Guppedantha manasu serial today;రిషి ని చూసిన మహేంద్ర జగతి, కావాలనే తన నుంచి తప్పించుకుంటున్నారు అన్న రిషి:

Guppedantha manasu serial ఈ రోజు కథ: రిషి ని చూసిన మహేంద్ర జగతి, కావాలనే తన నుంచి తప్పించుకుంటున్నారు అన్న రిషి:
వసు తల స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉండగా, రిషి వచ్చి తన తలకు డ్రైయర్ పెడుతూ వెంట్రుకలం ఆరబెడతాడు. ఇలా ఇద్దరూ రిషి డ్రైవర్ డ్రైవర్ తన వెంట్రుకలకు పెడుతుండగా, వద్దు అని లాగుతూ ఉంటుంది. ఇలా ఇద్దరు కలిసి సోఫాలో పడిపోతారు .

అప్పుడే బ్యాక్ గ్రౌండ్ లో సమయమ సమయమ సమయమా అనే సాంగ్ వస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ అలాగే ఉండిపోతారు. అప్పుడే ధరణి వచ్చి ఫోన్ వస్తుంది. ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తలను ఆరబెట్టుకో అని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చి సంతోషంగా ఉంటాడు.

గౌతమ్ ఎక్ససైజ్ చేస్తూ రమ్మని పిలవగా,నేను రాను తడి జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదని అంటాడు. ఏంటి నువ్వు అంటుంది. నాకు అర్థం కావడం లేదు. కనీసం మినిస్టర్ ను కలవాలి అది అయినా గుర్తుందా? అని అడుగుతాడు. నాకు గుర్తుంది అని సమాధానం ఇస్తాడు.


అద్దంలో తన ఆత్మతో మాట్లాడుతున్న వసుధార:
అద్దంలో చూస్తూ వసు రెడీ అవుతూ రిషి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. ఇంతలో అద్దంలో తన ఆత్మ కనిపిస్తుంది. ఏంటి గర్వంగా కనిపిస్తున్నావు? అంటుంది. రిషి సార్ నా పక్కన ఉండగా గర్వంగా ఉంటాను అని సమాధానం ఇస్తుంది.

రిషి సార్ పక్కన ఉంటే ప్రపంచాన్ని జయించినట్లుగా ఉంటుంది అని అంటుంది. అది నీకు మాత్రమే తెలుసా? నువ్వు రిషి సార్ పక్కన ఉంటే కూడా ధైర్యం అని మహేంద్ర సార్ వాళ్ళు అనుకొని, మీ ఇద్దరి కోసం వాళ్ళు దూరంగా వెళ్లిపోయారేమో అని అంటుంది. నీ పట్టుదల మీద ఉండి అన్ని బంధాలను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంది. మాట్లాడకు అనుకుంటూ అవును అమ్మ అనే పిలుపు కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే అమ్మ అనే పిలుపు పక్కన పెడితే నాన్న కూడా దూరమయ్యాడు దీనికి కారణం నువ్వే అని అంటుంది.

నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుందని, తన ఆత్మతో తనే మాట్లాడుకుంటుంది.
మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద మా మినిస్టర్ ను కలిసిన జగతి, మహేంద్ర:


జగతి మహేంద్ర మినిస్టర్ దగ్గరికి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని ఏరియాలలో ఆర్గనైజేషన్ చేయాలని లెటర్స్ వచ్చాయి. మేము పర్సనల్గా వెళ్లి ఆ పని చూసుకుంటాము. అప్పటివరకు నేను తీసుకున్న మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు అన్ని వసుధర చూసుకుంటుందని మీకు అర్జీ ఇచ్చామని చెబుతారు. ఇది మీ ద్వారా కాలేజీకి వెళ్లాలని జగతి అంటుంది. మీరందరూ ఒకటే. ఒకటే కుటుంబం వాళ్ళు, కొన్ని రోజులు ఒకరి పనులు ఒకరు చూసుకోవడంలో ఏమవుతుంది.

సర్దుకోవడం చాలా మంచిది కదా! అని మినిస్టర్ అంటాడు. ఏదైనా పద్ధతి ప్రకారం ఉండాలి. కాలేజ్ మాది అయినంత మాత్రాన మిషన్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ, అందువల్లనే ఇలా అంటాడు మహేంద్ర. సరే అని మినిస్టర్ మెచ్చుకొని, కాఫీ తాగమనగా వద్దండి, మేము ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలి, ఫ్లైట్ టైం అవుతుందని చెబుతాడు. మినిస్టర్ సరే అని రిషి ఇంకా రాలేదు, అని అడగగా వస్తుంటాడు. అని మహీంద్రా సమాధానం ఇస్తాడు. మేము ఎయిర్ పోర్టుకు వెళ్లాలని సపరేట్గా వస్తున్నారు. అని చెప్పి బయలుదేరుతారు.


రిషి ని చూసిన జగతి, మహేంద్ర;
జగతి, మహీంద్రా ఇంట్లో వస్తుండగా, బయట నుంచి రిషి, వసుధార వస్తుంటారు. రిషి వసు లోపలికి వస్తుండగా జగతి, మహీంద్రా చూసి వేరే దారి గుండా వెళ్ళిపోతుంటారు. రిషి లోపలికి రాగానే, అక్కడ తన తండ్రి ఉన్నట్లుగా అనిపించి ఆగిపోతాడు. ఏమైంది రిషి సార్ అని అడగగానే, ఒక రకమైన ఫీలింగ్, అని కొత్త ప్రాజెక్టు కోసమైనా డాడ్ వాళ్లు రావాలి కదా! అని ఆలోచిస్తున్నాను, అంటూ వాళ్ల కోసం వెతుకుతుంటాడు. సార్ ఏమైందని వసు అడుగుతుంది.

కొత్తగా పెర్ఫ్యూమ్ వాసన వస్తుందా! ఇది డాడ్ వాడేది. డౌట్ లేదు డాడ్ వచ్చి ఉంటారు. మినిస్టర్ గారి క్యాబిన్ లో ఉన్నారేమో, వెళ్దాం రా, అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఎవరూ ఉండరు. మినిస్టర్ గారు రండి అని పిలవగానే, మా డాడీ వాళ్లు వచ్చి ఎంతసేపు అయిందని అడుగుతాడు. ఇప్పుడే వెళ్లారని మినిస్టర్ అంటాడు. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. అక్కడ వాళ్ళు కనిపించకపోయేసరికి బాధపడుతూ, గేటు దగ్గర వాచ్మెన్ ను అడుగుతాడు. అదంతా జగతి మహేంద్ర చూస్తూ ఉంటారు. డాడ్ వాళ్లు ఇప్పుడే వెళ్లారంట? అంతలోపే వెళ్ళిపోయారా? అని అనుకుంటూ ఉంటాడు. జగతి తో మహేంద్ర మన రిషి నాకోసమే చూస్తున్నాడని చెప్పి, సారి నాన్న ఈ డాడ్ ను క్షమించు అంటాడు.

ఇందుకోసమేనా రిషికి తెలియని కారు తీసుకుని వచ్చింది అంటుంది. అవును అని, రిషి ని చూసి యుగాలు అయినట్లుంది అంటాడు. బాధపడుతూ ఇద్దరు వెళ్ళిపోతారు.
రిషి, వసు లను ప్రాబ్లమ్ ఏంటి అని అడిగిన మినిస్టర్:
మినిస్టర్ వసుధార ను ఏమైంది అని అడుగుతాడు. మినిస్టర్ గారికి అన్ని చెప్పడం బాగుండదు అని మనసులో అనుకుని, ఏం లేదు సార్ ,సార్ తో అర్జెంట్ పని ఉందనుకుంటాను, అందుకే వెళ్లారని వసు చెబుతుంది. రిషికి దూకుడు ఎక్కువ .ఈ జనరేషన్ వాళ్ళు ఇలాగే ఉండాలని చెప్పి, రిజల్ట్స్ రాబోతున్నాయి కదా! ఏం అద్భుతం చేయబోతున్నావని అడుగుతాడు. నాకు కూడా టెన్షన్ గానే ఉంది అని సమాధానం ఇస్తుంది. ఇంతలో రిషి వస్తాడు.

రిషి ని ఎందుకు అలా వెళ్లావు? అని మినిస్టర్ అడుగుతాడు. చిన్న పనీ ఉండి వెళ్లానని చెబుతాడు. కనిపించారా? అని చిన్నగా అడుగుతుంది. లేదు అంటాడు. కొత్త ప్రాజెక్టు మీద సంతకాలు తీసుకోమనీ మినిస్టర్ చెప్పగానే పిఎ సంతకాలు తీసుకుంటాడు. జగతి మేడం మహేంద్ర సార్ కూడా ప్రాజెక్టు పని అంతా పూర్తి చేశారు. వాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ మీద సర్వేకు వెళ్తున్నామని, మిషన్ ఎడ్యుకేషన్ పనులు వసుధారని చూసుకోమని లెటర్ ఇచ్చి వెళ్ళారంటాడు.. మీరు వచ్చేవరకు ఉండమన్నాను, కాఫీ తీసుకోమని అన్నా వినకుండా ఎయిర్పోర్ట్ కు వెళ్లాలని చెప్పి వెళ్ళిపోయారు అంటాడు.

మినిస్టర్. ఎయిర్పోర్ట్ కా అక్కడికి ఎందుకు? అని అడుగుతాడు. మీరంతా ఒకటే చోట ఉంటారు. నన్ను అడిగితే ఎలా అని మినిస్టర్ సమాధానం ఇస్తాడు. సర్వే కి వెళ్తున్నారు కాబట్టి, ఆ పనిలన్ని మీరే చూసుకోమని మినిస్టర్ చెప్పగానే, రిజల్ట్స్ వస్తున్నాయి కదా! అదంతా అయిపోయిన తర్వాత చూసుకుంటాం, అని సమాధానం ఇస్తాడు. సరే మీ ఇష్టం అని చెప్పగానే వెళ్ళొస్తాను సార్! అని చెప్పి వెళ్ళిపోతారు.
తనను చూసి ఉంటారు అని తెలుసుకున్న రిషి:
ఎందుకు డాడ్ కావాలని నా నుంచి తప్పించుకుంటున్నారని వసుధారతో అంటాడు. మనం ఇష్టపడే వ్యక్తి మనల్ని కలవకుండా జాగ్రత్త పడుతున్నారు అంటే? ఏంటి? అర్థం. డాడ్ కి నా మీద అంత కోపం ఏంటి నాతో ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారు అంటాడు. కావాలని చేశారని నేను అనుకోవడం లేదు సార్ అని అంటుంది వసు. లేదు మనం రాకముందు వచ్చారు. నేను వెళ్లి చూస్తే సరికి వెళ్లి ఉండరు, కచ్చితంగా నన్ను చూసే ఉంటారని విషయం అంటాడు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 601 గుప్పెడంత మనసు సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker