Karthika deepam today: శోభ పెళ్లి నిరుపంతో జరుగుతుందా.

శోభ పెళ్లి నిరూపంతో జరుగుతుందా?

సౌర్యను చూసి షాక్ అయినా హిమ: సౌర్య ఆనందం కోసం ఈ పెళ్లి చేయాలని అంటుంది హిమ. మాట్లాడవద్దు అని గట్టిగా అరుస్తుంది సౌందర్య. ఇప్పటివరకు జరిగినవన్నీ విడిచిపెట్టు. ఇప్పటినుంచి నేను చెప్పింది వినాలి. నేను చెప్పినట్టుగానే నిరుపమ్ ను పెళ్లి చేసుకోవాలి అని సౌందర్య హిమతో ఉంటుంది.

ఇది నిన్న జరిగిన1422 ఎపిసోడ్ కార్తీకదీపం కథ.

ఇంతలో ఈవెంట్ మేనేజర్లు వస్తారు. పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉండాలో పార్కింగ్ నుంచి పెళ్లి పందిరి దాకా చెప్పాను. ఇంటిని, కళ్యాణ మండపాన్ని బాగా రెడీ చేయాలి. ఆ బాధ్యత కూడా మీదే అంటుంది. చాలా కాలం తర్వాత ఇంట్లో జరుగుతున్న పెళ్లి ఇది. ఎటువంటి లోటు జరగకూడదు. నా మనవరాలు మనవడి పెళ్లి అంతా నా ఇష్టం ప్రకారం జరగాలి.నా 

చేతుల మీద జరగాలి అంటుంది సౌందర్య. సౌందర్య చెప్పిన మాటలు సౌర్య వింటుంది. సౌందర్య చెప్పిన మాటలు విన్న శౌర్యను చూసి హిమా షాక్ అవుతుంది.

పెళ్లి పనులు ఏర్పాటు చేశారని చెప్పిన శోభ: నా కుటుంబాన్ని, నా పిల్లలని నాకు కాకుండా చేస్తుందని స్వప్న అనుకుంటూ ఉండగా శోభ అక్కడికి వస్తుంది. ఆంటీ వాళ్లు పెళ్లి పనులు మొదలుపెట్టారు అని అంటుంది. మొదలుపెట్టినంత మాత్రాన పెళ్లి జరుగుతుందా. ఈ విషయంలో అసలు తగ్గను.

అని మాట్లాడుకుంటుండగానే అక్కడికి నిరూపం తండ్రి సత్యం ప్రేమ్ వస్తారు. అది చూసిన శోభా మీరు ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఎలా చెప్పండి అంటూ నటన చేస్తుంది. ఎందుకని వారు అడుగుతారు. నిరూపమును పెళ్లి చేసుకుంటున్నాడు అన్న బాధతో ఏమీ తినడం లేదని మనం నిరుపమును మార్చాలి అని అంటుంది. శోభ నువ్వు తిననంత మాత్రాన పెళ్లి ఆగిపోదు కదా మనమే నిరుపమనే మార్చుకుందాం అని చెప్తాడు ప్రేమ్.

ఇంటికి రానని తేల్చి చెప్పిన నిరుపమ్: సత్యం సౌందర్య ఇంటికి వచ్చి నిరుపమ్ ను పిలవగానే కూర్చో భోజనం చేద్దాం అని అంటాడు ఆనందరావు. క్షమించండి నేను తినడానికి రాలేదు స్వప్న నిరుపమ్ మీద బెంగపెట్టుకొని తినడం, త్రాగడం ఏమీ చేయటం లేదు. నిరుపమ్ ఇంటికి వెళ్దాం రా అంటాడు. మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చాను. అమ్మ అలిగిందని, భోజనం మానేసిందని, నన్ను పిలవడం మంచిది కాదు. అమ్మ మనసులో ఏముందో నీకు తెలుసు. నువ్వు దాని గురించి పట్టించుకోవు.

నువ్వు పట్టించుకున్న అమ్మ వినదన్న విషయం నీకు తెలుసు. అమ్మ నాకు మంచి  చేసింది. ఎవరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుందో నీకు తెలుసు. అమ్మ కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందని నిరుపమంటాడు నువ్వు డాక్టర్ వి. చిన్న పిల్లవాడివి కాదు. తను తినడం మానేసింది .నేను ఎందుకు అబద్దం చెప్తాను అంటూ, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు. నిజమో, అబద్దమో వస్తే తెలుస్తుంది.

నిజమైతే తల్లిని కష్టపెట్టడం తప్పు అంటాడు సత్యం. నాకు ప్రేమ ఉంది. శోభతో పెళ్లి చేయాలని చూస్తుంది.శోభ ఇంటికి వచ్చింది. ఏదో ఒక సమయంలో శోభను పెళ్లి చేసుకుంటావా లేదా నేను చనిపోవాలా అని బెదిరిస్తుంది. అన్న భయంతో ఇక్కడికి వచ్చాను అంటాడు నిరుపమ్. మీరు ఏం చెప్పినా నేను రాను అని నిరుమ్ అనగానే నా మనవడు ఇక్కడే ఉంటాడు. నా మనవడి, పెళ్లి నా మనవరాలు తోనే జరుగుతుంది. సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా మాట్లాడావు. ఇదే మాట మీద ఉండు. మిగిలినది నేను చూసుకుంటాను అని నిరుపమ్ ను సౌందర్య మెచ్చుకుంటుంది.

శోభతోనే నిరుపం పెళ్లి చేస్తానన్న స్వప్న: సత్యం ఇంటికి వచ్చి శోభను స్వప్న ఏమైన తిన్నదా అని అడగగా నేను చెప్పాను, తినటం లేదు, వినడం లేదు అంటుంది. మనిషి మీద కోపం వస్తే అన్నం మీద చూపించకు. పిల్లలు మన మాట వింటారు, వినరు చెప్తుండగానే ముందు నిరుపమ్ ఏమన్నాడో చెప్పమని కోప్పడుతుంది స్వప్న. మన మాట వినడు. పూర్తిగా అటువైపే ఉన్నాడు అని అంటాడు. శోభ నాకు తెలిసి మీ పెళ్లి జరగదు. మీ ఆంటీ  నీకు సంబంధం చూసి పెళ్లి చేస్తుందంటాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు కూడా వాళ్లతో కలిసి పోయారు. ఎవరు అడ్డు వచ్చినా, ఎవరు ఏం చేసినా, ఎవరు వచ్చినా, రాకపోయినా శోభ పెళ్లి నా కొడుకుతో చేస్తానని అంటుందిస్వప్న. వీళ్ళ పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు అంటుంది.

శౌర్య ను పెళ్లి చేసుకోమని నిరూపమును ఒప్పిస్తున్న హిమ: ఇక్కడ నిరుపం తన తండ్రి చెప్పిన మాటలను గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. హిమ వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అంటుంది.నాకు మాత్రం శౌర్య గురించి తప్ప నాకు ఏ ఆలోచన లేవు. సౌర్య నాలాగా పెరగలేదు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగానే పెరిగింది. ఇంటికి వచ్చిన కొన్ని రోజులలోనే ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఎప్పుడు కష్టాలతోనే జీవితం సాగుతుంది. తన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే సౌర్యకు నువ్వు జీవితం ఇవ్వాలి. నాకు తెలిసి జీవితంలో సౌర కోరుకున్నది నేనొక్కడినే. తను బాగుండాలని చెబుతున్నాను అన్నది హిమ.

సౌర్య మనసులో ఒకప్పుడు ఉన్నాను. నేను ఇప్పుడు లేను. కిడ్నాప్ ముందు ప్రేమ ఉంది. తర్వాత లేదు. నేను తనను ప్రేమించడం లేదని ఆశ్రమంలో చెప్పినప్పుడే సగం. కిడ్నాప్ చేసినప్పుడు  తనతో కలిసి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను. అందువల్ల తనకు నా మీద ప్రేమ లేదు అని అంటాడు. నాకు ఉన్నది ఒకటే జీవితం. నేను కోరుకున్న జీవితం నాకు కావాలి. అది నీతోనే పంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు నిరుపమ్.

సౌందర్య ఇంట్లో డెకరేషన్స్ పనులు మొదలుపెట్టారు. నిరుపమ్ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని అంటాడు. నువ్వు అక్కడికి వెళితే పెద్ద గోరం జరుగుతుందని, అత్తా బెదిరించి శోభ మెడలో తాళి కట్టిస్తుందని అంటుంది.   వీడియో కాల్ చేసి మాట్లాడు, కన్విన్స్ చేయని ఆనందరావు అంటాడు. ఇప్పుడు వెళ్లడం మంచిది కాదు. శోభ సంగతి నాకు వదిలి. స్వప్నతో భోజనం చేయించే పని నాది అని సౌందర్యం అంటుంది. హిమ పెళ్లి కోసం అందరూ ఎంత ఆరాటపడుతున్నారు. అందరూ ఒకేలా ఉన్నారు. అందరు సంతోషంగా ఉన్నారు .ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం అవసరమా అని ఆలోచిస్తుంది శౌర్య. ఇది ఈరోజు 1423 ఎపిసోడ్ లో జరిగిన కార్తీకదీపం కథ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker