Nayanthara: ఈ కారణాల వల్లే సినిమా ఈవెంట్స్ కి రావడం మానేశాను అన్న నయనతార
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుని, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరైన హీరోయిన్ నయనతార. తనదైన అందంతో, తనదైన శైలిలో నటిస్తూ, మూవీస్ చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ప్రెసెంట్ గా విగ్నేష్ శివన్ నీ వివాహం చేసుకుంది. రీసెంట్గా నయనతార ఇద్దరు కవల పిల్లలకి తల్లి అయింది. సరోగసి ద్వారా ఈ పిల్లల్ని కనింది. దీనికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి.
రీసెంట్ గా నయనతార యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దీంట్లో ఆమె తాజాగా కొన్ని విషయాలు చెప్పారు. తాను ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం నచ్చదని, యాంకర్ సుమతోనే ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాను అని సుమాతో చెప్పడం జరిగింది.
సుమ కనకాల ఈ ఇంటర్వ్యూలో నయనతారాన్ని ఎందుకు మీరు ఆడియో ఫంక్షన్ కి, సినిమా హీరోయిన్స్ కి ఎందుకు రారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ హీరోలకున్న ప్రాధాన్యత హీరోయిన్స్ కి ఇవ్వరు అంటూ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ ఆడియో ఫంక్షన్ కి గాని, సినిమా ఈవెంట్స్ కి గాని వెళ్ళినప్పుడు హీరోయిన్స్ ని ఏ మూలనో నిలబెడతారు అంటూ చెప్పారు.
ఈ విషయం నాకు నచ్చక ఈవెంట్స్ కి అసలు వెళ్లడం లేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఉండే అసమానతల గురించి తన అభిప్రాయం చెప్పిన నయనతార. హీరోయిన్స్ కి, హీరోలకి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటూ అందుకే నేను ఈ సినీమా ఈవెంట్స్ కి గాని, ఆడియో ఫంక్షన్స్ కి గాని వెళ్లడం మానేసాను అంటూ ఒక ఇంటర్వ్యూలో సుమతో చెప్పారు.
హీరోయిన్ గా రెండు దశాబ్దాలు లోకి అడుగు పెట్టింది. తనకంటూ కొన్ని కలలు ఉండేవి అంటూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో చేయాలి అని కోరిక ఉండేదని చెప్పింది. ఈ ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. హీరోయిన్లకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని చెప్పింది.
హీరోయిన్స్ ఏదైనా ఆడియో ఫంక్షన్ కి, సినిమా ఈవెంట్స్ కి వెళితే ఏదో ఒక మూలన నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిస్థితులు, కారణాల వల్లనే నేను మా ఈవెంట్స్ కి వెళ్లడమే మానేశాను అంటూ చెప్పింది నయనతార. లీడ్ రోల్ లో నటించిన నయనతార తాజా మూవీ ఏంటి అంటే” కనెక్ట్”.
అశ్విన్ శరవనణ్ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతుంది. హర్రర్ థ్రిల్లర్స్ జోనర్లో ఈ మూవీ తెరగెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొని విజయవంతంగా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది .