Raviteja: బోర్ కొట్టడం అనే మాట తన డిక్షనరీలోనే లేదన్న రవితేజ

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్ గా పేరు పొందిన స్టార్ హీరో రవితేజ. రవితేజ చాలా సినిమాలు చేశారు. ఇప్పటివరకు కూడా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎంతోమంది ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. డ్యూయల్ రోల్ లో కూడా చాలా బాగా నటించగలడు. సినీ ఇండస్ట్రీకి వచ్చే కొత్త తరాల వారిని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.మరో కోత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ధమాకా అనే మూవీ ద్వారా మరోసారి అభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడని సమాచారం.ఈ మూవీ శుక్రవారం డిసెంబర్ 23 నా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా రవితేజ హైదరాబాదులో గురువారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేశాడు.

ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించిన వేడుకల్లో ఎందుకు ఎక్కువగా మాట్లాడరు? అని విలేకర్ అడగగా నాకంటే కూడా నా సినిమాలే ఎక్కువ మాట్లాడడం నాకు చాలా ఇష్టం. నా పని మాట్లాడాలి. నేను కాదు ఉంటే సమాధానం చెప్పాడు. శుక్రవారం విడుదలయ్యే మూవీ ద్వారా నా సినిమా మాట్లాడబోతుంది అంటూ చెప్పాడు.

బోర్ కొట్టడం అనే మాట తన డిక్షనరీలోనే లేదన్న రవితేజ
బోర్ కొట్టడం అనే మాట తన డిక్షనరీలోనే లేదన్న రవితేజ

ధమాకా మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీ ఎలా ఉంటుంది అంటూ విలేకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఈ మూవీ మంచి వినోదాత్మక చిత్రం. రాజా ది గ్రేట్ అనే మూవీ తర్వాత అంతస్థాయిలో ఈ మూవీ చేశాను. మూవీ నీ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

ఈ మూవీలో లాజిక్ తో పాటు మ్యాజిక్ కూడా ఉంటుంది. త్రినాధ రావు నక్కిన బాగా ఉత్సాహంగా పనిచేసే వ్యక్తి. ఈ మూవీ చేసిన నిర్మాతలు చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు. ఇలాంటి వాళ్లకే విజయం వరించాలి దానివల్ల చాలామందికి మరల ఉపాధి దక్కుతుంది అంటూ చెప్పుకొచ్చారు.మరీఈ మూవీ లొ ద్విపాత్రాభినయం చేశారు అని విలేకర్ అడిగగ అదేపనిగా అలాంటి సినిమా చేయాలంటూ అనుకోను, కథ వస్తే మాత్రం చేస్తా అంటూ చెప్పాడు.

కొత్తతనాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు ఎందుకని అంటూ విలేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొత్తగా వచ్చే వారితో పని చేయడం నాకు చాలా ఇష్టం వారిలో కష్టపడాలి అని కాసి ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. నేను కూడా ఒక్కడినే వచ్చి ఇంత సక్సెస్ అయ్యాను. అందుకే కొత్తదరాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాను అంటూ చెప్పాడు.

కొత్తతరం రచయితలు, దర్శకులు వస్తూ ఉంటారు, వాళ్లను కలిసినప్పుడు వాళ్ళ ఆలోచనలు విన్నప్పుడు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అవి నాకు చాలా బాగా నచ్చుతాయి. హీరోయిన్ శ్రీ లీల అందం, ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయి. అందుకే కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సినిమా కథలు ఎంపిక చేసుకోవడంలో మీరు ఎలా ఆలోచిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఫలితం మన చేతిలో ఉండదు.

కథ ఎంపిక అనేది మన చేతిలోనే ఉంటుంది. కచ్చితంగా కథ నాకు నచ్చితేనే ఓకే చేస్తాను.ఎవరో పరిచయమయ్యారు వాళ్లతో బాగా రాపో కుదిరింది కాబట్టి నేను కదా ఓకే చేస్తాను అన్నది తప్పు నేను అలా చేయను నాకు కథ నచ్చితేనే ఓకే చేస్తాను అంటూ చెప్పారు. వరుస సినిమాలు చేస్తూ ఉంటారు కదా ఏమైనా బోర్ కొడుతుందా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా బోర్ అన్నమాట నా నిజం లోనే లేదు అంటూ చెప్పాడు రవి తేజ.

నేను ఉన్నదాంట్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సినిమా షూటింగ్లో ప్రతి నిమిషానికి కూడా నేను ఆస్వాదిస్తూ ఉంటాను అని చెప్పాడు. నా జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చాడు.చిరంజీవి గారితో చేసిన వాల్తేరు వీరయ్య అనే మూవీలో ఈ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ విలేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ శక్తివంతమైన పాత్ర చేస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి గారు అంటే తనకు వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం ఉండేది చెప్పాడు.పాన్ ఇండియా సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్నకు ప్రతిదీ పాన్ ఇండియా మూవీ అయిపోలేదు కథనే పాన్ ఇండియా మూవీ అవ్వడానికి మెయిన్ కారణం. అంటూ కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు రవితేజ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker