Meena: భర్త చనిపోయిన బాధ నుంచి తీరుకొని మళ్లీ సినిమాల్లో చేయనున్న మీనా
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల లో నటి మీనా కూడా ఒకరు. అనేక మంచి మంచి సినిమాలు, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల లో నటించింది. రోజా, మీనా, రాసి ఈ హీరోయిన్స్ తో పాటు చేస్తున్న టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మీనా. హీరోయిన్గా చేసే టైంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో మీనా కూడా ఒకరు.
స్టార్ హీరోలతో ఎన్నో మూవీస్ చేసింది. తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. తన నటనతో, అందంతోఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది మీనా. తాజాగా దృశ్యం 1, దృశ్యం 2 మూవీస్ లో నటించింది. బాలనాటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
ఈ విషయం అందరికీ తెలుసు. నటిగా బాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే ఒక కూతురు ఉంది. అకస్మాత్తుగా ఇటీవల కాలంలోనే 2022 లోనే కరోనా సెకండ్ వేవ్ టైం లో విద్యాసాగర్ కరోనా బారిన పడి మరణించారు.
మీనా జీవితంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. మీనా ఈ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే తీసుకుంది. కుష్బూ, సంఘవి, రంభ హీరోయిన్స్ మీనా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. తన భర్త చనిపోయిన బాధ నుంచి, మనోవేదన నుంచి బయటపడడానికి ఇటీవలనే మీనా విదేశీ పర్యటన చేశారు.
దీంతో కాస్త చేరుకున్న ఆమె మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో ఆ మెసేజ్ చేసిన మూవీస్ ని మళ్లీ చేయడానికి రెడీ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒక్కో భాషలో ఒక్కొక్క మూవీ చేయాల్సి ఉండగా అలాగే ఈ మూవీస్ తో పాటు మలయాళంలో మోహన్‌లాల్ పక్కన దృశ్యం 3 మూవీలో నటించాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీనా ఒక ప్రచార మూవీలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు. ఎలాగైతేనేమి మీనా ఆ బాధలో నుంచి పోలుకొని మళ్లీ సినిమాలు చేయడం ఆమె అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.