Guppedantha manasu serial today:మనం కలుసుకోవడం కుదరదు అని వసుధారకు షాక్ ఇచ్చిన రిషి
మనం కలుసుకోవడం కుదరదు అని వసుధారకు షాక్ ఇచ్చిన రిషి: గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కధ.
నేను నో అన్నానని బాధపడుతుంటారు. నేను ఏమీ చెప్పలేకపోయాను, అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారో అని ఇన్ని రోజులు ఆగిపోయాను. నేను నా జీవితంలో గొప్ప లక్ష్యం పెట్టుకున్నాను. ఎన్నో అనుకున్నాను, మీ బాధ ముందు అదేమీ గుర్తుకు రావడం లేదు. మీరే గుర్తుకు వస్తున్నారు. నాకు మీరు కావాలని, మీ ప్రేమ కావాలి ,మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలి,” వి “అనే అక్షరం ఒంటరి అక్షరం. ఆ అక్షరానికి “ఆర్” అనే అక్షరం తోడవ్వాలి అందుకే ఈ రెండు అక్షరాలను కలిపానని, ఉంగరాన్ని చూపిస్తూ రిషి లేకుండా వసు పూర్తి అవ్వదు. మీరు లేకుండా ఈ వసుధార ఉండదు, గిఫ్ట్ను చూపిస్తూ ఇక్కడ రెండు గుండెలు ఉన్నాయి ,వాటి చప్పుడు మాత్రం ఒక్కటే అది ప్రేమే. అని నన్ను క్షమించి, నా ప్రేమను అంగీకరించమని “ఐ లవ్ యు “అని వసుధార రిషికి చెబుతుంది.
ఇదినిన్న జరిగిన 538 గుప్పెడంత మనసు సీరియల్ కథ.
వసుధార ప్రేమను రిసి అంగీకరించాడో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
మీరు నా నీడ అని చెప్పిన వసుధార: ప్రేమిస్తున్నాను అనే మాటను తక్కువ పదంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పటం లేదు. ఈరోజు కాకుండా ఇక ఎప్పుడూ చెప్పలేనేమో, ఈ మాట చెప్పాక మళ్ళీ కొత్తగా పుట్టానని అనిపిస్తుంది. మళ్ళీ ఐ లవ్ యు అని చెబుతుంది వసుధార. ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని రిషి ప్రశ్నిస్తాడు. నేను కాదు, నేను వసుధార నుండి రిషి దారనుఅయ్యాను.
మీరు నా నీడ, నేను మీ నిజం అని సమాధానం ఇస్తుంది. ఒకప్పుడు అతికిన హృదయం ఇప్పుడు మన హృదయం. రెండు పేర్లు రెండు మనసులు ఒక్కటయ్యాయి అని అంటుంది. రిషి గిఫ్ట్ ను చూపిస్తూ నాకు ఇచ్చావు భద్రంగా కాపాడే బాధ్యత నాదే అని వసుదార ప్రేమను అంగీకరిస్తాడు.
ఏం జరుగుతుందో తెలియటం లేదని మాట్లాడుకుంటున్న మహేంద్ర, జగతి: జగతి మహేంద్ర, రిషి ,వసు గురించి ఆలోచిస్తూ ఏం జరుగుతుందో అని అనుకుంటారు. నాకు అర్థం కావడం లేదు. వసుధారని చూస్తే రిషికి తన మనసులో మాటను చెప్పేసేలా ఉంది. ఎందుకంటే అమ్మవారి దగ్గర అన్న మాటలు నేను విన్నాను.
ఎగ్జామ్స్ అయిపోతే మళ్లీ కలవలేరు కదా అని మహేంద్రఅంటాడు. రిషి మనసు విప్పి చెప్పినంత వరకు మనం బాధపడ్డాం, చెప్పాక వసు ఎందుకు నో చెప్పిందో నాకు అర్థం కాలేదు. అడిగినా చెప్పలేదు అని అంటుంది జగతి. ఇప్పటివరకు జరిగినవి పక్కన పెట్టు. ఈరోజు తేలిపోతుంది. నా మనసు చెబుతుంది వసుధార తన మనసులోని మాటను చెబుతుందని. ఆ మాటను చెప్పడానికి ఇదే చివరి అవకాశం. అని రిషికి ఫోన్ చేశాను సమాధానం ఇవ్వలేదు. రాగానే అడుగుతాను. వసుధారని అడగలేను కదా అని మహేంద్ర అంటాడు.
మన బాధ మనకున్న ,అది వాళ్ళ వ్యక్తిగత విషయం అవసరానికి మించి ఎక్కువ కలగజేసుకుంటున్నామేమో అని అనుకుంటున్నాను అని అంటుంది జగతి. టాపిక్ వాళ్ల గురించి అయినా మనకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలగజేసుకోవాలి. ఇప్పుడు రిషి వస్తాడు రాగానే అడిగేస్తానని అని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు.
మన ప్రేమ ప్రయాణం ఆగిపోకూడదు అని అన్న రిషి: వర్షం పడుతుందని రిషి వసుధార ఒకచోట నిలబడి చలమంట వేసుకొని నిలబడతారు. ఈరోజు ఈ ప్రయాణం ఇలాగే ఉండిపోవాలి. మీతో కలిసి వేసే ప్రతి అడుగు మీతోనే అని మనసులో అనుకుంటుంది వసుధార. మన మధ్య జ్ఞాపకాలు తప్ప అపార్ధాలు ఉండకూడదు అని ఈ గిఫ్ట్ ఆ రోజు నీకు ఇచ్చినప్పుడు నిన్ను బెదిరించింది ఎవరు అని ప్రశ్నిస్తాడు.
రిషి సాక్షి మాటలు గుర్తుకు చేసుకొని సాక్షి అని అంటుంది వస్తదార. ఈ వర్షానికి నాకు ఏదో సంబంధం ఉందేమో, ఒకసారి ఈ వర్షం నువ్వు దూరం కావేమో అని చెప్పింది. ఇదే వర్షం నువ్వు కాదన్నావని చెబుతుండేది. ఈరోజు అదే వర్షం నిన్ను, నన్ను సమానం చేసింది.
మేఘాలు కరిగిపోతే వర్షం ఆగిపోతుంది కానీ మన ప్రేమ ప్రయాణం ఆగిపోకూడదు. మనం మేఘాల కరిగి వర్షంగా కరిగిపోవద్దు. ఆకాశంల ఎప్పటికీ నిలిచిపోవాలి నిలిచిపోదాం .ఎప్పటికీ ఒకేలా ఉందామని, రింగ్ ను పట్టుకొని, ఎప్పటికీ ఆగిపోని ప్రేమ ధారల, రిషిదారల నిలిచిపోవాలని, రింగ్ తొడుగుతూ ఆగిపోతాడు రిషి.” వి” అనే అక్షరానికి “ఆర్” కలవాలి అంటే గీత గీసినంత ఈజీ కాదు, మనం అలా నిలిచిపోవాలంటే, ఉంగరం నీ చేతికి తొడగాలంటే, ఒక పని చేయాలని చెప్పి, నువ్వు ఒక పని చేయాలి, నీ ప్రేమను త్యాగం చేయాలి అని అంటాడు. ప్రేమను దక్కించుకోవడం కోసం, ప్రేమను త్యాగం చేసి, నా ప్రేమ పోగొట్టుకోవాలా, అంతకన్నా ప్రాణం అడగండి ఇచ్చేస్తాను అని సమాధానం ఇస్తుంది వసుధార.
నీ లక్ష్యం చేరేవరకు మనం కలుసుకోకూడదని అన్న రిషి: నీ ప్రేమను పోగొట్టుకో అనడం లేదు. నీ ఆశయం కోసం కొన్ని రోజులు ప్రేమకి దూరంగా ఉండమంటున్నాను. జీవితంలో అన్నింటికన్నా ఆశయం ఎంతో గొప్పది అని ఎన్నోసార్లు అన్నావు. నీ ఆశయం గోల్డ్ మెడల్, నీ లక్ష్యం యూనివర్సిటీ టాపర్గా ఫస్ట్ రావడం. నీ దృష్టి అంతా పరీక్షల మీదే ఉండాలి. ప్రేమ మీద కాదు. నీ పరీక్షలు అయ్యేదాకా కలవకూడదు, మాట్లాడకూడదు అంటాడు. కుదరదు మిమ్మల్ని చూడకుండా, మాట్లాడకుండా ఉండడం నావల్ల కాదని అంటుంది. కావాలి నువ్వు అందరిలాంటి ఆడపిల్లవి కాదు, నీ ఆశయం కోసం అందర్నీ వదిలి, పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసావు. మన ప్రేమ నీ ఆశయాన్ని మార్చి, మరిచిపోయేలా చేసింది. అది మన ప్రేమకి అవమానం అంటాడు.
ఆ రింగు నాది, నాకు కావాలి ,యూనివర్సిటీ టాపర్ కన్నా రింగు మీతో తొలగించుకోవడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని నేను పోగొట్టుకోలేను, కావాలంటే తప్పకుండా మీరన్నట్టే చేస్తాను అని చెప్పి, ఇది ఎప్పటికీ నాదే కదా అని ప్రశ్నిస్తుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. దానికి పంచభూతాలు, మన ప్రేమ సాక్ష్యం. ఎప్పటికీ ఈ రింగ్ నీదే అని చెప్పి, నీ ఆశయం చదువు.
నువ్వు నీ దృష్టినంతా చదువు మీదే పెట్టు అని అంటాడు. వసుధార మాట ఇచ్చి, మన ప్రేమ కోసం మీ మాట వింటాను, మీరు చెప్పినట్లే పరీక్షలు అయిపోయేదాకా ప్రేమ గురించి ఆలోచించను అని రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది. రిషి వసుధారని పట్టుకొని, రింగ్ చూస్తూ పంచభూతాలు అన్నీ మన చుట్టే ఉన్నట్టుగా, ఈ రాత్రి సాక్షిగా, మన ప్రేమ కథ మొదలవుతుంది. ఇది ఒకరినొకరు తెలుసుకున్న సమయం. ఇది కథ కాదు, శాశ్వతం అని ఇద్దరు కౌగిలించుకొని అలాగే ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత కారులో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వెళుతూ ఈ ప్రయాణంలో ఏదో కొత్తదనం, ఎంత హాయిగా ఉందో, చూసావా నువ్వు చెప్పేది నేను చెబుతున్నాను అని రిషి వసుధారతో మాట్లాడుతాడు.
ఇది ఈరోజు జరిగిన 539 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి వసుధారల ప్రేమ గురించి మహేంద్ర తెలుసుకుంటాడో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.