Karthika Deepam Serial today: నిరుపమ్ కు షాక్ ఇచ్చిన హిమ

Karthika Deepam Serial today Episode No 1418: ప్రేమ్ తో డాన్స్ చేస్తూ సౌర్యకు, నిరుపమ్ కు షాక్ ఇచ్చిన హిమ: కార్తీకదీపం సీరియల్ లో ఉన్న శౌర్య తలనొప్పిగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే హిమ చూసి తలకు మర్దన చేస్తుంది. కళ్ళు మూసుకొని ఉన్న శౌర్య నానమ్మ నేను నీతో సేవలు చేయించుకోవడానికి వచ్చాను అంటూ వదిలేయమని కళ్ళు తెరుస్తుంది. అక్కడ హిమ ఉండటం చూసి సౌర్యకు కోపం వస్తుంది. నిన్ను ఎవరు రమ్మన్నారని కోపగించుకుంటూ అరుస్తుంది.

హిమ నీకు తలనొప్పిగా ఉందని వచ్చాను అంటూ కూర్చో తల మర్దన చేస్తాను అంటుంది. సౌర్య నేను వద్దంటున్నాను కదా నీవేంటి నాకు సేవ చేసేది నీ సేవలు నాకు వద్దు అని రూమ్ లో నుంచి హిమను బయటకి వెళ్ళమని చెప్తుంది. హిమ నన్ను బయటకి పంపిస్తే నిరూపముని రూమ్ లోకి పంపిస్తాను ,తను వచ్చి నీకు సేవ చేస్తాడు అని బెదిరిస్తుంది. కానీ శౌర్య వినకుండా ఎక్కువగా మాట్లాడవద్దు అని హిమను తన రూమ్ నుంచి బయటకు పంపిస్తుంది. తర్వాత సౌర్య హిమ చెప్పిన పని చేస్తుందా. నిరుపమ్ ను పంపిస్తుందా. ఎప్పుడు ఏడుస్తూ ఉండే హిమ ఈరోజు కొత్తగా కనిపిస్తుంది. మళ్ళీ కొత్త ప్లాన్ ఏమైనా వేస్తుందా అని తనతో తనే మాట్లాడుకుంటుంది.

ఇంతలో సౌర్య వాళ్ళ నాన్నమ్మ సౌందర్యను తన భర్త ఆనందరావు కాఫీ పెడుతున్నావా అంటూ పలకరిస్తూ వస్తాడు. సౌందర్యఅవునండిఅంటూసమాధానంఇస్తుంది. ఇంతలో శౌర్యర కూడా వస్తుంది సౌర్య రాగానే ఆనందరావు గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఏంటి నేను గుడ్ మార్నింగ్ చెప్పడం లేదని నువ్వు నాకు చెప్తున్నావా అంటుంది. అసలు గుడ్ మార్నింగ్ లో గుడ్ ఎక్కడుంటుంది అని ఆనందరావును సౌర్య ప్రశ్నిస్తుంది. ఈ మార్నింగ్ గుడ్ అవ్వాలని కోరుకోవడమే గుడ్ మార్నింగ్ చెప్పుకోవడానికి కారణమని ఆనందరావు చెప్తాడు.

Karthika Deepam Serial today నిరుపముకు షాక్ ఇచ్చిన హిమ
Karthika Deepam Serial today నిరుపముకు షాక్ ఇచ్చిన హిమ

జాయింగ్ కు వెళ్దాం రా అంటూ శౌర్యని జాయింగ్ కి తీసుకొని వెళ్తాడు. ఇంకొకపక్క నిరూపమ్, హిమ కూడా జాయిన్ కు వెళ్లడానికి రెడీ అవుతారు. సౌర్య ఆనందరావు, నిరూపమ్, హిమ జాయినింగ్ కు వెళ్ళిపోతారు. సౌందర్య ఇంటికి తన రెండో మనవడు ప్రేమ్ కూడా వస్తాడు. సౌందర్యను ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. సౌందర్య అందరూ జాయింగ్ కు వెళ్లారు అని చెబుతుంది. తనకు ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరాలని నా బదులుగా నువ్వే దేవుని ప్రార్థించు అని అడుగుతాడు.

జాయింగ్ చేస్తూ సౌర్య అలసిపోయి నిరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ చూస్తూ ఉండగా హిమా, నిరూపంమ్ ఏమైంది అని అనుకుంటూ అక్కడికి వస్తారు. శౌర్యను చూసి ఏమైందని కంగారు పడతారు. హిమావల్ల తాతయ్య ఆనందరావు నీరసంగా ఉందని పడిపోయింది అని చెప్తాడు. హిమ నిరూపముకు ఏదైనా వాహనం తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వెళ్దామని చెప్తుంది.

నిరుపం ఇల్లు ప్రక్కనే కదా దగ్గరగా ఉంది మనమే తీసుకొని వెళ్దాం అంటూ శౌర్యను చేతులతో ఎత్తుకుంటాడు. అందరూ కలిసి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో హిమకు ఒక ఆలోచన వస్తుంది. నిరూపం సౌర్యను ఎత్తుకొని రావడం చూస్తే చాలా బాగుంటుంది అని సౌర్యం పిలుస్తూ లేపుతూ ఉంటుంది. నిరుపం శౌర్యకి పొగరు ఎక్కువనే కాకుండా బాడీ వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సౌరకు మేలుకో వచ్చి ఒకప్పుడు నేను నిన్ను ఇంటి దగ్గర చేర్చాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి మోసుకెళ్తున్నారు అని అంటుంది. అప్పుడు నిరూపం నాకు బరువు అవుతుందని అని అంటాడు. హిమ ఇష్టంగా మోస్తే బరువు కాదు బాధ్యత అవుతుందని సమాధానం ఇస్తుంది.
ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ 1417 కార్తీకదీపం సీరియల్ కథ: ఈరోజు1418 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో సౌర్యకు ఎలా ట్రీట్మెంట్ చేయిస్తారో తెలుసుకుందాం. ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రోజురోజుకు బాగా పాపులర్ సంపాదిస్తున్న సీరియల్ను ముందుగా తెలుసుకోవడానికి అనుకూలమైన పద్ధతి ఇది.

మోసుకొని రావడం పెద్ద గొప్పనా అని ప్రశ్నించిన సౌర్య:
నిరూపం శౌర్యను ఇంటికి ఎత్తుకొని వచ్చి సోఫాలో పడుకోబెడతాడు. అది చూసిన సౌందర్య భయపడుతుంది. శౌర్యకు ఏమైంది కళ్ళు తెరువు అని కంగారు పడుతుంది. అక్కడ ఉన్న ప్రేమ్ కూడా ఏమైందని నిరూపమ్ ను అడుగుతాడు. అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను అని అంటాడు. ఏమీ కాదు అంతా సర్దుకుంటుంది సరిగ్గా తినకపోవడం వల్లే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందని చెప్తాడు. శౌర్య సోఫాలో నుంచి క్రిందకు పడి లేస్తుంది. హిమ వెళ్లి చెయ్యి పట్టుకోగానే నన్ను ముట్టుకోవద్దు అని అరుస్తుంది.

అప్పుడు ప్రేమ్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను నీరూపమ్ ఇంటికి మోసుకొని వచ్చాడు అని అంటాడు. శౌర్య నాకు తెలుసు తిట్టుకుంటూ గోనుక్కుంటూ తీసుకురావడం గొప్పకాదు అని అంటుంది. సౌందర్య నీకు మేలుకో వచ్చిన రానట్టుగా నటించావా అని అడుగుతుంది. శౌర్య నాకు నటించాల్సిన అవసరం లేదు ఎక్కడ నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

ప్రేమ్ తో కలిసి డాన్స్ చేస్తున్న హిమ:హిమ తలస్నానం చేసి చీర కట్టుకొని తలకు దూపం వేసుకుంటూ ఉంటుంది. అది చూసిన ప్రేమ్ హిమ దగ్గరకు వచ్చి తనను ముట్టుకొని చూస్తూ డాన్స్ చేస్తూ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. హిమ క్రిందికి దిగి ప్రేమ్ ను చూస్తూ సిగ్గుపడి అక్కడ నుంచి పరుగు తీస్తుంది. ఇంతలో డాక్టర్ ఫిలమెంట్ వచ్చి ప్రేమను పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్ ఇదంతా కల నేను బ్రమపడ్డానా అంటూ నవ్వుకుంటూ ఉంటాడు.
సౌర్య (జ్వాలా)కు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం:
ప్రేమ్ ఫిలమెంటును నువ్వు ఎవరు అని అడగగా ఫిలమెంట్ నేను ఎవరో నీకు తెలియదా అని అరుస్తూ నా పేరు రెండు రాష్ట్రాలలో మారుమొగుతుంది డాక్టర్ ఫిలమెంట్ నేను అని అంటాడు. ప్రేమ్ ఇక్కడ డాక్టర్లు చాలామంది ఉన్నారు అని ఇంతకీ పేషెంట్ ఎవరని అడుగుతాడు. ఫిలమెంట్ శౌర్య గది ఎక్కడ అని అడుగుతాడు. పదండి నేను చూపిస్తాను అని అంటూ ప్రేమ్ లోపలికి తీసుకు వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు అందరూ మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతారు.

అప్పుడు ఫిలమెంట్ నేను ఎవరు పిలిచినా రాను కానీ ఒక్కరు పిలిస్తే మాత్రం వస్తాను అని చెప్తూ ఐ వాంట్ ఫైర్ ఫైర్ ఫైర్ ఫైర్ అంటాడు. సౌందర్య ప్రేమ్ నీకేమైనా అర్థమైందా అని అడగగా సగం అర్థమయింది జ్వాల కోసం వచ్చాడు అని ప్రేమ్ చెబుతాడు. జ్వాలా రూమ్ కి వెళ్లి పరీక్షిస్తూ ట్రీట్మెంట్ ఇస్తుండగా శౌర్య ఏంటి సంగతులు అని అడుగుతుంది. వెబ్ సిరీస్ లో నన్ను హీరోగా అడిగారు కానీ చేయలేదు ఎందుకంటే నా భార్యను హీరోయిన్గా ఉంచుకుంటేనే నేను హీరోగా చేయాలని కండిషన్ పెట్టింది. సౌర్య ఇంకా నీకు నటించే పిచ్చి పోలేదా అని అంటూ నాకు తగ్గిపోయిందా అని అడుగుతుంది.

ఫిలమెంట్ ఒక ఇంజక్షన్ వేసి నీకు తగ్గిపోయింది అని అంటాడు. అప్పుడుహిమ ఇది వైరల్ ఫీవర్ వారం రోజులు ఉంటుంది అని అంటుంది. డాక్టర్ నువ్వా నేనా నాకు తెలిసినంత నీకు తెలుసా అంటూ ఫిలమెంట్ అరుస్తాడు .ఈ ఫిలమెంట్ భయపడేది ముగ్గురికే ఒకటి దేవునికి రెండు నా భార్యకు మూడు జ్వాలకి అని చెప్పి ట్రీట్మెంట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

డాక్టర్ ని అయినా తోడ పుట్టిన శౌర్యకు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నా అని బాధపడ్డ హిమ:
హేమ ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉంటే సౌందర్య అక్కడికి వస్తుంది. తనను పలకరిస్తుంది. హిమ ,శౌర్యను, నిరుపంమ్ ను కలపాలని ఆలోచిస్తూ ఉంటే తను అర్థం చేసుకోవడం లేదు అని అంటూ బాధపడుతుంది. నేను ఎంతోమందికి ట్రీట్మెంట్ చేశాను తన తోడ పుట్టిన శౌర్యకు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నా అంటూ బాధపడుతూ ఏడుస్తుంది. సౌందర్య ఏమీ కాదులే కొన్ని రోజులకు అంతా సర్దుకుంటుంది అని హిమను ఓదారుస్తుంది.
నిరుపమ్ ను దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్న శోభ:
ఒకపక్క శోభ నిరుపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నిరూపంమ్ తల్లి కాఫీ తెస్తుంది. మీరు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి ఆంటీ అని నవ్వుతూ మాట్లాడుతుంది. నువ్వు నాకు కాఫీ తెచ్చే రోజులు చాలా ఉన్నాయని చెబుతూ నిరూపమ్ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను మీకు ఖచ్చితంగా కోడలు అవుతాను అని అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఫ్యామిలీ మొత్తం నన్ను కొట్టడానికి ఉన్నట్టున్నారు వాళ్లు నన్ను చెంప మీద కొడితే నేను వారి జీవితం మీద కొడతాను అని మాట్లాడుకుంటూ ఎలాగైనా నిరూపముని ఇంటికి తీసుకొని వస్తే కానీ తనని పెళ్లి చేసుకోవడానికి కుదరదని ప్లాన్ చేస్తూ ఉంటుంది.

హిమా,నిరూపములను చూసి తట్టుకోలేక పోయిన శౌర్య:
శౌర్య గదిలో ఎందుకు నిరూపంమ్ ఎక్కువగా గుర్తుకు వస్తున్నాడు. ఇలా ఉంటే నిరుపమును మర్చిపోవడం చాలా కష్టం. అసలు నిరుపంమ్ ఇంటికి రావడం వల్లే ఇదంతా జరుగుతుంది. నిరూపమని ఇంటి నుండి వెళ్లిపొమ్మని చెప్పాలని నిర్ణయించుకొని రూమ్ నుండి బయటకు వస్తుంది. అక్కడ నీరూపంమ్, హిమ కూర్చుని ఉంటారు. నిరుపంమ్, హిమను కాఫీ త్రాగమని భుజం మీద చెయ్యి వేసిఅడుగుతూ ఉంటాడు.

అది చూసిన శౌర్య తట్టుకోలేక పోతుంది. నిరుపమును ఎందుకు బయటకు పంపించాలి. నేనే వెళ్ళిపోతాను అనుకోని బయటికి వెళుతుంది. అది చూసిన సౌందర్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ఇక్కడ నా కళ్ళు ఏమి చూస్తున్నాయో, నా చెవులు ఏమీవింటున్నాయో తెలియడం లేదు అందుకే వెళ్తున్న అంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది.
ఇదే ఈరోజు 1418 ఎపిసోడ్ లో జరిగిన కార్తీకదీపం కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker