RC15 మూవీ విడుదల కాస్త లేట్, భారీ అంచనాలతో షూటింగ్

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తర్వాత ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక యాక్షన్ మూవీ ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వాయిదా వేసి, ప్రస్తుతం షూటింగ్ వేగంగా చేస్తున్నారు. అయినా కూడా ఈ సినిమా విడుదల లేట్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాత. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన సాంగ్ ని న్యూజిలాండ్ లో షూట్ చేస్తున్నారు ఈ టీం. ఈనెల 20వ తారీకు నుంచి పాటలకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు ఇందుకోసం రామ్ చరణ్, కియారా అద్వానీ 20 రోజులు అక్కడే ఉంటున్నారని తెలిసింది.

సినిమా విడుదల-
ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఉగాదికి రిలీజ్ చేయబోతున్నారని మరో వార్త వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో షూట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అందుకోసం ఇంకా మూడు నెలల సమయం ఎక్కువ అవసరం అవుతుందని, ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసుకున్నాక వచ్చే సంవత్సరం జూలై లేదా ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ సినిమా విడుదల డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

RC15 మూవీ విడుదల కాస్త లేట్, భారీ అంచనాలతో షూటింగ్ కి సిద్ధమవుతుంది.
RC15 మూవీ విడుదల కాస్త లేట్, భారీ అంచనాలతో షూటింగ్ కి సిద్ధమవుతుంది.

సుకుమార్ తో మరో మూవీ-
డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం మూవీ చేసిన తర్వాత మరో మూవీ చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ మూవీ కి సంబంధించి హీరో ఎంట్రీ కి సంబంధించి పది నిమిషాల హీరో ఎంట్రీ సీను కూడా షూటింగ్ పూర్తి చేశాడు.

RC15 లో ఒక కీలకమైన పాత్ర-
ఈ సినిమాకు సంబంధించి సెకండ్ హాఫ్ లో ఒక కీలకమైన పాత్ర ఉందని, ఈ సినిమా మొత్తంలోనే ఈ పాత్ర చాలా కీలకమని ఈ పాత్ర కోసం నటి కుష్బూ గారిని సెలెక్ట్ చేశాడు శంకర్.

RC15 లో రామ్ చరణ్ పాత్ర-
మరి హీరో రామ్ చరణ్ విషయానికి వస్తే ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు.

రామ్ చరణ్ సృష్టించిన మరో అరుదైన రికార్డ్-
RC15 మూవీకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ విషయం పక్కన పెడితే రామ్ చరణ్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఒక రికార్డు సృష్టించాడు. మిగతా సెలబ్రిటీస్ తో పోలిస్తే కాస్త లేటుగా సోషల్ మీడియాలలో కి ఎంట్రీ ఇచ్చిన కూడా అతి తక్కువ టైంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు.

RC15 మూవీలోని పాటలు-
ఈ మూవీలో ఒక అదిరిపోయే పాట ఉందని, ఈ పాటకు మ్యూజిక్ తమన్ చాలా బాగా చేశాడని, ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ ఫాన్స్ విషయానికి వస్తే ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు.

కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ లీక్ అవుతున్నాయి అని ఎంత హెచ్చరించినా ఇలాగే చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కి భార్యగా నడుస్తుందని తెలిసింది. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం 45 కోట్లకు పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి నాన్ థియే ట్రీకల్ రైట్స్ ని ప్రముఖ మీడియా సంస్థ Zee ఛానల్ కొనుగోలు చేసిందన్నా రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా Zee5 తో ఓటిటితో డీల్ కుదుర్చుకుందంట.

ఈ సినిమాలో మరికొన్ని ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భార్య అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాలని కోరుకుంటున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker