ప్రభాస్ ఎటువంటి ఆర్భాటం లేకుండా కొన్ని రోజుల క్రితం నూతన సినిమాకి పూజ చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మారుతి కావున పీపుల్స్ మీడియా వాళ్ళు నిర్మాతగా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టినా కూడా పూజ మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా చేసి మా ఈ కొత్త సినిమా ప్రభాస్ తో చేస్తున్నామని చెప్పినట్లు ఇది చేశారు.
అయినా సరే ఈ కొత్త సినిమాకు నిర్మాతలు ప్రభాస్ కి చాలా భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం.అడ్వాన్స్ ఎంత ఇచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రభాస్ కి కేవలం అడ్వాన్స్ రూ. 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. అవును 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ 50 కోట్లే కాకుండా రెమ్యూనరేషన్ గా ఇంకా ఇస్తామని అందుకనే ప్రభాస్ చేసుకోండి అని ఈ సినిమా నిర్మాతలకు చెప్పాడని చిత్రపరిశ్రమలో అందరూ అనుకుంటున్నారు.
ఈ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ప్రభాస్ కే తెలియాలి. ఎందుకనగా ప్రభాస్ ముందుగా తీసుకున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందుగా తీసుకున్న సినిమాలన్నీ పూర్తి కావాలి, అవి పూర్తి అయిన తర్వాత అప్పుడు మారుతి సినిమా చేయడానికి సిద్ధంగా ప్రభాస్ ఉంటాడు. ఈలోపల మారుతి ప్రభాస్ తో తీయాలనుకున్న సినిమా కథను పూర్తి చేయాలి కదా.. అని అంటున్నారు. ముందుగా ఒక చిన్న లైన్ అన్నా చెప్పమని అంటున్నారు కానీ హీరో ప్రభాస్ మొత్తం స్క్రిప్ట్ కావాలన్నట్టుగా బయట టాక్.
కావున ఇదంతా పూర్తయ్యేసరికి కనీసం రెండు,మూడు సంవత్సరాలు పట్టవచ్చు. ఈ సమయంలో చాలా లెక్కలు మారిపోతాయి. ఈ మధ్యలో హీరో ప్రభాస్ ఇంకా ఒక సినిమా ఒప్పుకోవచ్చని అదే కాకుండా ఇప్పుడు చేస్తున్న సినిమాలు మంచి హిట్ కావాలని, లేకపోతే ప్రభాస్ తీయాలనుకున్న కొత్త సినిమాపై ఈ ప్రభావం పడుతుంది. అందుకోసం నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చిన సరే ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూడాల్సిందే తప్ప ఏమీ చేయలేరు. ఇలా వుంది ఈ ప్రాజెక్టు పరిస్థితి.