Pavitra Lokesh:సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్ర లోకేష్.
Pavitra Lokesh: పవిత్ర లోకేష్, ప్రతిసారి నటుడు నరేష్ తో కలిసి, ప్రతిరోజు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ప్రతిసారి పవిత్ర తనపై ఏదో ఒక ట్రోలింగ్తోనే వార్తల్లో కనిపించేది. ఈసారి దీనికి విరుద్ధంగా వార్తల్లో నిలిచారు. అదేమిటంటే తమపై ట్రోలింగ్ చేస్తూ, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను, మరికొన్ని వెబ్సైట్స్ పై కేసు పెట్టారు. దీంతో వీరి విషయం మరొకసారి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
పవిత్ర లోకేష్, నరేష్ కలిసి సహజీవనం చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే! వాళ్ళు కృష్ణ గారు చనిపోయేటప్పుడు కూడా ఇద్దరూ కలిసి తిరగడం చూసిన జనాలు, వారు వ్యవహరించిన తీరును చూసి, వారిపై చాలామంది కోప్పడ్డారు.అనేకమంది ఎన్నో కామెంట్స్ చేశారు. కృష్ణగారు చనిపోయినప్పటికీ నుండి ఇప్పటివరకు వీరుపై వస్తున్న ట్రోలింగ్స్ ఆగడం లేదు.
దీంతో విసిగిఎత్తిన పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పవిత్ర లోకేష్ పై అలాగే సీనియర్ నటుడు నరేష్ పై కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిద్దరిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా వీరుపై అనేక రకాలుగా వార్తలు వినిపించాయి. దాంతో సోషల్ మీడియా అంతా పవిత్ర లోకేష్, నరేష్ చుట్టూనే తిరుగుతుంది.
అంతకుముందు ఎన్నో రకాలుగా వార్తల్లో కనిపించిన అంత ఎక్కువగా కామెంట్స్ చేసేవారు కాదు. అయితే ఇది కృష్ణ గారు మరణం తర్వాత మరింత ఎక్కువయింది. ఎందుకంటే? కృష్ణగారి ఆరోగ్యం బాగా లేనప్పుడు హాస్పిటల్కు ఇద్దరు కలిసి రావడం, ఆ తర్వాత ఆయన భౌతిక కాయం దగ్గర ఆమెను ఉంచడం, ఆయన అంతిమయాత్ర సమయంలో పవిత్ర లోకేష్ ను జాగ్రత్తగా తీసుకొని రావటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
కృష్ణ గారు చనిపోయినప్పుడు పవిత్రను అక్కడ తీసుకొని రావడం ఏంటి? అక్కడ ఇద్దరు కలిసి జంటగా తిరగడం అవసరమా? పవిత్ర గారి వల్ల నరేష్ కృష్ణ గారి కుటుంబాన్ని గౌరవించడం లేదంటూ,, నేటిజెన్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కృష్ణగారి చిన్న కర్మ రోజు ఇద్దరూ కలిసి ఆయనకు నమస్కారం చేయడం బాగాలేదని, పవిత్ర కృష్ణ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాతనే ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతున్నారని, తనపై తీవ్రంగా మండిపడ్డారు నేటిజన్లు.
ఇక ఎన్ని రోజులైనా తనపై వస్తున్న ట్రోలింగ్స్ ఆగడం లేదని, ఈ కామెంట్స్ తో విసిగిపోయిన పవిత్ర, తన పై, నరేష్ పై వచ్చే వార్తలకు చెక్ పెట్టడానికి, వారిని ఈ విధంగా ట్రోల్స్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ను, వెబ్సైట్లను అదుపులోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈ కేసు పై విచారణ చేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా పవిత్ర లోకేష్ ఇచ్చిన కంప్లైంట్ విషయమై హార్ట్ టాపిక్ గా మారింది.