం ఉండదు. మీరిద్దరూ కలవాలని జగతి నేను కోరుకుంటున్నాను, మనసులో మాటను చెబితే ప్రయోజనం ఉంటుంది. ఒక్క అడుగు ముందుకు వేయమని చెప్పి, నీకు దండం పెడతాను మౌనంగా ఉండడం అన్నిసార్లు మంచిది కాదని చెప్పి అమ్మవారికి మొక్కి  వెళ్ళిపోతాడు.

వసుధార నాకెందుకు అర్థం కావటం లేదని అన్న రిషి: వసుధార ఫోటోను చూస్తూ, నాకు అర్థం కాని పజిల్లా మిగిలిపోతున్నావు. నేనేంటో నాకు అర్థం కానప్పుడు, పూర్తిగా అర్థం అయ్యావు. నాకు నేను అర్థం అయ్యాక, నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నావని అనిపిస్తుంది. నన్ను నేను తెలుసుకునేలా చేశావు, నువ్వు అర్థం కాకుండా ఉన్నావు. అని ఆలోచిస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు .ఇక్కడ వసుధార V ,Rఅక్షరాలను అనుకొని సంతోషంగా ఉంటూ ఉంగరాన్ని చూస్తూ ఉంటుంది .

రిషి సార్ దూరంగా ఉంటే ఉండలేను, దగ్గరికి వస్తే మాట్లాడలేనని వసుధార అనుకుంటుంది. ఎగ్జామ్స్ అయిపోతే  వసుధార నాకు కనిపించనంత దూరంగా వెళ్లిపోతుందా, వద్దనుకున్న సాక్షి తనంతట తానే దూరం అయ్యింది. కావాలి అనుకున్న వసుధార ఎందుకు దగ్గర కావడం లేదు, వసుధారనే అంతిమ గమ్యమా, నా వైపు నుంచి తప్పుందా, అని ఆలోచిస్తుంటాడు రిషి. ఇక్కడ వసుధార నా వైపు నుంచి తప్పు ఉంది దానిని సరిదిద్దుకుంటానని అంటుంది.

 ఇది ఈరోజు జరిగిన 536 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker