Karthika deepam serial today:తను నా భార్య నేనా అని అన్న కార్తీక్?

తను నా భార్య నేనా అని అన్న కార్తీక్:

అమ్మ నాన్నలు గుర్తుకొస్తే ఏడుపు ఆగడం లేదని అంటుంది వాళ్లు బ్రతికే ఉన్నారు ,వాళ్ళు హాస్పిటల్లో లేరు అందుకే వాళ్ళు బతుకే ఉన్నారని వాళ్ళని వెతుకుదాం అని సౌర్యం అంటుంది. నువ్వు ఆటో  నేర్చుకుంటాను అన్నావుగా, ఆటోను తెస్తాను నేర్చుకుంటూ అమ్మానాన్నలను వెతుకుదాం అని గండ అంటాడు. సరే అనిసంతోషంగా ఇంట్లోకి వెళుతుంది సౌర్య. నువ్వు ఎందుకు అలా చెప్పావు అని చంద్రమ్మ అంటుంది. అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఆటోను నేర్పిస్తే ఆలోచనల నుండి బయటకు వస్తుంది అని గండ అంటాడు.

ఇది నిన్న జరిగిన 1438 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

కార్తీక్ కోసం మౌనితను నిలదీసిన దీప: దీప కార్తీక్ గురించి అడుగుతూ, వెతుకుతూ ఉంటుంది. ఇంకొక వ్యక్తి కూడా కార్తీక్ ఫోటోను చూపిస్తూ అడుగుతూ ఉంటారు. ఎంతమందిని అడిగి నా తెలియదని అంటున్నారు, ఎక్కడున్నారని అనుకుంటుంది దీప. ఇంతలో కార్తీక్ ఫోటోని చూసి షాక్ అవుతుంది. ఎవరు వెతుకుతున్నారని చూస్తే మౌనిత. ఇద్దరూ షాక్ అవుతారు, అలాగే నిలబడి చూసుకుంటారు. అప్పుడు దీపకు, నర్స్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. కోపంతో మౌనిక గొంతు పట్టుకుంటుంది. మోనితో విడిపించుకుని నువ్వు బ్రతికే ఉన్నావా, మరి నా కార్తీక్ ఎక్కడ?  బ్రతికే ఉన్నాడని అంటుంది అని అడుగుతుంది.

హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళింది నువ్వే కదా అని దీప అంటుంది. నేను తీసుకెళ్లడం ఏంటి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కార్తీక్ బ్రతికే ఉన్నాడని మౌనిత అంటూ సంతోషపడుతుంది. గొప్ప శుభవార్త చెప్పావు, నా కార్తీక్ ఎక్కడ అంటుంది. నీ నాటకాలు చాలు, డాక్టర్ బాబు గురించి అడిగితే భార్య తీసుకెళ్లింది అన్నారు. నువ్వు కాకపోతే, ఇంకెవరు ఉంటారని నీ మీద అనుమానం వచ్చింది. కానీ నిన్ను చూస్తేనే అసహ్యించుకుంటారు. 

నువ్వు ఇక్కడ కనిపించావంటే సందేహమే లేదు, నువ్వే తీసుకొని వెళ్ళావు, ఎక్కడ ఉన్నారో చెప్పమని దీప అంటుంది. నా దగ్గర ఉంటే ఇలా ఫోటో ఎందుకు పట్టుకుని తిరుగుతాను అంటుంది మోనిత. ఏడుస్తూ అందరూ చనిపోయాడు అన్న, నేను మాత్రం యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి ప్రతి వీధిలో కార్తీక్ గురించి వెతుకుతున్నాను అంటుంది. ఇక లేడని అనుకుంటుండగా, నువ్వు కనిపించి నా ఆశలను బ్రతికించావు. ఎవరు కార్తికను తీసుకొని వెళ్లారు అంటున్నావు, ఎవరు అని అంటుంది మోనిత.

నువ్వు తప్ప కార్తీక్ ను ఎవరు తీసుకొని వెళ్ళరు అంటుంది దీప. నా దగ్గర ఉంటే ఇలా ఉంటానా, బాధగా ఉన్నాను అంటుంది మౌనిత ఎవరు తీసుకెళ్లినట్టు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మోనిత.

శౌర్య కోసం ఏడుస్తున్న హిమ: ఇక్కడ హిమా కార్తీక్, దీప ఫోటోను చూస్తూ యాక్సిడెంట్ గురించి గుర్తుకు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. హిమను చూసిన సౌందర్య వాళ్ళు దూరమయ్యారు, సౌర్య వెళ్ళిపోయింది, ఏడుస్తూ ఏమవుతుందో అని మనసులో అనుకొని, దగ్గరకు  వచ్చి ఏడిస్తే  వినిపించి వచ్చేంత దగ్గరలో లేరు వాళ్ళు, తిరిగి రారు అంటుంది.

శౌర్య గురించి కూడా ఆలోచించకుండా ఎలా ఉండాలి నానమ్మ అని హిమా అంటుంది. నేను ఏడిస్తే ఓదార్చడానికి మీరు ఉన్నారు, సౌర్యకు ఎవరు ఉన్నారు, అమ్మ నాన్నలు కోసం ఎంత ఏడుస్తుందో, వాళ్లు చూసుకోమని  చెప్పారు సౌర్య ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది అని అంటుంది. నువ్వు ఆలోచించకుండా ఉండాలి నువ్వు ఎంత ఆలోచిస్తే, మనశ్శాంతి ఎంత దూరమవుతుంది. ఆలోచించడం మానేయమని అంటుంది సౌందర్య.

ఆలోచించడం మానేయమని చెప్పవద్దు అన్న ఆనందరావు: ఆలోచించడం మానేయడం ఆపవద్దని ఆనందరావు అంటాడు. వాళ్ల జ్ఞాపకాలు మనం మోయాలి, సౌర్య దగ్గరికి కచ్చితంగా వెళ్దాం అని అంటాడు ఆనందరావు. మీ అందరి కన్నా సౌర్య గురించి నాకు బాగా తెలుసు, కోపంతో ఉంటే కచ్చితంగా రాదు. కోపం తగ్గాక అదే మన దగ్గరకు వస్తుందని సౌందర్య అంటుంది.

మన కోసం వచ్చి మనం లేమని వెళ్ళిపోయిందేమో అని హిమా అంటుంది. మనం లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ చేస్తుందని అంటుంది సౌందర్య.

ఇంతకు తను నా భార్య నా అని అన్నా కార్తీక్: కార్తీక్ కోపంతో శివ మీద అరుస్తాడు. ఆవిడ నా భార్య కాదు అని అంటాడు. లేకపోతే ఏంటి పెళ్ళాం అంటే ఎలా ఉండాలి అక్కడికి వెళ్ళండి, కూరగాయలు తీసుకుని రండి, అని సతాయించేది భార్య అంటే కానీ మీ మేడం అక్కడికి వెళ్లొద్దు, కూర్చోవద్దు, నిల్చవద్దు, బయటికి వెళ్లొద్దని అంటుంది.

వాకింగ్ కు ఎవరైనా కారు వేసుకొని వస్తారా అంటాడు. ఈ టార్చర్ ఏంటి నాకు అందుకే నా భార్య నేనా అని డౌట్ అంటాడు. శివ మీరంటే మేడంకి ప్రేమ అంటాడు. ఇది ప్రేమ కాదు టార్చర్ టెర్రరిజం నావల్ల కాదు నిజంగా ఏటైననా పారిపోతే బాగుంటుందని అంటాడు. ఇంతలో మేడం ఫోన్ చేసి టెన్షన్ పడవద్దు అని అంటుంది. శివ అలాగే చెప్తాడు మనం వెళ్దాం రండి సార్ అని శివ, కార్తీక్ నుతీసుకొని వెళ్తాడు.

చనిపోయిన తర్వాత కూడా మీకు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నానని బాధపడ్డ సౌందర్య: సౌందర్య దీపా కార్తీక్ ఫోటోను చూసి బాధపడుతూ, శౌర్య అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా శౌర్య నా దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నాను, నీ బిడ్డలను సరిగా చూసుకోలేక పోతున్నాను, మీ ఆత్మలకు కూడా శాంతిని చేకూర్చలేకపోతున్నానని బాధగా ఉంది అని కార్తీక్ ఫోటోతో మాట్లాడుతూ, సౌరకు కోపం ఎక్కువ కోపం తగ్గే వరకు ఉందాం అని అనుకుంటే హిమ ఉండడం లేదు, హిమ ఉంటే సార్య ఇంటికి రాను అంటుంది. అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సౌందర్య ఇది ఈరోజు జరిగిన 1439 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker