Guppedantha Manasu Serial Today: దేవయానిపై విరుచుకుపడ్డ రిషి

#Guppedantha Manasu Serial Today: దేవయానిపై విరుచుకుపడ్డ రిషి. ఇది కళ అయితే బాగుంటుందని అంటాడు. భరించాలి మహేంద్ర, భరిద్దాం. రిషికి మనం ఇచ్చే కానుక అని అనుకుందామని జగతి అంటుంది. నిన్ను ఆ దేవుడే నాకు ఇచ్చిన కానుక అని రిషి అంటాడు. లేదు మీరే నాకు ఒక గొప్ప కానుక, అపురూపమైన కానుకగా మీరు నాకు దొరికారని, వసుధార అంటుంది. ఇది నిన్న జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ 587 ఎపిసోడ్ పూర్తి కథ.

దారిలో జగతి మహేంద్ర లను,రిషి, వసుధార కలుసుకొని మాట్లాడుతారా? లేక ఏం జరుగుతుందో?  ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

నిన్న జరిగిన కథ నుంచే ఈరోజు సీరియల్ ప్రారంభం అవుతుంది. చీకటిలో కూడా ఈరోజు అందంగా అనిపిస్తుందని రిషి, వసుతో అంటాడు. చీకటి కూడా ఈరోజు భయంకరమైన చీకటిగా మన జీవితంలో మారిపోతుందని మహేంద్ర జగతితో అంటాడు. తననీ రూమ్ దగ్గర దించి, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

దేవయానిపై విరుచుకుపడ్డ రిషి:

ఉదయం కాగానే వసుధార సెల్ కు జగతి మేడం మెసేజ్  చూసుకొని, మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయం నువ్వే చూసుకో అని ఉన్నది చూసి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ మహేంద్ర కోసం రిషి వెతుకుతాడు. మహేంద్ర రాసి పెట్టిన వెళ్తున్నాం అనే మాటను చూసి కంగారు పడతాడు. పెద్దమ్మ డాడ్ ఎక్కడ? వెళ్తున్నాం అని రాశాడు. ఎక్కడికి వెళ్ళాడు? మీరు చూడలేదా? అని అంటాడు. వెళ్తుంటే నేను ఆపాను. వినలేదని అంటుంది. నాకు ఫోన్ చేసి చెప్పాలి? కదా అని కోపపడతాడు.

గుప్పెడంత మనసు

నేను అడిగితే అన్ని మీకు చెప్పాలా? నన్ను చాలా మాటలు అన్నారని ఏడుపు నటిస్తూ చెబుతుంది. వాళ్ళు ఏమన్నారు, కాదు వాళ్ళని ఆపి, నాకు ఫోన్ చేయవచ్చు? కదా అని అంటాడు. ఏమైనా గొడవ జరిగిందా? మీరు ఏమైనా అన్నారా? అని కోపంగా అరుస్తాడు. బయటికి వెళ్తుంటే జాలి ట్రిప్ అనుకున్నాను, వెళ్ళిపోతున్నారని అనుకోలేదని అంటుంది.  అలా ఎలా వెళ్ళిపోయారు అని అంటాడు. నామీద ప్రేమతో మీరు ఆయన్ని ఏమన్నా అన్నారా? మీకు డాడీకి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతాయి. కదా లేక మేడంని ఏమన్నా అన్నారా? అని గట్టిగా నిలదీస్తాడు. ఏంటి రిషి గట్టిగా అడుగుతున్నాడని మనసులో అనుకుని, నేను ఏమంటాను అని నటిస్తుంది. పెద్దగా ఏదో జరిగింది. లేకపోతే నన్ను వదిలి వెళ్ళడు అంటాడు. ఓళ్లో తల పెట్టుకొని ఏడుస్తాడు, అనుకుంటే నన్నే అనుమానిస్తున్నాడని దేవయాని మనసులో అనుకుంటుంది. మీరు నిజం చెప్పండి, నిజం చెప్పటం లేదు కదా అని నిలదీస్తాడు. నాన్న రిషి నేను నీకు అబద్ధం చెబుతాన అంటూ నటిస్తుంది దేవయాని.

దేవయానిని సైలెంట్ గా ఉండమని చెప్పిన గౌతమ్:

గౌతమ్ వచ్చి ఏం జరిగింది అంటాడు. దేవయాని వారు వెళ్లిన విషయం చెబుతుంది. ఎక్కడికి? అని అంటాడు. వెళ్లే వాళ్ళు చెప్పి వెళ్తారా? ఏంటి? వెళ్లే వాళ్ళు  రీషిని బాధ పెట్టాలని, నామీద నిందలు వేయాలని వెళ్ళారని అంటుంది. నిన్ను వదిలేసి ఎలా వెళతారని రిషితో అంటాడు. అయినా ఇవేమీ బుద్ధులో, ఇవేమీ ఆలోచనలో, ఇలా వెళ్తారని దేవయాని అంటుంది. వద్దు అంటే జగతిని ఇంట్లోకి తెచ్చారు. ఇప్పుడు తండ్రి, కొడుకును దూరం చేసింది అంటుంది. పెద్దమ్మ మీరు ఆగండి అని గౌతమ్ అంటాడు. వాళ్లు ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు, అంటూ ఫోన్ చేస్తాడు, ఫోన్ స్విచాఫ్ రావడంతో సైలెంట్ గా ఉంటాడు. నేను తన ఫ్రెండ్ అని అంటారు. అలాంటిది అలా ఎలా వెళ్ళిపోతారని? రిషి అంటాడు. ప్రేమ ఉంటే వెళ్తారా? ఏంటి! ఏం మనుషులో ఏంటో, జగతి అయినా చెప్పాలి, కదా ఇలా వెళ్లడం తప్పు అని అంటుంది.

అసలు ఇదంతా ఆవిడ ప్లాన్ అంటుంది. మీరు ఆపండి గౌతమ్ దేవయాని అంటాడు. నువ్వు కూర్చో అని  రీషిని కూర్చోబెడతాడు. నేను వెళ్లి చూస్తాను, ఎక్కడికి వెళ్లరు అని అంటాడు. ముందు ఆ పని చేయండి, కావాలని తప్పించుకొని వెళ్ళిన వాళ్ళని ఎక్కడని వెతుకుతాం అంటుంది.  ధరణికి చూసుకోమని చెప్పి గౌతమ్ వెళ్లిపోతాడు. వాళ్ళు ఎప్పుడు రావాలి? నేను అన్న మాటలకి గుమ్మం కూడా తొక్కారని మనసులో అనుకుంటుంది.  నేనేమైనా తప్పు చేశానా, నాకు తెలియకుండా డాడ్ ని బాధపెట్టాన అని బాధపడుతూ ఉంటాడు. నాన్న లేదు, అయినా నువ్వేమన్నావు అని అంటూ ఓదార్చుతుంది.

నేను డాడ్ తో మాట్లాడలేదని, కోపంగా వెళ్లాలని డాడ్ బాధపడ్డారా?ఈ మాత్రం దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? నేనంటే చాలా ప్రేమ కథ, నన్ను వదిలి వెళ్ళిపోతారని బాధపడతాడు. నీకు ఏం చెప్పి ఓదార్చాలో నాకు తెలియటం లేదని, తనని తన భుజంపై పడుకోబెట్టుకుని ఓదార్చుతుంది. ధరణి ఈ మహాతల్లి ఏదో చేసి ఉంటుందని మనసులో అనుకుంటుంది. ఏంటి చూస్తున్నావ్? ధరణి, వెళ్లి కాఫీ తీసుకొని రా అంటుంది. ఇప్పుడు దారిలోకి వచ్చాడు అని మనసులో ఆనందపడుతుంది దేవయాని.

రిషి ని జాగ్రత్తగా చూసుకోమని వసుతో చెప్పిన గౌతమ్:

వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదని వసు, గౌతమ్ తో అంటుంది. రిషి చాలా బాధలో ఉన్నాడు. పెద్దమ్మ చెప్పిన కంట్రోల్ అవ్వడం లేదు. రిషి ని నువ్వే చూసుకోవాలని గౌతమ్ అంటాడు. సార్ ఇంట్లో గొడవ ఏమైనా జరిగిందా? మేడంని, సార్ను, దేవయాని మేడం ఏమైనా అన్నారా? అని అడుగుతుంది. అదేమీ తెలియదు. అసలు ఆ విషయం పక్కన పెడితే, ముందు మనం రిషిని చూసుకోవాలని అంటాడు రిషిని ఒంటరిగా వదిలేయకు, వాడు ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా, నువ్వు రిషి సంగతి చూసుకో, నేను అంకుల్ ,మేడం వాళ్ళ సంగతి చూస్తాను, వాడి గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉందని అంటాడు. వాళ్లు వెళ్లిపోవడానికి నేనే కారణమా అని వసుధార మనసులో అనుకుంటూ వెళ్తుంది.

తండ్రి కోసం ఆవేదన చెందుతున్నరిషి:

రిషి వాళ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి పెద్దమ్మ ఇది. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడని? అడుగుతాడు. నీమీద ప్రేమ ఉంటే తను వెళ్లకుండా జగతిని పంపించేవాడు, కానీ వెళ్లిపోయాడు. అంటే నీ మీద ప్రేమ లేనట్లే కదా అంటుంది. లేదు నేనంటే ఆకాశమంత ప్రేమ, ఆ విషయం నాకు తెలుసు, డాడ్ నన్ను ఎప్పుడు ఏమీ అనలేక, తనని తాను శిక్షించుకుంటారని, నా మీద కోపం వస్తే తిట్టాలి, కొట్టాలి, అరవాలి అంతేకానీ ఇలా చేయడం ఏంటని అంటాడు. వెళ్లిపోయిన ప్రేమ తగ్గడం లేదని మనసులో దేవయాని అనుకుంటుంది. ఏంటో రిషి మహేంద్ర నీకు దూరం అవుతున్నాడేమో? అని అనిపిస్తుంది. అసలు జగతి అని చెప్పేలోపే లేదు డాడి నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్.

నామీద కాకపోతే ఇంకెవరి మీద హక్కు ఉంటుంది. నేను చెప్పేది, చేసేది తప్పు ఇలా చేయొద్దు అలా చేయాలి అని అరవాలి కదా, అరవరు. నాకు తెలుసు. అరిస్తే నేను బాధపడతానని అనుకుంటారు. నన్ను విడిచి వెళ్లినందుకు నాకంటే ఎక్కువగా డాడ్ బాధపడుతుంటారు పెద్దమ్మ అని అంటాడు. ఇది మరీ బాగుంది. ఏంటో  రిషి ఆలోచనలు. వదిలి వెళ్లాడంటే మెచ్చుకుంటున్నాడు ఏంటో, అని అనుకుంటుంది. నన్ను వదిలి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్, వెళ్తుంటే మీరైనా ఆపాలి కదా అని అంటాడు. ఇలా మారిపోయాడు ఏంటో! అని అనుకుంటుంది. మీరు చూశారు కదా, ఆపవచ్చు కదా అని, ఆపాలి కదా అని అంటాడు. వాళ్లు లేకుంటే నేమి పెద్దమ్మ, మీరున్నారు కదా అని అనడమే లేదని అనుకుంటుంది. రిషి మహేంద్ర కు మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. జగతికి ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తాడు. జగతికి ఫోన్ కూడా చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది.

దేవయాని దిమ్మతిరిగేలా చేసిన వసుధార:

ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. వసుధారను మహేంద్ర గురించి అడుగుతాడు. ఎక్కడికి వెళ్లారు? మీ మేడం కూడా నీకు చెప్పలేదా? అని అడుగుతాడు. వసు లేదని చెప్పి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మీరు టెన్షన్ పడకండి, రండి సార్ కొంచెం రిలాక్స్ అవుదురు అని పిలుస్తుంది. దేవయాని వచ్చి రిషిని ఎక్కడికి తీసుకొని వెళుతున్నావని? అడుగుతుంది.  రిషి సార్ టెన్షన్ లో ఉన్నారు. ఒక కప్పు కాఫీ పంపించమని చెబుతుంది. ఏంటి! నేనా అనే దేవయాని అంటుంది. అవును మేడం మీరే, కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ అని చెప్పి, రిషి ని తీసుకొని పైకి వెళ్తుంది. దేవయాని కోపంతో రగిలిపోతుంది.

ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 588 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.

వసుధార అన్న మాటలకు దేవయాని ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో, మహేంద్ర, జగతి కనిపిస్తారో, లేదో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker