Pavithra Lokesh: చిన్న వయసులోనే తనను పడేసిన స్టార్ హీరో
Pavithra Lokesh: చిన్న వయసులోనే తనను పడేసిన స్టార్ హీరో గురించి చెప్పిన పవిత్ర లోకేష్..
పవిత్ర లోకేష్ పేరు అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే సినిమాలలో స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తూ వచ్చిన ఇమేజ్ కంటే, టాలీవుడ్ స్టార్ హీరో కృష్ణ, విజయనిర్మల పెద్ద కుమారుడు నరేష్ తో నడిపిన వ్యవహారం వల్లే ఎక్కువ పాపులారిటీ పొందింది.
నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్న పవిత్ర లోకేష్ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తారు. ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం జరిగిన నరేష్,పవిత్ర లోకేష్ వ్యవహారం ఇప్పటికీ జనాలు మరిచిపోలేదు.
నరేష్ ఈమెని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు చాలానే వినబడ్డాయి. ఇద్దరు కలిసి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన ఫోటోల ద్వారా వీరిద్దరి వివాహం చేసుకున్నారు అనే వార్తలు గట్టిగా వినబడ్డాయి. అయితే ఈ వార్తలను నరేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా పవిత్ర, నేను కలిసి ఉంటున్నాము, కానీ పెళ్లి చేసుకోలేదు. అందరికీ ఒక తోడు కావాలి. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు, పెళ్లి చేసుకున్న చాలామంది విడిపోతున్నారు, కాబట్టి ప్రస్తుతానికి పెళ్లి మీద ఎటువంటి ఆలోచన లేదు, రాబోయే కాలంలో చేసుకోవచ్చు చెప్పలేం అని అన్నారు.
అయితే వీరి రిలేషన్ షిప్ ను నరేష్ మూడో భార్య అయినా, రమ్య రఘుపతి ఒప్పుకోలేదు .నాకు విడాకులు ఇవ్వకుండా, మీరు ఇంకొకరితో ఎలా కలిసి ఉంటారు అని వాదించింది. మైసూర్ హోటల్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వారిపై దాడికి దాడి చేయడానికి వెళ్ళింది. అప్పుడు పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియాలో వీరుపై చాలా పుకార్లు వినబడ్డాయి. వాటన్నిటిని కొట్టిపడేసి, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై స్పందించిన పవిత్ర భర్త సుచంద్రా ప్రసాద్, ఆమెపై అనేక ఆరోపణలు చేశాడు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా వచ్చిన వార్త ప్రకారం పవిత్రను, నరేష్ విడిచిపెట్టాడనే వార్త వచ్చింది. అదేవిధంగా పవిత్ర నరేష్ రిలేషన్షిప్ లో ఒక ఒప్పందం ఉందని, ఆయన ఆమెను విడిచి పెడితే కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని ఒప్పందంలో ఉంది. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు ఇవ్వమని కోరినట్లు, ఆయన మాత్రం 50 లక్షలు ఇస్తానంటే దానికి అంగీకరించకుండా, నరేష్ గురించి మొత్తం ప్రెస్ మీట్ లో, సోషల్ మీడియాలో బయట పెడతానని బెదిరించింది. అన్న వార్త వైరల్ అయింది.
ఈ గొడవల వల్లే ఈమె తన మనసులో ఉన్న మాటలను బయటికి చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అదేంటి అంటే ఆమెకు హీరో నాగార్జున అంటే ఎంతో ఇష్టం అని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని పవిత్ర ఒక ఇంటర్వ్యూ ద్వారా అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరో తరగతి చదువుతున్న టైం లో గీతాంజలి సినిమా వచ్చిందట, ఆ సినిమా చూసిన తర్వాత ఆమెకు నాగార్జున అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది, నేను ఇష్టపడ్డ హీరో నాగార్జున గారిని రెండుసార్లు మాత్రమే కలిశానని, అదేవిధంగా ప్రకాష్ రాజ్, మరియు రజనీకాంత్ అంటే కూడా ఇష్టం అన్నట్లుగా, రజనీకాంత్ ను ఒక్కసారి కలిశానని, తనతో దిగిన ఫోటో ఇప్పటికి భద్రంగా దాచుకున్నాను అని అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు.
అయితే రీసెంట్ గా నరేష్, పవిత్ర విడిపోయారు అన్న వార్త అబద్దమని తేలింది. ఎలా అంటే “అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి” అనే సినిమాను ఓటీడీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కమెడియన్ స్టార్ ఆలీ, సీనియర్ నటుడునరేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపించడం తో,ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ, నరేష్, పవిత్ర కలిసి థాంక్స్ వీడియోను చేసి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ పంపించారు.
ఇప్పుడు ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు వీళ్లిద్దరూ కలిసి ఉన్న తీరును చూసి, వీరిద్దరి మధ్య గొడవ జరిగింది అని వచ్చిన వార్త అబద్దమని తేలిపోయింది. దీంతో వీరీ పై సోషల్ మీడియాలో అభిమానులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తుంది.