Keerthy suresh:నటనకు గుడ్ బై చెప్పి పెళ్లికి సిద్ధమైన కీర్తి సురేష్.
Keerthy suresh: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఉదాహరణకు స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ మధ్య ప్రేమ గురించి, వారి డేటింగ్ గురించి, ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో వారు ఆ వార్తలు కొట్టి పడేశారు.
కొన్నాళ్ల తర్వాత ఈ జంట తమ ప్రేమ బంధాన్ని, వివాహ బంధంగా మార్చుకున్నారు. ఇలా హీరో, హీరోయిన్లు మొదట వారిపై వచ్చిన వార్తలు పట్టించుకోకపోయినా, ఆ తర్వాత అది నిజమే అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు.
తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ల పెళ్లిళ్ల విషయంలో ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అదేమిటంటే వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, అని పుకార్లు సృష్టిస్తున్నారు. ఇలాంటి వార్తలు వచ్చిన హీరోయిన్లు చాలానే ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, త్వరలో వివాహం చేసుకుంటుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ హంగామా చేసింది. అయితే దీనిపై తమన్న ఘాటుగా సమాధానం ఇచ్చింది. అదేమిటంటే ఎఫ్3 సినిమాల్లో తను బాయ్ క్యారెక్టర్ లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే! ఆ క్యారెక్టర్ లో దిగిన ఫోటోలు షేర్ చేసి, ఇతనే నా భర్త అని సమాధానం ఇచ్చింది.
అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం రాజశేఖర్ కుమార్తె శివాని కూడా రాజ్ తరుణ్ తో ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని, వారి పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందించిన శివాని, రాజ్ తరుణ్ మంచి నటుడు, ఫ్రెండ్ మాత్రమే, తనను పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని సమాధానం ఇచ్చింది. ఇలా నిత్యం ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం మహానటి కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు వినిపించాయి. అయితే ఆ పెళ్లి తనకి ఇష్టం లేదని కీర్తి సురేష్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ మరొకసారి తను పెళ్లి ప్రస్తావన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈసారి కూడా తమ తల్లిదండ్రులు మహానటి కి పెళ్ళికొడుకుని చూశారని, మహానటికి కూడా ఈ పెళ్లి అంటే ఇష్టం అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనివలన కీర్తి సురేష్ సినిమా రంగానికి గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. వివాహం తర్వాత చిత్ర నిర్మాతగా తన సినీ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదంతా సోషల్ మీడియాలో వినిపిస్తూన్న న్యూస్ మాత్రమే. దీనిపై కీర్తి సురేష్ కానీ, తమ కుటుంబం కాని స్పందించలేదు.
గతంలో ఇలాగే సౌత్ ఇండియన్ రాక్ స్టార్ అనిరుద్ తో ప్రేమాయణం చేస్తుంది, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు, అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై తన తల్లిదండ్రులు స్పందించి, అది నిజం కాదని తీసిపారేశారు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న వార్త నిజమో? కాదో? తెలియాలంటే! వీరు స్పందించేదాకా వేచి చూడక తప్పదు.