NTR:గ్యాప్ ఎక్కువ అవడంతో ఇక స్పీడ్ పెంచాలి అనుకుంటున్నా ఎన్టీఆర్
‘తోక్కుకుంటూ పోవాలే’అంటూ RRR లో తన చెప్పిన డైలాగును నిజం చేరనున్నారు తారక్. వీటివలే ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్ ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే కానీ అది ఇంకా షూటింగ్ మొదలు పెట్టడం జరగలేదు.
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే రెండు మూడు ఏళ్ళు కేటాయించాల్సి వస్తుంది.అంతేకాకుండా కరోనా రావడంతో ఈ సినిమా మరింత ఆలస్యంగా వచ్చింది. దాంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రం విడుదల కావడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది.
ఆ విధంగా ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. ఆ నిరాశ కు తగిన విధంగా ఫలితాన్ని ఇచ్చారు రాజమౌళి. అర్ అర్ అర్ సినిమాలో ఎన్టీఆర్ ని కొమరం భీం గా చూపించి ఫ్యాన్స్ మనసులను ఆకట్టుకునే విధంగా చేశారు. అయితే ఈసారి అంత గ్యాప్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా వస్తున్నా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నరు. ఇటీవలే కొరటాల శివ,మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి సినిమా తో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు కొరటాల శివ. అలాగే ఉప్పన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది.
ఉప్పన సినిమాతో మంచి హిట్ అందుకున్న బుచ్చిబాబు మరో ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకులనీ మెప్పించడానికి సిద్ధమవుతున్నానని బుచ్చిబాబు తెలపడం జరిగింది. ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలకు షూటింగ్ ఒకేసారి పూర్తి చేయాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఏ మాత్రం గ్యాప్ రాకుండా ఈ రెండు సినిమాల షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని,అభిమానులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.