2023 లో మన టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు

2022 ఇయర్ చివరకు వచ్చేసింది. నెక్స్ట్ వీక్ అవతార్ 2.. నెల చివరన క్రిస్ మస్ కానుకగా ధమాకా 18 పేజెస్ చిత్రం లు వస్తున్నాయి. ఈ మూవీస్ సందడి ఎలా ఉండబోతుందో అని ఆడియన్స్ అంతా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే 2023 లో భారతీయ చిత్రం మీద తెలుగు పరిశ్రమ సత్తా చాటాలని పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి.

2023 లో మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా చిత్రాల రేసులో ఉన్నారు.వారిలో మొదటిగా ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ వస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం రామాయణ కథతో వస్తుంది. సినిమాను 2023 సమ్మర్ విడుదల ఫిక్స్ చేశారు. బాహుబలి తర్వాత సాహో రాధే శ్యాం అంచనాలను మిస్ అవడంతో ఆదిపురుష్ మీద ప్రభాస్ అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

2023 లో మన టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు
2023 లో మన టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు

పవర్ స్టార్ కూడా ఈ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా కూడా నేషనల్ వైడ్ గా విడుదల కాబోతుంది. పవన్ తన జీవితంలో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు.అలా కూడా పవర్ స్టార్ అభిమానులకి ఈ సినిమా చాలా స్పెషల్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా విడుదల సినిమాల్లో చరణ్ 15వ సినిమా కూడా ఉంది.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మరోసారి శంకర్ తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు.ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబో సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవడం డౌటే అని చెప్పొచ్చు.

ఇక మరోపక్క అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా మరోసారి ఇండియా లెవల్లో సందడి చేయనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 అంతకుమించి అనిపించేలా ఉంటుందని అంటున్నారు.

ఇవే కాకుండా నేచురల్ స్టార్ నాని దసరా సినిమా.. అఖిల్ ఏజెంట్.. తేజా సజ్జా హనుమాన్ కూడా పాన్ ఇండియా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో ఏది తెలుగు మూవీ స్థాయిని పెంచుతుందో.. ఏది టాలీవుడ్ స్టామినాని ప్రూవ్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker