Vikram: తనను తానే పరిచయం చేసుకోవాల్సి వచ్చినా హీరో విక్రమ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ ఇకపై అభిమానులకు ఎంతో దగ్గరగా అవుతున్నాడు. మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్డేట్లు ఇతర ముఖ్యమైన విషయాలను తన దగ్గరగా ఉన్న అభిమానులకు షేర్ చేయనున్నారు విక్రమ్. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో అందర్నీ ఆకట్టుకున్న విధంగా ఉంది. ఆ వీడియోలో ఏముంది అన్నదే ఒక చిన్న సందేహం.
సాధారణంగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే విక్రమ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు విక్రమ్. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలో ఆయనకు ఇప్పటివరకు కూడా ఫేస్బుక్ ఖాతా కూడా లేదంటే అర్థమవుతుంది. అభిమానులందరికీ కోరిక మేరకు 2016 ఇంస్టాగ్రామ్ లో ఆయన ఖాతా ను ప్రారంభించారు .అయితే ద రియల్ చియాన్ అనే ఉన్న పేరుతో ఖాతా ఓపెన్ చేశారు.
ఆ ఖాతా మేరుకు తన ఇష్ట ఇష్టాలకు కొత్త సినిమా అప్డేట్లు మరియు షూట్ యొక్క లొకేషన్స్ ఆయన అప్లోడ్ చేస్తూ ఉంటారు. మరెన్నో విషయాలను ఆయన ఖాతాలో పోస్ట్ చేస్తూ అందరికి షేర్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆయన మరో కొత్తగా సోషల్ మీడియా ప్లాట్ఫారం లోకి అడుగుపెట్టారు. ట్విట్టర్ వేదికపై ఆయన అందుబాటులోకి వచ్చారు అని ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రాత్రి మీటర్లో ఒక స్పెషల్ వీడియోను ఆయన షేర్ చేశారు.
ఆయన ఒక పొడవటి పెద్దటి గడ్డంతో ఉన్న విభిన్నమైన లుక్ తో కనిపించారు. నేను మీ చియాన్ విక్రమ్ అని ఆయన పరిచయం చేసుకున్నారు. ఇది నిజంగా నేనే డూప్ కాదు అని ఆయన వ్యక్తం చేశారు. తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న అని ఆయన చెప్పారు. చాలా ఆలస్యంగా వచ్చాను ఏమీ అనుకోకండి అని అభిమానులకు ఆయన చెప్పారు. ఇది సరైన సమయమేనని అనుకుంటున్నా అని ఆయన తెలియజేశారు.
మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానంకు ఆప్యాయతలకు కృతజ్ఞతలు అని ఆయన తెలియజేశారు. ట్విట్టర్లో మీకు అందుబాటులోకి ఉంటానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన విక్రమ్ అభిమానులు తమ నటుడు ట్విట్టర్ లోకి వచ్చినందుకు అభిమానులు అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు….