Vishal: మరోసారి గాయాలపాలైన హీరో
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ బాగా తెలుసు. మొదటిసారిగా ప్రేమ చదరంగం వంటి సినిమాతో విశాల్ ఇండస్ట్రీలోకిఅడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన పందెంకోడి చిత్రం తో మంచి విజయాన్ని సాధించుకున్నాడు.
ఆ చిత్రం ఒకేసారి తెలుగులో, తమిళంలో కూడా విశాల్ కి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ విధంగా విశాల్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఇది ఇలా ఉండగా హీరో విశాల్ మరోసారి గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ” షూటింగ్ సమయంలో గాయపడ్డ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకు రావడం జరిగింది.
చెన్నైలో ఈ తెల్లవారుజాము న ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెప్పడం జరిగింది. వెంటనే ఆయన్ను చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ చేస్తున్నా పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ పేరు ‘మార్క్ అంటోనీ’.