Priyanka Arul Mohan:భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నటి ప్రియాంక మోహన్

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి హీరో నాని సరసన నటించిన హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలా అంటుంది. ఈమె పూర్తి పేరు ప్రియాంక అరుల్ మోహన్. ఈమె బెంగళూరు, కర్ణాటకలో జన్మించింది.

ప్రస్తుతం ప్రియాంక వయసు 28 సంవత్సరాలు.ప్రియాంక తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్ లో నటించింది.ఓంధ్ కథే హెల్లా అనే కన్నడ మూవీ ద్వారా పరిచయమైంది.ఈమెప్రియాంక

తెలుగులో గ్యాంగ్ లీడర్, శ్రీకారం వంటి మూవీస్ లో నటించింది. గ్యాంగ్ లీడర్ 2019 సంవత్సరంలో, శ్రీకారం 2021 సంవత్సరం లో ఈ మూవీస్ లో నటించింది. ఇది అంతగా హిట్ కాలేదు. నెక్స్ట్ కోలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. ఇక్కడ శివ కార్తికేయన్ పక్కన హీరోయిన్గా నటించిన డాక్టర్ మూవీ హిట్ అయింది.

భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నటి ప్రియాంక మోహన్
భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన నటి ప్రియాంక మోహన్

ఈ మూవీ ద్వారా ఫేమస్ అయింది. తర్వాత ఎదర్కుమ్ తుణిందవన్ అనే మూవీలో సూర్య తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీనివల్ల ప్రియాంక కెరీర్ కు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. దీని తర్వాత వెంటనే శివ కార్తికేయన్ తోనే డాన్ అనే మూవీలో నటించింది.

ఈ మూవీ హిట్ అయింది. ఈ మూవీస్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో నటించడం మూడు సంవత్సరాలే అయినా, ఇప్పటివరకు మూడు భాషల్లో ఈమె నటించిన చిత్రాలు కేవలం 6 అయిన రెమ్యూనరేషన్ భారీ మొత్తంలో ఉంటుందని సమాచారం.

ఎంతోకాలంగా ఎన్నో మూవీస్ లో నటించిన హీరోయిన్ త్రిష గారు కోటి రూపాయల కంటే తక్కువనే రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ స్టార్స్ సెలబ్రిటీస్ తో దీటుగా, వారికి సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ప్రియాంక మోహన్. ప్రస్తుతం ఈమె కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని సమాచారం.

ప్రజెంట్ ఈమె హీరో ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్, జయం రవి పక్కన, డైరెక్టర్ ఎం. రాజేష్ తీస్తున్న మూవీ లో కూడా నటిస్తున్నారు. తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను సంపాదించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు దీటుగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker