Naga Shourya: హాస్పిటల్ లో జాయిన్ అయిన హీరో నాగ శౌర్య, ఇంతకీ ఆయనకు ఏమైందంటే?

Naga Shourya: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యంగ్ హీరో అయినా నాగశౌర్య సోమవారం సినిమా షూటింగ్లో పాల్గొంటూ అస్వస్థతకు గురయ్యారు. తనదైన నటనతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అనేక సినిమాలు చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కూడా రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నట్లు, వాటికి సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నప్పుడు అస్వస్థతకు గురయ్యాడు.

షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు .వెంటనే చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ఆపేసి నాగ సౌర్యాని గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగశౌర్య గత రెండు రోజులుగా షూటింగ్ చేస్తూ ఉన్నాడు, ఈ క్రమంలోనే సోమవారం కూడా షూటింగ్ కి వెళ్ళాడు.

సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒకసారి గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎక్కువ స్ట్రెస్ కు గురై కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది.వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం నాగశౌర్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

హాస్పిటల్లో జాయిన్ అయినా హీరో నాగ శౌర్య, ఇంతకీ ఆయనకు ఏమైందంటే?
హాస్పిటల్లో జాయిన్ అయినా హీరో నాగ శౌర్య, ఇంతకీ ఆయనకు ఏమైందంటే?

ఇటీవలే నాగశౌర్య వివాహానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగశౌర్య త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు అన్న న్యూస్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి నీ వివాహం చేసుకోబోతున్నాడు. కొద్దికాలంగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి ప్రస్తుతం పెళ్లి వరకు దారి తీసింది.

ఈ పెళ్లికి ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఈనెల 20వ తారీఖున బెంగళూరులోని ఒక హోటల్లో వీరి వివాహం చాలా ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. పత్రికలు కూడా పంచడం మొదలుపెట్టారు. కొన్ని సూపర్ హిట్ మూవీస్ లో నటించాడు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ ఎంతోమంది అభిమానులను సత్యం చేసుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, చలో వంటివి సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం ఫలానా అబ్బాయి–ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి మూవీస్ తో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్స్ కి వెళ్తూ ఉండగానే రెండు రోజులుగా వరుసగా షూటింగ్ చేస్తూ ఉండటం వల్ల షూటింగ్ చేస్తూ ఉండగానే మధ్యలోనే అస్వస్థతకు గురై ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే సినీ యూనిట్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ కి చేర్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం తెలియాల్సి ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker