Guppedantha manasu today:సాక్షిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పిన రిషి.

ఒకసారి వద్దు అనుకున్నవి మళ్లీ కావాలని అనిపిస్తుంది అని అంటుంది. ఇది నా విషయంలో జరిగిందని మనసులో అనుకుంటుంది. వసుధార మాట్లాడుతూ ఉండగానే రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు 

రిషి కోసం రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది వసుధారా.

 ఇది నిన్న జరిగిన 522 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ కథ.

రిషి సాక్షి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.

వసుధారకు దూరమవుతున్నానని చెప్పకనే చెప్పిన రిషి: వసుదార, రిషి ని కలిసి తన మనసులో విషయం చెప్పాలని అనుకుంటూ వస్తాడో, రాడని ఎదురు చూస్తుండగానే మెసేజ్ చేసి బయటికి రమ్మంటాడు రిషి. ఆ మెసేజ్ చూసి వసుదార సంతోషంతో బయటకు వెళుతుంది. నువ్వు పెళ్లి పీటల మీద నుండి ఎందుకు పారిపోయి వచ్చావు. నీకు చదవంటే ఇష్టం. మీ ఇంట్లో వాళ్ళు చదువు వద్దు పెళ్లి చేసుకోమన్నారు అందుకని పెళ్లి పీటల నుంచి పారిపోయి వచ్చావు అని రిషి అడగగా వసు  అవును అని సమాధానం ఇస్తుంది.

నువ్వు బాగా చదవాలి. మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేది. బాగా ఎత్తుకు ఎదిగిందని చెప్పుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ఆగకుండా ముందుకు వెళ్లడమే మంచిది. ఏమి జరిగినా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలని రిషి అంటాడు. దీని గురించి  మాట్లాడడం  అవసరం లేదు. ప్రశ్నలు అడగద్దు. వెళ్దాం రా అని చెప్పి వెళ్లి కార్లో కూర్చుంటాడు. ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని వసు ఆలోచిస్తూ వెళుతుంది.

రిషి సార్ మాటలు ఏమలుపును తీసుకురాబోతున్నాయో అని ఆలోచిస్తున్న వసుధార: ఇద్దరూ కారులో ప్రయాణం చేస్తూ ఇలా వెళ్లడం చాలా బాగుంటుంది అని రిషి చెప్పగా వసు అవునని అని సమాధానం ఇస్తుంది. మనం ఇలా కారులో వెళ్లడం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని అంటాడు రుషి. ఎందుకు మనం ముందు ముందు కూడా ఇలాగే వెళ్తాం కదా జ్ఞాపకం గా ఎందుకు మిగిలిపోతుందని ప్రశ్నిస్తుంది వసుధార. నాకు ఏమీ అర్థం కావటం లేదు రిసీ సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇది కొత్త మలుపుకు దారితీస్తుందా అని వసూ  తన మనసులో అనుకుంటూ ఉంటుంది.

పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నట్లుగా చెప్పిన రిషి: దేవయాని రిషి ఎందుకు ఏమీ మాట్లాడటం లేదని ప్రశ్నించగా. మహేంద్ర ఇంట్లో తక్కువగా మాట్లాడేది ఇద్దరు. ధరణికి మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుంది. రిషి మాట్లాడే అవకాశాన్ని తక్కువ వాడుకుంటాడు అని అంటాడు. మాట ఆయుధం లాంటిది. అవసరాన్ని బట్టి వాడాలి అని అనుకుంటానని సమాధానం ఇస్తాడు రిషి. అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. సాక్షి పేరెంట్స్ ని వీలు చూసుకుని రమ్మని చెప్పండి అని రిషి అనగా దేవయాని ఎందుకు? వాళ్లతో ఏం పని అని ప్రశ్నిస్తుంది. లగ్న పత్రిక రాసుకోవడానికి పిలిపించమని సమాధానం ఇస్తాడు. సాక్షిని పెళ్లి చేసుకుంటావా అని గౌతమ్ అడగగా అవునని సమాధానం ఇస్తాడు.

ఈ విషయం గురించి నన్నేమీ అడగవద్దు. పని త్వరగా పూర్తయ్యేలా మీరే చూడాలని దేవయానికి చెప్పి ఎవరైనా ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. మహేంద్ర, గౌతమ్ మాకు నచ్చలేదు. నీ ఇష్టాన్ని ఎవరు కాదనలేమని సమాధానం ఇవ్వగ. అందరు చెప్పినట్లుగా నా ఇష్టాన్ని నేను ఫాలో అవుతాను. సాక్షితో జరిగే పెళ్లిలో ఎలాంటి మార్పులు లేవని దేవయానితో  ఏర్పాట్లు చేయండి. ఎవరిని పిలువ వద్దు. వాళ్లు మనం మాత్రమే ఉండాలని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు రిషి.

షాక్ కు గురైన వసుధార: ఇక్కడ వసు  నీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వటం లేదు. రోజు రోజుకు మనసులో భారం ఎక్కువగా అవుతుందని మాట్లాడుకుంటూ ఉండగానే వసుదార కుజగతి ఫోన్ చేస్తుంది. ఎందుకు రిషి ఈ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని అడగక ఏం నిర్ణయం తీసుకున్నాడు మేడం అని అడుగుతుంది.  సాక్షితో పెళ్లికొప్పుకున్నాడని చెబుతుంది. అది విన్న వసుధార షాపు గురవుతుంది. రిషి సార్ సాక్షిని పెళ్లి చేసుకుంటున్నాడా అని బాధపడుతూ రిషి  చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది వసుధార.

రిషి తన రూమ్ లో కూర్చుని వసు ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఉండగా మహేంద్ర అక్కడికి వస్తాడు.

ఇది ఈరోజు జరిగిన 523 ఎపిసోడ్ గుప్పెడంత మనసు సీరియల్ మొత్తం కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker