ఐటమ్ సాంగ్ లకు స్టెప్పులు వేయబోతున్న అందమైన భామలు

మూవీ సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ పాట. స్పెషల్‌ సాంగ్‌ గా ఆ మ్యాజిక్‌ చేస్తుంది. ఒక్కసారిగా ఆ పాట ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి మూవీలో దాదాపు ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండటం కామన్‌ అయింది. అలా రాబోతున్న రోజుల్లో సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయనున్న ‘స్పెషల్‌ సాంగ్స్‌’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం.

ఐటమ్ సాంగ్ లకు స్టెప్పులు వేయబోతున్న అందమైన భామలు

తెలుగు మాస్‌ ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్‌ జానీ’, ‘కాబిల్‌’ వంటి హిందీ సినిమాల్లో ఇప్పటికే స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్‌ రోల్ లో, రవితేజ ప్రదాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ వాల్తేరు వీరయ్య’ లో ఊర్వశి స్టెప్పులను చూడబోతున్నాం.

శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడిన స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులు వేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా ముగిసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీ లోని ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది.

ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించిన ‘బ్లాక్ రోజ్’ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కు దర్శకుడు సంపత్ సంధి కథ అందిచారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డాన్స్ స్టెప్పులను ‘బోళా శంకర్’ సినిమాలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం లో తమన్నా హీరోయిన్.

ఈ సినిమాలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్ కి డాన్స్ చేశారు రష్మీ. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదల కానుంది. మరోవైపు భారత మారాలి ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యతో కలిసి స్పెషల్ డాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. సినిమా సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్ లో బాలకృష్ణతో కలిసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు.

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ చిత్రం కు వేణు మూడింటి దర్శకుడు.ఈ మూవీలో ‘నన్ను పెట్టుకుంటే… అనే సాంగ్ లో నిర్ణయించారు హెబ్బా పటేల్. ఈ చిత్రం కు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక గత సంవత్సరం సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్ నుంచి షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటాయి.

ఈ అమ్మడు ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్ బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్ లో మెరవనున్న చారులు కొందరున్నారు. చిత్రానికి స్పెషల్గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారలు కెరీర్ లోనూ స్పెషల్ గా నిలిచిపోతారు. అందుకే శ్రుతీహసన్, తమన్నా వంటి అగ్ర చారులు కూడా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker