Karthika deepam serial today:శివను పట్టుకొని కార్తీక్ గురించి నిజం తెలుసుకోబోతున్న దీప
శివను పట్టుకొని కార్తీక్ గురించి నిజం తెలుసుకోబోతున్న దీప: ఈరోజు జరిగే కార్తీకదీపం సీరియల్ కధ:
సౌందర్య దీప, కార్తీక్ ఫోటోను చూసి బాధపడుతూ, శౌర్య అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా శౌర్య నా దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నాను, నీ బిడ్డలను సరిగా చూసుకోలేక పోతున్నాను, మీ ఆత్మలకు కూడా శాంతిని చేకూర్చలేకపోతున్నానని బాధగా ఉంది అని కార్తీక్ ఫోటోతో మాట్లాడుతూ, సౌరకు కోపం ఎక్కువ కోపం తగ్గే వరకు ఉందాం అని అనుకుంటే హిమ ఉండడం లేదు, హిమ ఉంటే సార్య ఇంటికి రాను అంటుంది. అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సౌందర్య ఇది నిన్న జరిగిన 1439 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.
దీప,కార్తీక్ గురించి ఏ విధంగా తెలుసుకుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం.
మౌనిత ఇంటికి వెళ్లి నిలదీయాలి అని అనుకున్న దీప: మౌనిత కారు వెనకాలే దీప కూడా ఫాలో అవుతుంది. మౌనిత ఏడుస్తూ, కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళుతుంది. ఇది నిజంగా ఏడ్చినట్లు కళ్ళు ఎలా తుడుచుకుంటుందో చూడు ఇది పెద్ద కిలాడి, దీన్ని నమ్మడానికి లేదు, కచ్చితంగా డాక్టర్ బాబు ఇక్కడే ఉంటారు. బయటకు మాత్రం నాటకాలు ఆడుతుంది. అవసరమైతే ఈరోజు దీన్ని చంపి అయినా సరే డాక్టర్ బాబును తీసుకుని వెళతాను. డాక్టర్ బాబు దీన్ని చూస్తేనే చంపేస్తారు, అలాంటిది దీని దగ్గర ఎలా ఉన్నారు? ఏం మాయ చేసిందో, ఏ మందు పెట్టిందో అని మనసులో అనుకొని దీప కూడా ఇంట్లోకి వెళుతుంది. అక్కడ కార్తీక్ ఫోటో ఎదురుగా మోనిత ఏడుస్తూ ఉండడం చూసి షాక్ అవుతుంది దీప.
కార్తీక్ కోసం బాధపడుతున్న మోనిత: కార్తీక్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఒక్కసారి కనిపించు కార్తీక్, దీప కనిపించింది. నువ్వు కనిపించడం లేదు ఏంటి, ఎవరో హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్లారని అంటుంది. ఎవరితో వెళ్లావు, దీప దగ్గర లేవు, నా దగ్గర లేవు, మీ అమ్మ వాళ్లు తీసుకుని వెళ్లారు అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు. కానీ నిన్ను తీసుకెళ్ళింది నీ భార్య అని చెబుతున్నారంట. అయితే నేను కానీ, దీపకాన్ని చెప్పాలి.
ఇంకెవరు నీ భార్య అని చెప్పారు. ఎవరు అని తనతో తనే మాట్లాడుతూ, దీప దగ్గరే ఉంచుకొని నాకు దూరం పెట్టాలని నాటకం ఆడుతుందా, అని అనుకొని ఇంకా ఎన్నాళ్లు నిన్ను నాకు దూరం చేస్తుందా? నా కార్తీక్ అని మౌనిక ఏడుస్తుంది. ఇది ఎన్ని నాటకాలైన ఆడుతుంది. ఏమైనా చేస్తుంది. దీనిని నమ్మడానికి లేదని దీపమనసులో అనుకొని, ఇల్లంతా వెతుకుతుంది. రూమ్ లో నా కార్తీక్ అని రాసిన పదాన్ని చూసి దీప కూడా ఏడుస్తూ, దీన్ని నమ్మాలా, లేదా, నా ముందు నటించింది అనుకుంటే ఏమో అనుకోవచ్చు, దీన్ని నేను ఫాలో అయిన విషయం, నేను ఇక్కడ ఉన్న విషయం దానికి తెలియదు. దీని ఏడుపు నాటకమా కాద తెలియదు. దీని బాధ చూస్తే నిజమని అనిపిస్తుంది. అని మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
శాశ్వతంగా హిమ సౌరలు దూరమవుతారేమో అని అన్న సౌందర్య: ఇక్కడ సౌందర్య, శౌర్య మాటలు గుర్తుకు చేసుకొని ఏడుస్తూ, ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో ఆ దేవుడు అని అనుకుంటుంది. ఇంతలో హిమ వచ్చి సౌర్య కోసం బట్టలు, స్వీట్స్ పిండి వంటలు తెచ్చాను అని చెప్పింది. నువ్వు ఇలా ఉంటే తను రావడం ఇష్టం లేదనుకుంటుంది. నువ్వు నవ్వుతూ ఉండాలి అని సౌందర్యను అంటుంది.
మనం సౌర్య దగ్గరికి వెళ్దాం, వెళ్లి రెడీ అవ్వు అని ఆనందరావు చెబుతాడు. ఎందుకు సౌందర్య అలా ఉన్నావని అడుగుతాడు. వెళ్లిన తర్వాత హిమను చూసి, సౌర్య ఎలా రియాక్ట్ అవుతుందో అనేది నా బాధ. మనకు ఎవరిమీదైనా కోపం వచ్చినప్పుడు వాళ్లకు కనిపించకుండా ఉండటం మంచిది. లేదంటే కోపం దేశంగా మారుతుంది, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం శాశ్వతంగా అవుతుందేమో అన్న భయంతో చెబుతున్నాను.
అందుకే ఇంతలా ఆలోచిస్తున్నానని సౌందర్య అంటుంది. సౌందర్య చెప్పిన మాటలు విన్న హిమ నీ భయం అదేన నానమ్మ, అయితే నేను సార్య దగ్గరికి రాను, మీరే వెళ్లి ఇవ్వండి అని చెప్పి, సౌర్యను చూడకుండా ఉండలేనని ఏడుస్తుంది.
దీపను కలిసి విషయం తెలుసుకుంటానన్న కార్తీక్. ఇక్కడ కార్తీక్ కార్లో వస్తూ దీపను చూసి ఈమెను ఎక్కడో చూశాను అని గుర్తుకొచ్చి ,శివను కార్ ఆపమని చెప్పి, దిగి దీపను శివకు చూపిస్తూ మొన్న నా దగ్గరికి వచ్చి ఏదో అడిగిందని, శివను గుర్తుకు చేసుకోమంటాడు కార్తీక్. శివ సార్ ఆమెను కలిస్తే మేడం నన్ను చంపేస్తుందని మనసులో అనుకొని, ఎప్పుడో కలిసే ఆవిడ మీకు ఇంకా గుర్తుందా అని అంటాడు. నీ పేరు, మీ మేడం పేరు మర్చిపోయానంత మాత్రాన అన్ని మర్చిపోతానా, కొన్ని గుర్తుంటాయని కార్తీక్ సమాధానం ఇస్తాడు.
దీపను చూపిస్తూ ఆవిడ ఏదో అడిగిందని, అదేంటో తెలుసుకుంటాను, అని ఆవిడ నన్ను ఏదో పేరుతో పిలిచింది. ఆ పేరేంటి. తనకి నేను ముందే తెలుసా అన్ని తెలుసుకుంటానని దీప దగ్గరకు కార్తీక్ వెళుతూ ఉంటాడు. ఇంతలో ఆటోలో దీప వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. కలిసినప్పుడు కచ్చితంగా అడుగుతానని అంటాడు కార్తీక్.
మౌనిత గురించి డాక్టర్ తల్లికి చెప్పిన దీప: డాక్టర్ తల్లి రామ్,పండు అని ఇద్దరిని పిలిచి కూరగాయలు తీసుకుని రమ్మని చెప్పి పంపిస్తుంది. ఇంతలో దీప ఇంటికి రాగానే ఎందుకమ్మా అలా ఉన్నావు, నీ భర్త కనిపించలేదా అని అంటుంది. మౌనిత కనిపించిందని దీప సమాధానం ఇస్తుంది.
ఆమె ఎవరని డాక్టర్ తల్లి అడుగుతుంది. నన్ను సాధించడానికి, వేధించడానికి, నా సంతోషాలను దూరం చేయడానికి, భూమి మీదకు వచ్చిన నా శత్రువు అని నా జీవితంలో మౌనిత కథ ఇది అని చెబుతుంది. దానివల్ల ఎన్ని బాధలు పడ్డాను, ఎంత కష్టమో అనుభవించాను, అని అంటుంది. అది ప్రేమ కాదు, పైత్యం ,పర స్త్రీని ,పరపురుషున్ని ఎవరుకోరుకున్న సుఖపడినట్లు చరిత్రలో లేదు. నాశనానికి ఈ బుద్ధులన్నీ అని అంటుంది డాక్టర్ తల్లి.
కానీ నా జీవితాన్ని నాశనం చేసింది కదా, నేను నా భర్త కోసం వెతుకుతుంటే, ఇక్కడ కూడా పోటిగా ఫోటో పట్టుకొని బయలుదేరింది. వెతకని నీ భర్త తనకే కనిపిస్తే ఏం జరుగుతుంది అని అంటుంది డాక్టర్ తల్లి. నాలుగు తల్లి నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని చెప్పి, నా గురించి అడుగుతాడని అంటుంది దీప. దాన్ని ఓవర్ యాక్షన్, ఏడుపు చూస్తే నాకు భయమేస్తుంది, అది అలా చేసిన ప్రతిసారి నాకు నా భర్తని దూరం చేస్తుందని దీప అంటుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 1440 ఎపిసోడ్ కార్తీకదీపం కథ.