Karathika deepam: కార్తీకదీపం సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న వంటలక్కకు వచ్చిన మంచి అవకాశం ఏంటో తెలుసా?

Telugu movies

స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారికి సైతం ఈ సీరియల్ అంటే అంతగా ఇష్టపడతారు. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారం అయినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఈ సీరియల్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

vantalakka
vantalakka

కార్తీకదీపం సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్, పరిటాల నిరూమ్, అంతేకాక శోభా శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తున్న ప్రెమి విశ్వనాథ్ కేరళకు చెందినది. మలయాళ సీరియల్ రీమిక్స్ చేసి తెలుగులో కార్తీకదీపం సీరియల్ గా ప్రసారం చేస్తున్నారు.

కార్తీక దీపం సీరియల్ మొత్తం నాలుగు సీజన్లు ఉన్నాయని, దర్శకుడు కాపుగంటి రాజేంద్ర తెలిపిన సోషల్ మీడియా ద్వారా వెల్లడి అయింది. కార్తీకదీపం సీరియల్ 2017 సంవత్సరంలో ప్రసారం చేయబడింది. ఇందులో ప్రమీ విశ్వనాథ్ (వంటలక్క, దీప), పరిటాల నిరూపమ్ (డాక్టర్ బాబు, కార్తీక్), శోభా శెట్టి (మౌనిత) ప్రధాన పాత్రల్లో నటించారు.

వీరు సీరియల్ ప్రసారం అయినప్పటి నుండి మార్చి 2022 వరకు కనిపించారు. ఇంతవరకు సీజన్ వన్ గడిచింది. సీజన్ వన్ లో దీపా, కార్తికులకు పుట్టిన హిమా,సౌర్యలు మరియు మౌనితకు పుట్టిన ఆనంద్ తో సీజన్ 2 నడుస్తుంది. సీజన్ 2 లో హిమస్థానంలో కీర్తి బట్, సౌర్య స్థానంలో అమూల్య ఓంకార గౌడ నటించగా, వారి మేనత్త కొడుకులుగా ప్రధాన పాత్రలలో మానస్ నాగులపల్లి, మరియు మనోజ్ కుమార్ నటించారు. ఈ సీజన్ 2022లో ప్రారంభం కాగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ప్లాష్ బ్యాక్ స్టోరీ ని చూపిస్తున్నారు.

దీనిని సీజన్ 3గా చెప్పుకోవచ్చు. ఇందులో మళ్లీ కార్తీక్, దీప, మౌనిత స్యార్య,హిమలతో స్టోరీ నడుస్తుంది. ఇదంతా జరిగిన ప్రజలకు అర్థం కాని విషయం ఒకటే. అదేమిటంటే సీజన్ 2 లో హిమా, సౌర్య పెద్దవారు అవటం. ఇద్దరూ ఒకరినే ప్రేమించడం. వారు ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడం.

అలాగే శౌర్య తల్లిదండ్రులు తిరిగి వస్తారు అనే నమ్మకంతో ఉండడం. అదేవిధంగా హిమను సూటిపోటి మాటలతో హింసించడం అంతా తెలిసింది. కానీ ఇంతలో మళ్ళీ ఎందుకు గతంలో జరిగిన స్టోరీ చూపించారు. అది ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం సీరియల్ లో ఏం జరుగుతుందంటే సౌర్య తల్లిదండ్రులను కలుసుకోవడం కోసం వెతుకుతూ ఉంటుంది. తన నానమ్మ, తాతయ్య వాళ్ళతో హిమ కలిసి ఉంటుంది.

ఇక్కడ దీప, మౌనితతో తన భర్త కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈ సీజన్ 3 లో ఇదంతా జరుగుతున్నప్పుడు సీజన్ 2 లో సౌర ఎందుకు హిమపై కోపంగా ఉంటుంది. ఈ సీజన్లో తమ తల్లిదండ్రులను కలుసుకోవడానికి వెతుకుతున్న శౌర్య, వారు బ్రతికే ఉన్నారని సీజన్ 2 లో ఎందుకు చెప్పలేదు? మరొక సందేహం ఏమిటంటే శౌర్య తన తల్లిదండ్రులను కలిసిన కూడా తన నానమ్మ తాతయ్య వాళ్లు తమ తల్లిదండ్రుల కోసం, తన కోసం వెతకలేదని కోపంతో సీజన్ 2 లో చూపించిన విధంగా వాళ్లు బతికే ఉన్నారని చెప్పకుండా కోపం నటిస్తుందా ?అనేది ఎవరికి అర్థం కావడం లేదు.

మరికొందరు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నది ఏమిటంటే? దీప కార్తికులు మళ్లీ సీరియల్ లోకి రావాలని కోరి నందున సీజన్ 2 లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అని తిరిగి దీపా కార్తీక్ కు జరిగిన యాక్సిడెంట్ దగ్గర నుంచి చూపిస్తున్నారు అని చెబుతున్నారు. ఏదేమైనా ఎంత తికమకగ చూపించిన ఈ సీరియల్ ను మాత్రం ప్రేక్షకులు విడిచిపెట్టడం లేదు. ఈ సీరియల్ లోకి వంటలక్క డాక్టర్ బాబు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు.

వీరు తిరిగి రాగానే ఈ సీరియల్ ఇమేజ్ కూడా మళ్ళీ పెరిగింది. ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో నటించిన ప్రేమీ విశ్వనాధ్. అంటే ఎవరో అనుకున్నారు? ఎవరో కాదు వంటలక్క తాజాగా ఒక సినిమాలో మెయిన్ రోల్ లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏది అంటే అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

vantalakka
vantalakka

ఈయన చేయబోయే కొత్త సినిమా NC22 ఇందులో అక్కినేని అఖిల్, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోనే వంటలక్క మొదటిసారిగా సినిమాలో లో నటిస్తుంది. NC22సినిమాలో అఖిల్, కృతి శెట్టి ప్రమీ విశ్వనాథ్, మరియు ప్రియమణి కూడా నటిస్తున్నారు.

ఈ సమాచారాన్ని చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న వంటలక్క స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం పెద్ద విశేషంగా మారింది. వంటలక్కకు ఈ అవకాశం వచ్చినందుకు తన అభిమానులుపండగ చేసుకుంటున్నారు. సినిమాలో వంటలక్క ఏ క్యారెక్టర్ లో నటిస్తుందో? సీరియల్ లో లాగా సినిమాలలో కూడా నటించి మెప్పిస్తుందో? అదే విధంగా తనకు వచ్చిన మంచి అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో? ఇక వేచి చూడాల్సిందే.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker