Krithi Shetty:సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న కృతి శెట్టి.

Krithi Shetty:ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ, స్టార్ హీరోయిన్స్ స్థాయిని దక్కించు కున్న వారు కొందరైతే, ఆ రేంజ్ ని తెచ్చుకో లేకపోయినా వారు చాలా ఉన్నారు. స్టార్ హోదా దక్కక కెరీర్ను మధ్యలో ఆపివేసి నటనకు దూరమైన హీరోయిన్లు చాలానే ఉన్నారు.

అలాంటి కెరీర్ను మధ్యలో వదిలి వెళ్ళిన వారు టాలీవుడ్ ఫిలింమ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో అంతా పోటీ వాతావరణం ఉంటుంది. కనుక ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లడం కష్టం. అందులోనూ ఒక్క సినిమా ద్వారానే తమ క్రేజ్ ను సంపాదించుకోవడం, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది.

అలాంటి సక్సెస్ రావాలంటే చాలా టాలెంట్ ఉండాలి. దానితో పాటు అదృష్టం ఉండాలి. టాలెంట్ ఉండి అదృష్టం ఉన్న అది కూడా అందరికీ దక్కదు. చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే, ఈ విధంగా ఒక్క సినిమా ద్వారానే స్టార్ రేంజ్ ను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు.

కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఒక సినిమా ద్వారానే తన నటనతో, అందంతో అభిమానులను కట్టిపడేసింది. యువకుల మనసును ఇట్టే దోచి వేసింది. ఉప్పెన సినిమా ద్వారా స్టార్ స్టేటస్ ని ఇట్టే దక్కించుకొని, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది.

అయితే ఈమె కెరియర్ ఇండస్ట్రీలో కొంచెం ఇబ్బందుల్లో పడింది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్డ్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ మూడు సినిమాలలో నటించింది.

అయితే ఈ సినిమాలు పెద్దగా రాణించలేదు. దీంతో తన కెరీర్ కు కొంత బ్రేక్ పడినట్లు అయింది. దాంతో కుర్ర హీరోలు తప్ప, స్టార్ హీరోలు తనను సినిమాలలో తీసుకోవడం లేదు. అంతేకాక ఎందుకు రెండు కారణాలు కూడా ఉన్నాయి.

Krithi Shetty
Krithi Shetty:

ఒకటి మొదటిగా ఆమె చేసిన సినిమాలలో కేవలం మూడు మాత్రమే హిట్ అయ్యి, మిగతావన్నీ ప్లాప్ కావడం వల్ల, ఫ్లాప్ హీరోయిన్ ముద్రను వేసుకుంది. ఇంకొకటి స్టార్ హీరోలు అందరు వయసు 40 ఉంటుంది. అయితే కృతి వయసు కేవలం 19 సంవత్సరాలు.

ఈమె అందంగా ఉందని, స్టార్ హీరోలు తనకు అవకాశం ఇచ్చిన, వారి ప్రక్కన చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. అయితే హీరోయిన్ కెరీర్ బాగుండాలి అంటే, ఆమె స్టార్ హీరోల సరసన నటించాల్సిందే! అప్పుడే తన కెరీర్ బాగుంటుంది. అందువల్లనే కృతి కొంతకాలం తన సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

అయితే తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి, ఆ తర్వాత ఇండస్ట్రీకి బాయ్ చెబుతానని అంటుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. తనకు సరిపోయే విధంగా, మంచి కథ వచ్చేదాకా వెయిట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ కథ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను అనీ చెప్పుకొచ్చింది కృతి.

ప్రస్తుతం ఈమె నాగచైతన్య, వెంకట ప్రభు కలిసి తీయబోతున్న సినిమాలో నటిస్తుంది. అంతేకాక తమిళంలో సూర్యతో నటిస్తూ, మలయాళం లో తునివోథామస్ తో ఒక సినిమాలో నటించబోతుంది. ఇక స్టార్ రేంజ్ కు ఎదగడానికి ఈమె ఇండస్ట్రీ నుంచి దూరం కానుంది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ కు వస్తుందో? లేదో? ఇక చూడాలి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker