Rashmika mandanna: విజయ్ దేవరకొండ తో డేటింగ్ పై క్లారిటీ

Rashmika mandanna: మందన ఏప్రిల్ 5- 1996లో కర్ణాటకలోని విరాజ్ పేటలో జన్మించింది. తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మందన. బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో టెక్నాలజీ జర్నలిజం, అలాగే ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ ని పొందింది.

2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా నటనను ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్లో చలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2018లో విజయ్ దేవరకొండ తో కలిసి గీతాగోవిందం సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా హిట్ సినిమాలలో నటించింది. 2021లో పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయింది. పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.

రష్మికకు 2017లో నిశ్చితార్థం అయ్యింది. అతను ఎవరో కాదు కిరిక్ పార్టీలో తనతో పాటు నటించిన రక్షిత్ శెట్టితో జరిగింది ము వీరు ఈ సినిమాలో నటించిన తర్వాత డేటింగ్ లో ఉండి, ఆ తర్వాత జులై 3 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే 2018లో కొన్ని సమస్యల కారణంగా తమ నిశ్చితార్ధాన్ని విరమించుకున్నారు.

Rashmika mandhana
Rashmika mandhana

తాజాగా రష్మిక తనపై వస్తున్న ట్రోల్లింగ్ పై స్పందించింది. ఈ వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రష్మిక తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చెక్ పెట్టడానికి మొదటిసారిగా స్పందించింది.

చాలా రోజులుగా తనపై వార్తలు వినిపిస్తున్న సైలెంట్ గా ఉన్నాను, ఇక వీటన్నిటికీ పెట్టక తప్పదు అంటూ తన బాధను ఇంస్టాగ్రామ్ నోటు ద్వారా వెల్లడించింది. అందులో ఏమని పోస్ట్ చేసింది అంటే

తనపై వస్తున్న వార్తలు తనని చాలా ఇబ్బంది పెడుతున్నాయని, వాటికి చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, నా విషయం గురించే చెబుతున్నాను. నేను ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాల్సింది. కొంత ఆలస్యం అయ్యింది అంటూ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. చాలా ట్రోల్స్ నన్ను బాధ పెడుతున్నాయి. వాటి వల్ల తనకు ప్రశాంతంగా లేదని, సినీ ఇండస్ట్రీలో నటించిన వారికి ఇవన్నీ సహజం. అందరికీ అన్ని నచ్చవు. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే నచ్చనంత మాత్రాన ఎంతగా టోన్స్ చేయడం మంచిది కాదని అన్నారు.

ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్న పర్వాలేదు. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం నాకు ముఖ్యం. నా నటన ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తాను. వారికి సంతోషం కలిగేలా చేస్తానని, అందుకోసమే కష్టపడతానని అన్నారు. ఇలా ట్రోల్స్ చేయడం ద్వారా తనకు అడ్డకట్ట వేసినట్లుగా ఉంటుందని, తనను అడుగడుగునా ఇలా మాట్లాడడం ద్వారా తన మనసుకు బాధగా అనిపిస్తుంది.

దీనివల్ల నేను ఎలా ముందుకు వెళ్లగలను, నేను వాటిని పక్కన పెట్టాలని ఎంత ప్రయత్నించినా అవి నన్ను ఎక్కువగా వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను నిరుస్తాహ పరుస్తున్నాయి అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు కూడా తనకు వ్యతిరేకంగా మారుతున్నా యని, వాటన్నిటినీ తన గుర్తించినట్లుగా చెప్పుకొచ్చింది.

తనకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు అదును చేసుకొని, బయట ఉన్న స్నేహం పరంగా తప్పుడు సమాచారం సృష్టిస్తున్నారు, అవి నిజమైనవి అయితే నేను కూడా వాటికి సమ్మతించే దానిని, కానీ అవి తప్పుడు కథనాలు అని చెప్పారు. నిజాలను వదిలేసి అబద్దాలను ఎందుకు సృష్టిస్తున్నారు.

నాపై ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ, సోషల్ మీడియాను ప్రశ్నించింది. ఈ న్యూస్ చూసిన అందరూ ఈ మాటలు తనకు, విజయ్ దేవరకొండకు సంబంధించినవి అని, వారి డేటింగ్ లో ఉన్నారు అన్న విషయం గురించి చెప్పినట్లుగా ఉందని, వారిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదని చెప్పినట్లుగా అర్థమవుతుందని అభిమానులు మెసేజ్ పెడుతున్నారు.

Rashmika mandhana
Rashmika mandhana

తనపై ఎందుకు ఇంత కోపం. చాలాకాలం నుంచి చూస్తున్నాను ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఊరికే ఉంటే కచ్చితంగా ఇంతకంటే ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తారని, అందుకే ఇప్పుడు స్పందించాను అంటుంది. తనని ఇండస్ట్రీలో చాలామంది గౌరవిస్తారు అని, ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా, నేను వెనక్కి తగ్గను అని, తన అభిమానులే తనకు ముఖ్యమని.

ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా ,తన అభిమానులు తనని ఆదరిస్తారని తనని ముందుకు నడిపిస్తారని, వారి కోసం తను ఇంకా కష్టపడి పనిచేసి వారిని సంతోషంగా ఉండేలా చూస్తానని, తన పనిని గుర్తించిన వారి కోసం నే తను ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేస్తుందని చెప్పారు.తనని ఇష్టపడిన వారికి ఆనందాన్ని ఇవ్వడమే తనకు నిజమైన ఆనందమని రాశారు.

ఈ మాటలని విజయ్ రష్మిక డేటింగ్ గురించి అనే ట్రోల్స్ ఎక్కువయ్యాయి. వీటి ద్వారా ఈ విషయం ఇండస్ట్రీలోమొత్తం హార్ట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ కోసం ఎదురుచూస్తోంది.

\అలాగే హిందీలో కొన్ని సినిమాలు చేయబోతుంది. అయితే కొన్ని రోజుల క్రితం వచ్చిన విజయ్ దేవరకొండ తో కలిసి నటించడానికి ఒప్పుకుంది అన్న వార్తపై స్పందించలేదు. దాంతో అభిమానులు సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చిన విజయ్ తో నటిస్తుంది అని అర్థమవుతుంది అన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Rowdy Vijay & Rashmika: మళ్లీ కలవబోతున్న విజయ్, రష్మిక.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker