Guppedantha manasu serial today వసుధారపై అంబరాన్ని తాకిన రిషి కోపం.

వసుధారపై అంబరాన్ని తాకిన రిషి కోపం..

Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ:ఎప్పటికీ తన పక్కనే ఉంటానని చెప్పిన వసుధార:

సాక్షి విషయంలో నా ప్రమేయం లేకుండానే తను దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మరోసారి మనం విడిపోమని రుజువు అయిందని, వసు ను చూసి మనసులో అనుకుంటాడు రిషి. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలని వసుధార కూడా అనుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో డాడ్ వాళ్లు కూడా ఉంటే బాగుండేదని అంటాడు. వసుధార, రిషి తలపై ఉన్న గులాబీ రెక్కను తీసుకొని, దీనికి ఎంత ధైర్యం, మీ దగ్గరే ఉంటుందా అంటుంది. దాచుకుంటాను అందమైన జ్ఞాపకంగా ఉంటుందని అంటాడు.

నువ్వు వచ్చాక రిషికి రెండు జీవితాలు, నువ్వు వచ్చాక కొత్త ప్రయాణం మొదలయ్యింది, అన్ని బాగున్నాయి, డాడ్ వెళ్లిపోవడమే బాలేదు, ఏంటో అందరు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అంటాడు. అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు. నేను ఎప్పటికీ మీ పక్కనే ఉంటానని అంటుంది.

రిషి బాగోగులు తెలుసుకున్న జగతి, మహేంద్రా:

గౌతమ్ ను రిషి ఎలా ఉన్నాడని? జగతి, మహేంద్ర అడుగుతారు. మీరే వాడి ప్రపంచం, వాడి లోకం. మీరు లేకుంటే వాడు ఎలా ఉంటాడో, నేను చెప్పలేను అంటాడు. మీరు లేని లోటు, మీరే మాత్రమే తీర్చగలరు, అంటాడు. వారిద్దరు ఒకటి అవ్వాలి, అంటే మేము దూరం అవ్వక తప్పదు, బాధ ఎప్పుడు శాశ్వతం కాదు అంటాడు మహేంద్ర. కాలెండర్లు, తేదీలు మారినంత మాత్రాన కొన్ని కష్టాలు మర్చిపోము, మనసులో ఉన్న కొన్ని బంధాలు మర్చిపోలేరు, ఎన్ని రోజులైనా రిషి బాధ పో, ఈ విషయం మీకు తెలుసు, ప్లీజ్ మీరు ఇంటికి వచ్చేయండి, వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను, వాడి బాధను నా కళ్ళతో చూడలేకపోతున్నాను, వాడితో అంకుల్, మేడం నా దగ్గరే ఉన్నారని చెప్పలేకపోతున్నాను, వాడి బాధను చూసి, వాన్ని మోసం చేస్తున్నానని చాలా బాధగా ఉంది అంటాడు. రాలేము. ఎందుకు ఏంటని వివరాలు అడగకు అంటాడు.

రిషి మనసును అర్థం చేసుకోమని చెప్పిన జగతి:

ఒక్కసారి ఆలోచించు, రిషి మనసు ఎంత సన్నితమో, తెలుసు కదా! అని అంటుంది. ఆ సున్నితత్వాన్ని మారి రాటు తేలాలని అంటాడు. గాయం చేసి దూరాన్ని చూస్తూ ఉంటే ఎలా అంటుంది. మనసుకైనా గాయాలను ఎవ్వరూ మాన్పించలేరని అంటాడు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో  నాకు తెలియదు. మీరు ఇక్కడ బాధపడటం, అక్కడ రిషి బాధపడటం, పక్కన పెడితే దేవయాని పెద్దమ్మ తన ప్లాన్స్ తను చేస్తుంది. పెద్దమ్మ నుండి ఏదో ఒక ప్రమాదం రాకముందే, మీరు వచ్చేయండి అని గౌతమ్ అంటాడు.

నువ్వు ఒక పని చెయ్యి అని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వసుధార మనసు ఎలా ఉందో? ఏం ఆలోచిస్తుందో? నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలని మహేంద్ర అంటాడు. గౌతమ్ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

రిషి వసుధార సంతోషంగా ఉన్నట్టు కలగన్న దేవయాని:

వసు, రిషి  సంతోషంగా కాలేజీలో గడుపుతారు. సంతోషంతో నువ్వు సాధించావు, కాలేజ్ ఫస్ట్ గా నిలిచావని, గిఫ్ట్ ఇస్తాడు. మీరే నాకు పెద్ద గిఫ్ట్, మళ్లీ ఎందుకు? నేను సాధించడానికి కారణం మీరే! అంటుంది. చాలా థాంక్స్ అని వసు అంటుంది. థాంక్స్ ఒక్కటేనా అని రిషి అడగగానే, వసూ రీషిని కౌగిలించుకున్నట్లుగా దేవయాని కలగంటుంది. ఇది  కల అయినా, ఇది నిజం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాలేజీలో ఎవరుంటారు. ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు. అప్పుడు వీళ్లిద్దరికి ఏకాంతం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది అని అనుకొని, వీళ్ళని వదిలేస్తే ఏదైనా జరగవచ్చు అనుకుని, పెళ్లి చేసుకున్నట్లుగా ఊహించుకున్న విషయాలు గుర్తుకు చేసుకొని, వీళ్ళని ఇలాగే వదిలిపెట్టకూడదు.

వీళ్ళు ప్రేమ కథకు అందమైన ముగింపు ఇస్తాను. దేవయాని అంటే ఏంటో తెలిసేలా చేస్తానని అనుకుంటుంది.

ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనగా అనగానే భయపడిన వసుధార:

రిషి, మహేంద్ర గురించి ఆలోచిస్తూ మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకుంటుండగానే  ఫోన్ రింగ్ అవుతుంది. డాడీ ఫోన్ చేస్తున్నారేమో అని అనుకుంటాడు. త్వరలో రిజల్ట్స్ వస్తాయని ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ఫోన్ వస్తుంది. కాలేజీలో సంబరాలు చేసుకునే వాళ్ళం. ఈసారి డాడి లేరు అని అనుకుంటాడు. ఈ పొగరు ఇంకా రాలేదని అనుకుంటూ, ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు? మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్స్ తీసుకొని రమ్మన్నాను అంటాడు. తీసుకొస్తున్నాను అంటుంది. ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ఫోన్ వచ్చింది. త్వరలో రిజల్ట్స్ వస్తాయని అంటాడు. అమ్మో అని భయపడుతుంది.

అమ్మో అంటావ్ ఏంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో? అని ఎదురు చూడాలి ?భయపడతావ్ వెంటనే అంటాడు. ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను, లాస్ట్ ఎగ్జామ్ ఏ పరిస్థితుల్లో రాశానో మీకు తెలుసు, నాకు తెలుసు అంటుంది. దాని గురించి గుర్తుకు చేసుకొని, మీరు ఏ పరిస్థితుల్లో రాసినా నువ్వే కాలేజ్ ఫస్ట్ వస్తావు అనుకుంటాడు.

జగతి మహీంద్రా ఇల్లు వదిలి వెళ్ళిన విషయం కాలేజీలో తెలిసిందని చెప్పిన మేడం:

వసుధారను మేడం వచ్చి, బాగా రాశావా? కాలేజీ ఫస్ట్ వస్తావా? అంటుంది. ఏమో మేడం తెలియదు, బాగా భయంగా ఉందని అంటుంది. నీకెందుకు భయం? నువ్వే ఫస్ట్ వస్తావు !అని చెప్పి మేడం వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంట కదా? అని  అడుగుతుంది. నేను అడుగుతే దిక్కులు చూస్తున్నావు? దేవయాని మేడం చెప్పారు, అని దేవయాని అన్న మాటలు చెబుతున్నా మేడం. నేను వెళ్ళాలి అంటుంది. పేరు కే పెద్ద ఫ్యామిలీ అంటారు. మేడం వాళ్ళు గొడవ పెట్టుకొని ఎందుకు వెళ్లారు ఇప్పటికే నాకు అర్థం కాదని, ఈ విషయం కాలేజీ అంతా తెలిసిపోయి ఉంటుందని చెప్పి వెళ్ళిపోతుంది. దేవయానిపేయడం మామూలుది కాదు, విషెస్ వరకు చెబుతాను ,lఅంటూ వసు తొందరగా వెళ్ళిపోతుంది.

వసుధారపై విడుచుకుపడ్డ రిషి: 

రిషి దగ్గరకు గౌతమ్ రాగానే డాడ్ వాళ్ళ గురించి నీకు తెలిసిందా? అంటాడు. లేదని గౌతమంటాడు. ప్రతిసారి స్టూడెంట్స్ తో ,చిన్న పిల్లాడి లాగా మారి వారితో సంతోషంగా గడిపేవాడు. రిజల్ట్స్ రాగానే పెద్ద పార్టీ చేద్దాం అనేవారు. రిజల్ట్స్ వస్తే చాలా పని ఉంటుందని అంటాడు. మనమంతా ఉన్నాం కదా! మనం చూసుకుందాం అంటాడు గౌతమ్. కాలేజీ పనులు చూసుకుంటాం. కానీ వాళ్ళు వెళ్లి చాలా రోజులైంది. మనకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. నిద్రపోయిన వాళ్ళని లేపవచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేము అన్నట్లుంది నా పరిస్థితి అంటాడు .

కనిపిస్తే గట్టిగా అరుస్తాను? గొడవ పెట్టుకుంటాను? అంటాడు.¡ ఇంతలో వస్తారా అక్కడికి వచ్చి అవును అసలు వదలకూడదు విడిచిపెట్టకూడదు అని అంటుంది వాళ్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని కాలేజ్ అంతా మాట్లాడుకుంటున్నారు, అని అంటుంది .ఎలా తెలిసిందని అడుగుతాడు.l రీషి దేవయాని మేడం చెప్పారట, అలా ఎందుకు చెప్పారు? ఇప్పుడు కాలేజ్ లో ఒకటి అంటే నాలుగు మాట్లాడుకుంటారు. దేవయాని మేడం అలా చెప్పకుండా ఉండాల్సింది అంటుంది. పెద్దమ్మ చెప్పిన దానిలో తప్పులేదు. జరిగిందే చెప్పింది. అని కోప్పడతాడు. వాళ్ళు వెళ్లిన విషయం ఇంకెన్నాళ్లు దాస్తాం. ఇప్పుడు కాలేజీలో తెలిసింది. తర్వాత ఊరంతా తెలుస్తుంది. అందరూ అడుగుతారు. అడిగిన వాళ్ళని తప్పు పట్టలేము. డాడ్ చేసింది తప్పు ,డాడీ ఒక నిర్ణయం తీసుకుంటే మేడం ఆపాలి కదా! తప్పు అని చెప్పాలి కదా! అని వసుధారని అరుస్తాడు. ఇప్పుడు వ సు ఏమనింది, తనని అరుస్తున్నావు? అంటాడు గౌతమ్. ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మని అనడం కరెక్ట్ కాదు. పెద్దమ్మ చేసింది కరెక్ట్. డాడీ వాళ్లు చేసింది తప్పు కదా అని అంటాడు. సార్ ఇది చూడాలని ఉంటుంది. చూస్తానులే అక్కడ పెట్టు., నేను మాట్లాడేది ఏంటి ?నువ్వు మాట్లాడేది ఏంటని 

గట్టిగా అరుస్తాడు. వసుధార నువ్వు వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పంపిస్తాడు.

వసుధారపై అరగద్దని చెప్పిన గౌతమ్:

వసుధార మీద అరుస్తున్నావు ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో? అదే ఆలోచించు అంటాడు.  రీషి గౌతమ్ ఇద్దరూ కాలేజీలో నడుస్తూ వస్తుండగా, మేడం గుడ్ ఈవెనింగ్ సార్ అంటుంది. ఎవరైనా ఎదురైతే ఏం అడుగుతారో అని ప్రతిక్షణం భయపడుతూ బతకాల. ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, మనమే బయటికి చెబుదాం అంటాడు. పోలీస్ కంప్లైంట్ చేస్తే నేను బయటపడతాను. నిజం తెలిస్తే రిషి నన్ను క్షమిస్తాడా అని ఆలోచించుకొని, పోలీస్ కంప్లైంట్ అవన్నీ ఎందుకు? మన ఇంటి మేటర్ ను బయట పెట్టడం ఎందుకు  అంటాడు. అన్నీ నాకు తెలుసు! నువ్వు వెళ్ళు అంటాడు రీషి ఎక్కడికి వెళ్లాను, నీతోనే ఉంటాను అంటాడు గౌతమ్. నాకు చాలా పనులు ఉంటాయి. తోకలాగా నా వెంట ఉండకు అంటాడు.

అర్థమయింది. నీ మూడ్ బాగాలేదు, కోపంగా ఉన్నావ్ అని అర్థమైంది.వసుదరను ఏమనకు, మంచిదని అంటాడు. సలహా ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని రిషి అంటాడు. ఇది కూడా సలహా కదా! అని గౌతమ్ చిన్నగా అనుకుంటాడు. ఏంటి కొనుక్కుంటున్నాము అంటాడు. ఏం లేదు బాయ్ అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఇంతకీ పొగరు ఎక్కడ ఉందని చూస్తుంటాడు రిషి. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 596 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker