Karthika deepam serial today episode:హిమను చంప దెబ్బ కొట్టిన సౌందర్య

హిమను చంప దెబ్బ కొట్టిన సౌందర్య:

నిరుపమ్, సౌర్య ఇద్దరు కలిసి రూమ్ లో నిద్రపోతూ ఉంటారు. నిరుపమ్ నిద్రలో నుంచి లేచి నేనుండగా సౌర్య పడుకుంది.సౌర్యకు ధైర్యం ఎక్కువగానే ఉంది. చలిగా ఉన్నట్టుంది. బెడ్ షీట్ కప్పి వెళ్లి పడుకుంటా పడుకుంటాడు. శౌర్య లేచి తిరిగి మళ్లీ బెడ్ షీట్ తీసుకొని వెళ్ళి నిరుపమ్ కు కప్పుతుంది. నాలాంటి పేదలకు ఇది అలవాటే.

మీరు తట్టుకోలేరు. సుకుమారంగా పెరిగారు. ఇవన్నీ మీకు కొత్త కదా అని అంటుంది. నీ ప్లేస్ లో హిమ ఉంటే దారుణమైన ప్లేస్ లో కూడా ఎలాగైనా సర్దుకుని ఉంటాను. మనం ఎక్కడ ఉన్నాం కాదు ఎవరితో ఉన్నామనేది ఇంపార్టెంట్ అంటాడు.  శౌర్య బాధపడుతూ ఏడుస్తూ పడుకుంటుంది. నిరుపమ్ హిమ గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. తెల్లవారగానే లేచి ప్రేమ్ ని పిలుస్తాడు నిరుపమ్.

ఇది నిన్న జరిగిన1422 ఎపిసోడ్ లో జరిగిన కథ.

సౌందర్య ఇంటికి వచ్చి స్వప్న తిట్టడం: తలుపులు తెరుచుకోగానే అందరూ కలిసి ఇంటికి వెళతారు. సౌందర్య నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతుంది. ఏంటి ఆటో నడుపుకునే దాన్ని ఎవరూ కిడ్నాప్ చేయకూడదా? మీలాగా డబ్బున్న వారిని కిడ్నాప్ చేయాలా అని మాట్లాడుతుంది సౌర్య.

 సౌందర్యను మూడు రకాల టిఫిన్స్ టిఫిన్స్ చేయి ఎందుకంటే అందరి మూడ్లు బాగా లేవు కదా అని జోక్ వేస్తాడు ప్రేమ్. ఇంతలో అక్కడికి ప్రేమ్ నిరుపమ్ లతల్లి స్వప్న వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ గట్టిగా అరుస్తుంది. ఇంతలో సౌందర్యం సౌర్యను కిడ్నాప్ చేశారని చెప్పగానే ఎవరు ఎక్కడికి పోతే నాకెందుకు. చూడబోతే నా కొడుకులను ఇక్కడే శాశ్వతంగా పెట్టుకోవాలని ఉన్నారు. నా ఇద్దరు కొడుకులను మీ ఇద్దరి మనవరాలు కోసమే కన్నటున్నాను అంటుంది స్వప్న.

సౌందర్య ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అనగా లేకపోతే ఏంటి నిరూపం వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఫ్రేమ్ కూడా ఇక్కడే ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. నిరుపమ్ ను హిమా మాయ చేస్తే, ప్రేమ్ ను సౌర్య మాయ చేసేలా ఉందని అంటుంది. దీంతో సౌర్యకుకోపం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఉండనుఅంటుంది. నీవల్లే ఇదంతా. మీరేమో దీన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. దీన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇలాంటి గొడవలలో నా కొడుకుని బలి చేయలేను. ఇది ఇంతటితో ఆగదని, హిమవల్లా కొందరు జీవితాలు పోయాయి. సౌర్యవల్ల బతుకులు నాశనం అయ్యేలా ఉన్నాయని కోపడుతుంది. నేను చస్తే కానీ టెన్షన్ పోయేలా లేదని స్వప్న బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

స్వప్న శోభ కలిసి నిరుపం కోసం ప్లాన్ వేయడం: నేను మంచి ప్లాన్ వేసి సౌర్యను కిడ్నాప్ చేస్తే నిరుపమ్ ఏం పని ఉందని అక్కడికి అక్కడికి వెళ్లి  సౌర్యనుకాపాడాడు. నేను అనుకున్న పనులన్నీ అవుతాయా, నా హాస్పిటల్ ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి. అవి ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.

నేను జీవితంలో స్థిరపడతానా, లేదా అనినేను మంచి ప్లాన్ ఆలోచించాలి. స్వప్న అంటీ ద్వారా ఏమీ ఉపయోగం లేదని తనతో తనే మాట్లాడుతూ ఉండగా స్వప్న వస్తుంది. మా అమ్మ నాన్న వాళ్లకే సాయం చేస్తున్నారు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది. స్వప్న మీరు కూల్ గా ఉండండి మీ అమ్మానాన్నలను మార్చలేము.

హిమ మనసు మార్చలేము. నిరుపమ్ మనసు మార్చగలిగితే పెళ్లి ఆపేయచ్చు అంటుంది. నిరుపమ్ బలహీనతలు రెండు ఒకటి హిమ మీద ఉన్న ప్రేమ. రెండు మీ మీద ఉన్న ప్రేమ మీరు రెండు రోజులు భోజనం మానేయండి. అలా చేస్తే నిరుపమ్ మనసు కరుగుతుంది .అలా చేస్తే  మా పెళ్లి భోజనాలు పెట్టగలరు అని అంటుంది శోభ.

హిమ మీద సౌందర్యకు అనుమానం రావడం: సౌర్య కిడ్నాప్ అవ్వడానికి హిమకు సంబంధం ఉంది అనుకుంటున్నాను. దీనికి పరిష్కారం హిమను నిరుపమ్ ల పెళ్లి జరగడమే. నీరుపమును, సౌరను కలపాలని ప్లాన్ చేసి ఉందేమో అనుమానంగా ఉందని మాట్లాడుకుంటారు ఆనందరావు, సౌందర్య. శౌర్య నిరూపమన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ  కోపంతో దిండును విసరగా ఆనందరావుకు తగులుతుంది.

ఆనందరావు నిరుపమ్ తో గొడవపడి ఉంటుంది అందుకే ఇలా చేస్తుందని తన మనసులో అనుకుంటాడు. సౌర్యను ఏమైంది అని అడగగా శౌర్య ఏమీ చెప్పదు. ప్రేమ ఉంటే ఎన్ని తప్పులు చేసినా క్షమించవచ్చు.  దానివల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అంటాడు ఆనందరావు.

హిమకు షాక్ ఇచ్చిన సౌందర్య: సౌర్య ,నిరుపము ఒకే చోట ఉంటే ఫ్రెండ్స్ అవుతారు అనుకుంటే ఎప్పటిలాగే ఉన్నారు. వీళ్ళని ఎలా కలపాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే సౌందర్య లగ్నపత్రిక తెచ్చి చూపిస్తుంది. అది నిరుపమ్ హిమల పెళ్లి కార్డు దీనిలో ఉన్న తేదీకి హిమకు నిరుపముకు పెళ్లి జరుగుతుందని అంటుంది. వద్దు సౌర్యను నిరుపమ్ను  కలపాలని ప్రయత్నిస్తుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. దాంతో కోపం వచ్చి చెంప మీద కొడుతుంది. ఇలా మాట్లాడితే మళ్ళీ కొడతానని అంటుంది. ఇన్ని రోజులు చేసిన పనులన్నీ మర్చిపో, ఆపేయ్ నేను చెప్పింది విను.

నీకు నిరుపమ్ కు పెళ్లి అనుకున్నాము. కార్డులు ప్రింట్ చేశాను. పెళ్లి జరిగి తీరాలిఅంటుంది సౌందర్య. నిరుపమును, శౌర్య కోరుకుంటుంది కదా అని హిమ చెప్పగానే నిరుపమ్ ఇష్టపడటం లేదు కదా అంటుంది సౌందర్య. శౌర్య ఆనందం కోసమైనా ఈ పని చేయాలని అంటుంది హిమ. ఇది ఈరోజు 1422 ఎపిసోడ్ లో జరిగిన కార్తీకదీపం సీరియల్ మొత్తం కథ

స్వప్న వేసిన ప్లాన్ ఫలిస్తుందో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker