బ్లాక్ డ్రెస్ తో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్!
రకుల్ ప్రీతిసింగ్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్ ఫంక్షన్ లో బ్లాక్ డ్రెస్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అవార్డు ఫంక్షన్లో రకుల్ ప్రీతిసింగ్ STYLE GAME CHANGER అవార్డుకు ఎంపికైంది.బ్లాక్ డ్రెస్ తో దిగిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఇమేజ్ లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ ప్రముఖ సినీనటి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో చాలా సినిమాలలో నటించింది. అక్టోబర్ 10 -1990 న న్యూఢిల్లీలో జన్మించింది.
పెద్ద నటి కావాలనేది నా కోరిక అని సోషల్ మీడియాలో వెల్లడించింది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడు నుంచే మోడలింగ్ చేయడం ప్రారంభించింది. 2009లో సెల్వా రాఘవన్ చేసిన సెవెన్ జి రెయిన్బో కాలనీ రీమిక్ అయిన కన్నడ చిత్రం గిల్లి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తాను నటి కాకముందు జాతీయ క్రీడాకారిణి అని చెప్పింది.ఎక్కువ డబ్బు సంపాదించడం కోసమే సినిమాలలో నటన చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు. డిగ్రీ పూర్తి చేసి సెమినా మిస్ ఇండియా పోటీలలో పోటీ చేయకముందే పలు రకాల ప్రశంసలు అందుకుంది.
- సెమినా మిస్ ప్రెష్ స్పేస్,
- మిస్ టాలెంటెడ్,
- మిస్ బ్యూటిఫుల్ స్మైల్,
- బ్యూటిఫుల్ ఐస్
వంటిది అని ప్రేక్షకులు ఎంతగానో పొగిడారు. 2013 వ సంవత్సరంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తెలుగులో మొదటి సినిమా ఇదే. రవితేజ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగచైతన్య వంటి తెలుగు అగ్ర హీరోలతో నటించింది. వీరే కాక తెలుగు చాలా ఫేమస్ హీరోలతో కూడా నటించింది.2016 సంవత్సరంలో F45 పేరుతో ఒక వ్యాయామ సెంటర్ ను గచ్చిబౌలిలో ప్రారంభించారు. ప్రస్తుతం భారతీయుడు 2, మసూద్ రానా-పహార్, వైద్యుడు జి, అయలన్, మిషన్ సిండ్రిల్లా, దేవునికి ధన్యవాదాలు వంటి సినిమాలలో నటించబోతుంది.