కర్నూల్: “అగ్రిగోల్డ్” బాధితులకు బాసటగా జగనన్న ప్రభుత్వం
అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా, జగనన్న ప్రభుత్వం శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే ‘శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి” గారు, కర్నూలు నగర మేయర్ శ్రీ.బి.వై.రామయ్య గారు.
‘రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కట్టి 10 వేల రు.ల లోపు డబ్బు కట్టి మోసపోయిన బాధితులకు జగనన్న ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే”.
తాజాగా మన రాష్ట్ర ప్రభుత్వం రేపు 20 వేల లోపు కట్టిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మన జగనన్న ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వకుండా బాధితులకు బాసటగా నిలుస్తుందనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని అన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని సీఎం జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు చేశారు.
మాట ఇస్తే తప్పకుండా చేసే మనస్తత్వం మన రాష్ట్ర ప్రభుత్వం, మన జగనన్నది అని ఇప్పుడు మరోసారి రుజువు చేసుకున్నారు అని అన్నారు ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈకార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర వీరలింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ గారు,పలువురు అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.