Guppedantha manasu serial today:ప్రేమతో ఒక్కటైపోయినా రిషి, వసుధార..
Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ:
వసుధార ఫోన్ మాట్లాడుతూ రిషి ని చూస్తుంది. దీంతో నిన్నటి ఎపిసోడ్ అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
రిషి ఏంటి అని అడుగుతాడు.
టెన్షన్ అంటుంది. ఆరోజు లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ రాపించారు, అందుకే భయం అంటుంది. చేతులు పట్టుకొని ఏం కాదు, నువ్వు సాధిస్తావు అంటూ ధైర్యం చెబుతాడు. నాకు నమ్మకం ఉందని అంటాడు. ఎందుకంత నమ్మకం అని అడుగుతుంది. ప్రేమ ఉంది, ప్రేమే నమ్మకం కనుక అంటాడు. టెన్షన్ తగ్గడానికి ఒక పని చేయాలని ఒక చోటికి వెళ్లాలని చెబుతుంది. సరే అని చెప్పి ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు.
వసు కోరికను తీర్చిన రిషి:
చెరువు దగ్గరకు కాగితం పడవలతో వస్తారు. అందరూ నిద్రపోతున్నప్పుడు మనం చెరువు దగ్గరకు రావడం చాలా బాగుంటుంది అని అంటుంది. రిషి వింతగా ఉందని అంటాడు. మనసులో కోరిక అనుకొని కాగితపు పడవలు చేసి నీళ్లలో వదిలితే ఆ కోరికను పకృతి నెరవేరుస్తుందని చెబుతుంది. అవునా! సరే ఏం కోరుకుంటున్నావు? అంటాడు.
అదే మిమ్మల్ని అడుగుతే ఏం కోరుకుంటారు అని అంటుంది. నువ్వు యూనివర్సిటీ టాపర్గా రావాలని కోరుకుంటాను అని సమాధానం ఇవ్వగానే, అదే మాటను కాగితపు పడవపై రాయమని చెప్పగానే, ఆ మాటను కాగిత పడవలపై రాసి చెరువు లోపలికి వెళ్లి, నీళ్లలో దిగి పడవలను వదిలి మొక్కుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంకెల్లో పడవల్లి వదులుతారు.
నేను 11 పడవలను వదులుతాను అంటూ, చిన్నప్పుడు మేము ఇలాగే చేసేవాళ్లం. పడవలు, దీపాలు, బతుకమ్మలు ఇలా ఏమి నీటిలో వదిలిన, నీటికి నీరాజనం పలికినట్లే అంటుంది. ఏదేమైనా నీ ఆలోచనలు, కోరికలు నాకు కొత్తగా ఉంటాయని అంటాడు. సరే ఇక అయిపోయిందా? అనగా, ఇప్పటికీ మాత్రం అయిపోయింది అంటుంది.
ఇంకా చేసేది ఉందా అంటాడు. ఆ విషయం తర్వాత చెబుతాను సార్ వెళ్దాం రండి అనగా, రిషి వసూచేతిని పట్టుకొని బయటికి తీసుకు వస్తాడు. తననే చూస్తూ, మీరు చాలా గ్రేట్, అడిగిన వెంటనే నా కోరికను తీర్చారు అంటుంది. మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయాలు అభిరుచులు ఇష్టపడాలి అంటాడు. నువ్వు టాపర్గా వస్తావు, డాడ్ వాళ్ళు తిరిగి వస్తారు, తర్వాత మీ ఊరికి వెళ్లి మన విషయం మాట్లాడాలి అంటాడు.
అర్థమయింది సార్, అంటూ సిగ్గుపడుతుంది.
దేవయానికే చుక్కలు చూపిస్తున్న ధరణి:
దేవయాని ధరణిని పిలిచి ఈ టైంలో ఏం చేస్తున్నావ్? అంటుంది. కిచెన్లో పని ఉందని అంటుంది. ఈ ఇంట్లో ఇన్ని రూములు ఉన్నా, నువ్వు కిచెన్ లో తప్ప ఎక్కడ ఉండవా? అంటుంది. అత్తయ్య గారు కోపంలో ఉన్నట్లున్నారు అని మనసులో అనుకొని, చెప్పండి అంటుంది.
రిషి ఎక్కడ ఉన్నాడు? అని అడగగా, బయటకు వెళ్లాడని సమాధానం ఇస్తుంది. ధరణి ఇద్దరు కలిసి వెళ్లారా? లేక ఒక్కడే వెళ్ళాడా? అంటుంది. ధరణి మాత్రం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది. అవున నో, లేదనో చెప్పు, ఎందుకు అలాగే ఉన్నావు, అందరినీ నేను కొంత ఇబ్బంది పెడతాను, నువ్వు మాత్రం నన్ను సైలెంట్ గా ఉండి టార్చర్ పెడతావు అంటుంది, నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను అంటుంది.
నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతుంది ధరణి. నువ్వు ఏం చేయట్లేదు అదే నా బాధ అని, వీళ్ళు రాత్రిళ్ళు చెట్టా, పట్టాలు వేసుకొని తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అని అంటుంది. ఏమీ అనుకోరు కదా! అని అంటుంది ధరణి.
ఇలాంటి సమాధానాలు బాగా చెబుతావు, ప్రేమ లేనప్పుడు ప్రేమికులుగా తిరిగారు, ప్రేమ పుట్టాక ఎంగేజ్మెంట్ కాకముందే మొగుడు పెళ్ళాలుగా ఫిక్స్ అయ్యారు. ఆ వసుధార ఏమో నన్ను మీరు ఫిక్స్ అవ్వండి అంటుంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు,వీళ్ళు భార్యాభర్తలు లాగా తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారని అంటుండగానే అత్తయ్య గారు ఒక మాట మాట్లాడొచ్చా? అని ధరణి అడుగుతుంది.
మాట్లాడిన ప్రతిసారి నన్ను అడిగే మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఒక్కొక్కసారి వాతలు పెట్టినట్లుగా ఉంటుంది అని అంటుంది. నాకు తెలియక అడుగుతున్నాను కలిసి తిరిగితే చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? వ సుదర ఈ కాలం అమ్మాయి, తెలివైనది. వాళ్ళు కలిసి తిరిగితే ఏమవుతుంది? అని అడుగుతుండగానే, దేవయాని నేను అడిగినదాన్ని మళ్ళీ తిరిగి నన్ను అడుగుతున్నావా? కలిసి తిరగడం తప్పు కదా! అంటుంది.
కలిసి తిరగడం తప్పు అని రిషిక చెప్పమన్నా ధరణి:
కలిసి తిరగడం గురించి రిషికి ఒక మాట చెబితే సరిపోతుందని ధరణి అంటుంది. ఏం చెప్పాలి? అని దేవయాని అంటుంది. కలిసి తిరగడం తప్పు అంటున్నారు కదా! అదే విషయం రిషితో చెప్పండి అత్తయ్య అంటుంది. మనసులో ఉన్నవి అన్ని రిషికి ఎలా చెబుతావు? అలా చెప్పకూడదు కదా! అంటుంది. ఒక మాట అడుగుతాను అంటూ, ఇన్ని మాటలు మాట్లాడావు, నువ్వు నటిస్తున్నావో? జీవిస్తున్నావో? అర్థం కావడం లేదు. ఆ వసుధార కంటే నువ్వు ముదిరిపోయావు అని అంటుంది. అత్తయ్య ముదిరిపోవడం అంటే అని అడుగుతుండగానే ఇదే ఇదే అని అంటూ దీన్నే ముదిరిపోవడం అంటారు ఈ నటననే ముదిరిపోవడం అంటారు, జగతి వచ్చాక బాగా ముదిరిపోయావు అంటుంది. నేను ఎక్కడ ముదిరిపోయాను అత్తయ్య, గంట కొట్టినట్లు గంటకు ఒకసారి కాఫీ కావాలా అత్తయ్య అని అడుగుతున్నాను, కదా! అని అంటుంది. ఈ కొంపలో అందరికీ తెలివి పెరిగిపోయింది. నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో, అంటుంది అత్తయ్య కాఫీ అనగానే కాఫీ, వద్దు, కాఫీ వద్దు, టిఫిన్ వద్దు, పచ్చి కూరగాయలు తింటూ బ్రతికేస్తాను అంటూ, చేతులెత్తి మొక్కుతుంది, ధరణి చిరునవ్వుతో వెళ్ళిపోతుంది.
ఏం జరుగుతుందో అని భయపడుతున్న దేవయాని:
ధరణి ఇంట్లో ఉండి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. సహాయ పడదు. కొత్త ఆలోచన చెప్పదు,రిషి,వసుధార రోజు రోజుకు ఎక్కువ క్లోజ్ అవుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారో? అర్థం కావటం లేదు. వినకూడని వార్త వింటానేమో? చూడకూడనిది చూస్తానేమో? అని భయంగా ఉంది. ఇంట్లో ఇష్టం నాకు ఇష్టం లేనివి జరుగుతాయి. ఏమో అని నా అంతరాత్మ నన్ను ముందే హెచ్చరిస్తుందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
వసు ను ప్రశ్నించిన రిషి:
వసుధార, రిషికి థాంక్స్ అని చెబుతుంది. థాంక్స్ ఎందుకు, ఇది నా బాధ్యత అంటాడు. మనసులో అనుకున్న భావాలను అలాగే ఉంచుకోకూడదు, బయటికి చెప్పాలి, ఇంత రాత్రి నేను అడిగిన వెంటనే, కాదనకుండా నన్ను తీసుకొని వెళ్లారు, యూనివర్సిటీ టాపర్ గా రావాలని కోరుకున్నారు. కాగితపు పడవలు వదులుతూ, నాకోసం ఇంత చేశారు, దానికి థాంక్స్ చెప్పకపోతే ఎలా అంటుంది. అంత అవసరం లేదని అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, మనసును తెలుసుకున్న వాడు భర్తగా వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు తెలుస్తుంది. అందరికీ ఇలాంటి వాడే భర్తగా రావాలని అంటుంది. నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు? అందరికీ నన్నే పంచుతావా? అంటాడు. అదృష్టాన్ని ఆస్వాదిస్తాము, అందరికీ ఎలా పంచుతాము, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా! అంటుంది. మనమధ్య గొడవలు వచ్చాయి, అయినా నా కష్టాలలో తోడున్నావు, తప్పు చేస్తే ధైర్యంగా చెప్పావు, నేను చేసిన ప్రతి దానికి తోడుగా ఉన్నావు. ఇలాగే జీవితాంతం తోడుగా ఉంటానని నన్ను విడిచి వెళ్ళనని మాట ఇవ్వమంటాడు. జన్మజన్మలకు మీకు నేను తోడుగా ఉంటాను, ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపోనని, ఏ శక్తి మనల్ని విడదీయలేదు, రిషిదార బంధం కలకాలం కొనసాగుతుంది. నా ప్రయాణం మీతోనే, అంటూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 597 గుప్పెడంత మనసు సీరియల్ కథ. L