Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Krishnam Raju:జనవరి 20న 1940 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లో కృష్ణంరాజు గారు జన్మించారు.
కృష్ణంరాజు గారు చదువు పూర్తి అయిన వెంటనే కొన్నాళ్ళు జర్నలిస్టుగా పని చేశారు.ఆయన హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విల్లన్ గాను బాగా అలరించాడు.

Rebel star Krishnamraj passed away

1966 సంవత్సరంలో చిలకా గోరింకా సినిమా తో ఆరంగ్రేటం చేశాడు. కృష్ణంరాజు ‘అవే కళ్ళు’ అనే సినిమాలో ప్రతినాయకుడిగాను నిరూపించుకున్నాడు. 1977,1984వ సంవత్సరాలల్లో నంది అవార్డులు కూడా ఈయన సాధించాడు. తాండ్ర పాపారాయుడు అనే సినిమాకి 1980 సంవత్సరంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.

కృష్ణంరాజు గారు 2006లో ఫిల్మ్ ఫేర్ దక్షిణాది జీవిత సౌఫల్య పురస్కారం కూడా పొందరు. ఈయనకు మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమాలు భక్తకన్నప్ప,బొబ్బిలి బ్రహ్మన్న. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

విజయనగర సామ్రాజ క్షత్రియ రాజ వంశానికి చెందిన కృష్ణంరాజు దివంగత మాజీ ప్రధాని వాజ్ పెయ్ హయాంలో కేంద్ర మంత్రిగాను సేవలందించడం జరిగింది. శ్యామల దేవి కృష్ణంరాజు భార్య, ప్రసీది,ప్రకీర్తి, ప్రదీప్తి ఆయనకు ముగ్గురు కుమారైలున్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్.

రెబల్ స్టార్ గా కృష్ణా రాజు చేసిన పాత్రలే ఆయనకి రెబల్ స్టార్ అనే బిరుదును తీసుకొచ్చాయి. ఆయన ఆ పేరుకు తగ్గట్టుగానే ప్రయాణం సాహసోపేతంగా ఉండేది. భిన్నమైన పాత్రలో నటుడిగా ప్ పరిశ్రమ స్థాయిని పెంచే చిత్రాలతో నిర్మాతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపును సాధించాడు.

అలనాటి అగ్రతారలు NTR,ANR ఇలాంటి హీరోల కూడా దీటుగా కృష్ణరాజు తనదైన నటనతో కథానాయకుడు గా రాణించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు మరణించడం జరిగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker