Renu Desai: భరణం పై స్పందించిన పవన్ భార్య
మనకు సినిమా వాళ్లు అంటే ఎంతో మంది పరిచయం. వారితో మాట్లాడకపోయినా, సినిమాలు చూస్తూ ఉంటాం. కాబట్టి వారి గురించి ముఖ పరిచయం ఉంటుంది. అలాగే సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లు, కమెడియన్సైనా ఎలాంటివారికైనా చాలామంది అభిమానులు ఉంటారు. కొందరికి వారంటే ఎంతో ఇష్టం.
వారిపై ఎంతో అభిమానంతో ఉంటారు. కొందరైతే వాళ్ల కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు. మీకు గుర్తుందా తాజాగా జరిగిన ఒక సంఘటన. ఒక అమ్మాయి క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడటానికి టికెట్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ప్రాణానికి ప్రమాదంగా మారింది. అయితే తనకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని, తనని లైవ్లో చూడటానికి మ్యాచ్ కు వెళ్లాలని నిర్ణయించుకుందని తన తల్లి ఎంతో ఆవేదనతో చెప్పింది.
ఇలా చాలా రకాల మనుషులు ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలలో నటించే వారికి ఎక్కువ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతారు. అలా పరిచయమైన వారిలో రేణు దేశాయ్ ఒకరు. ఈమె ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య, అంతేకాక సినిమా హీరోయిన్ కూడా. ఆయనతో కొన్ని సినిమాలలో కూడా నటించింది. అప్పట్లో ఈమెకు ఉండే క్రేజ్ అంతా, ఇంతా కాదు. కుర్ర కారు సైతం ఆమె కోసం పడి చచ్చిపోయేవారు. అంత క్రేజ్ ను పెంచుకుంది.
పవన్ కళ్యాణ్ గారికి భార్య అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ ఏమైందో ఏమో, సడన్ గా ఆయనతో విడాకులు తీసుకుని ఒంటరిగా బతుకుతున్నారు. వీరికి పిల్లలు కూడా పుట్టారు. సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూ ఉంటారు. రేణు దేశాయ్ అయితే గతంలో టీవీ షోలలో కూడా కనిపించారు. కొన్ని షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఈ విధంగా ఇంకా కొంత పరిచయాన్ని పెంచుకున్నారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పవచ్చు. ఈమె గురించి ఈ విషయాలన్నీ పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఈమెతో విడిపోయినప్పుడు తనకు భరణంగా ఎటువంటి డబ్బు, ఆస్తి ఇవ్వలేదని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం తాజాగా తెగ వైరల్ అవుతున్నాయి. జరిగిన అసలు విషయం ఏమయి ఉంటుందని అనుకుంటే, కళ్యాణ్ గారు రాజకీయాలలో చాలా బిజీగా ఉంటూ, అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే!
అయితే కొందరు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి, ఆయన జీవితంలోని నిలకడగా లేరు, ఇంతటితో ఆగుతారో లేదో తెలియదు, వారి అభిప్రాయం ఒకసారి ఒక్కోలాగా ఉంటుంది, అలాంటిది ఈయన రాజకీయాలలో ఎలా నిలకడగా ఉంటాడు, ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ఇలా చాలా విమర్శలు వచ్చాయి. తనపై వచ్చిన ఎలాంటి వార్తలకు స్పందించని పవన్ కళ్యాణ్ గారు అయితే తనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి, అన్న వార్తలపై చాలా స్పందించాడు.
వైసిపి వాళ్ళు నాకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని మీకెందుకు బాధ. కావాలంటే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి. అంటూ మాట్లాడారు. అలాగే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. మొదటి భార్య అయిన నందినితో విడిపోయినప్పుడు, ఆమెకు ఐదు కోట్ల డబ్బు భరణంగా ఇచ్చాను. అంతే కాకుండ నా రెండవ భార్య అయిన రేణు దేశాయ్ తో విడిపోయినప్పుడు ఆమెకు నా ఆస్తిలో కొంత భరణంగా ఇచ్చాను. అని స్పందించాడు.
దీంతో గతంలో రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కువగా మారుమ్రోగుతున్నాయి. ఆమె చాలా రకాల ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ, ఆయన నాకు ఎటువంటి ఆస్తి, కానీ డబ్బు కానీ భరణంగా ఇవ్వలేదని చెప్పింది. దాంతో పవన్ కళ్యాణ్ అన్న మాటలకు, ఈమె చెప్పిన విషయాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
ఈ విషయంలో ఎవరు నిజం చెప్పారు? ఎవరు అబద్ధం చెబుతున్నారో? అర్థం కావడం లేదు. కానీ ఈ విషయం పై మాత్రం సోషల్ మీడియా అంతా ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. ఎవరు నిజం చెప్పారు? అన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే!
భరణంగా ఇచ్చిన విషయం గురించి ఎవరు ఎలా స్పందిస్తారో? అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకు, రేణు దేశాయ్ ఏ విధంగా స్పందిస్తుందో? తెలుసుకోవడానికి మనం కచ్చితంగా వెయిట్ చేయక తప్పదు. ఏదేమైనా వైసీపీ నేతలు పెట్టిన చిచ్చు బాగానే రగులుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి.