Karthika deepam serial today:నిరుపమ్, శౌర్యల మధ్య చిగురుస్తున్న ప్రేమ
నిరుపమ్, శౌర్యల మధ్య చిగురుస్తున్నప్రేమ:ప్రేమ్ అబద్ధం ఎందుకు చెప్పాడు తెలుసుకుందాం: తాళం వేసింది తీయలేకపోతున్నాం అని అబద్ధం చెబితే వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుందని ఇద్దరూ మాట్లాడుకుని తాళం పగిలినట్లుగా నటిస్తూ ఉంటారు హిమా, ఫ్రేమ్. చీకటి పడటంతో సౌందర్య ,ఆనందరావు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో హిమ ఫోన్ చేసి శౌర్య కనిపించింది అని చెబుతుంది. సౌర్య బాగానే ఉంది మీరేమీ కంగారు పడొద్దు ఇంటికి రావడానికి కష్టంగా ఉంది తర్వాత వస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రేమ్. తాళం చాలా గట్టిగా ఉంది తీయడానికి అసాధ్యం అందుకని ఈరోజు ఇక్కడే ఉండి ఉదయాన్నే ఏదో ఒకటి చేసే తాళం ఓపెన్ చేద్దాం అని ప్రేమ్ అంటాడు.
కిడ్నాప్ చేసిన వారి గురించి సౌర్య చెప్పటం: నిరూపమ్ వాళ్లు ఎవరు ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారని సౌర్యను అడుగుతాడు. వాళ్లు దొంగతనం చేసి నా ఆటో ఎక్కి పారిపోతుంటే పోలీసులకు పట్టించాను అందుకే నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారని సౌర్య చెబుతుంది. అంత సాహసం చేసినందుకు తనకు అవార్డు కూడా ఇచ్చారు కదా అని హిమ గుర్తుకు చేస్తుంది. ప్రేమ్ శౌర్యని అభినందించి తాళం పగలగొట్టడానికి ఏదైనా ఆలోచిద్దాం అని అక్కడినుండి పక్కకు వెళ్ళిపోతారు.
సౌర్యని కాపాడినందుకు నిరూపమ్ నీ కోప్పడ్డ శోభ: సౌర్యను అంత ప్లాన్ గా కిడ్నాప్ చేస్తే నిరూపమ్ ఎందుకు అక్కడికి వెళ్లి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. అని కోప్పడుతూనేను ఏం చేయాలి. నిరూపమ్ ను ఎలాగైనా తన వైపు తిప్పుకొని తనని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది.
జీవిత సత్యం గురించి చెప్పిన సౌర్య: ఉదయం నుండి ఏమీ తిననందువల్ల బాగా ఆకలిగా ఉందని సౌర్య మనసులో అనుకుంటుంది .ఇంతలో హిమా ఫ్రేములు వచ్చి ఆకలిగా ఉందా ఏమైనా తీసుకొని రమ్మంటారా అని అడగగా సరే ఏదైనా తీసుకుని రండి ఆకలిగా ఉంది అని చెప్తారు సౌర్య, నిరూపమ్. మేము వెళ్లి తీసుకొని వస్తాము మీరు గొడవ పడకుండా ఫ్రెండ్స్ లా ఉండండి అని చెప్పి ప్రేమ్ హిమలు వెళ్లిపోతారు. ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి అవి కుడితే జ్వరం వస్తుందని నిరూపమ్ శౌర్యతో అంటాడు.
దోమలు అన్నాక కుడతాయి కదా అయినా జ్వరం దోమలకు వస్తుందా మనసులకు వస్తుందా అని జోక్ వేసి నవ్వుతూ ఉంటుంది శౌర్య. జీవితమనే నాటకంలో పాత్రలు స్వభావాలు మారిపోతూ ఉంటాయి అన్నిటికీ సిద్ధంగా ఉండాలని అంటుంది. దోమలు కుట్టినందుకు ఇంత ఉపన్యాసమా అని చేతులు ఎత్తి మొక్కుతాడు నిరూపమ్. అయినా దోమలు కుడితేనే ఇంత బాధపడుతున్నారు నన్ను మనిషే కుట్టి బాధ పెట్టింది అని అంటుంది శౌర్య. నువ్వు కూడా బాగానే మాట్లాడుతావు అంటాడు నీరూపమ్. ఇది మాటలు కాదు మనసుకైనా గాయాలు అని సౌర్య చెబుతుంది.
సౌర్య నిరుపం భోజనాన్ని పంచుకొని తినటం: భోజనం తీసుకొని హిమా ఫ్రేమ్ అక్కడికి వస్తారు. లోపల సౌర్య మాట్లాడుకోకుండా ఉండడం చూసి వీళ్ళు ఏమీ మాట్లాడుకోవడం లేదు ఏంటని హిమను అడగగా నువ్వు వేసిన ప్లాన్ బాగానే ఉంది అని అంటుంది హిమ. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యేలా ప్లాన్ చేసి ఇద్దరికీ ఒకే భోజనం ఇద్దాం అంటాడు ప్రేమ్. సౌర్యను పిలిచి పార్సిల్ ఇవ్వగా నిరూపం నాకేది అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ సారీ రెండే దొరికాయి ఒకటి మీకు ఒకటి మాకు అని అంటాడు. సారీ నేను ఎవరితోనూ పంచుకోను నేనే తింటాను అని అంటుంది శౌర్య. సరే మేము కూడా వెళ్లి తింటాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు హిమా, ప్రేమ్.
ఇది ఈరోజు జరిగిన 1420 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.