Vijay & Rashmika Combination: విజయ్, రష్మీక రొమాన్స్

Rowdy Vijay devarakonda & Rashmika Combination: టాలీవుడ్ స్టార్లలో ఒకరైన విజయ్ దేవరకొండ గురించి మనకు తెలుసు. విజయ్ మొదటి సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పవచ్చు. అంతేకాదు బాలీవుడ్ భామలు, మరియు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా విజయ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.

అయితే విజయ్ గీతగోవిందం ద్వారా కూడా మంచి హిట్ సాధించాడు. ఆ సినిమాలో రష్మిక తో కలిసి నటించాడు. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా నటి రష్మిక తో కలిసి నటించాడు. తాజాగా విజయ్ సమంతతో కలిసి ఖుషి 2 సినిమాలో నటిస్తున్నాడు. అయితే సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

ఈ టైంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అంత హిట్ కొట్టలేదు. దీంతో ఈసారి నటించే సినిమా పెద్ద హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Vijay,Rashmi movie
Vijay,Rashmi movie

గీతా గోవిందం సినిమాకు పరశురాం దర్శకత్వం చేశాడు. ఇప్పుడు మళ్లీ అతని దర్శకత్వంలో క్లాసికల్ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారని, రష్మిక పేరును విజయ ప్రిఫర్ చేశాడని, సినీ వర్గాల నుంచి అందిన వార్త.

దీంతో వీరి జోడి ముచ్చటగా మూడోసారి జంటగా కనిపించబోతుంది. రష్మికతో చేసిన సినిమాలు మంచి హిట్టు కొట్టాయి. అందువల్లనే మళ్లీ తనతో హిట్టు కొట్టాలని అనుకుంటున్నట్లున్నాడు. విజయ్, పరశురాం మధ్య ఈ సినిమా గురించి చర్చలు కూడా జరిగాయి. ఇక షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అంటున్నారు.

ఈ రొమాంటిక్ జోడి తిరిగి ప్రేక్షకులం ప్రేక్షకులకు ముందు మళ్లీ కన్విందు చేస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రష్మిక మందన, విజయ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుగా పెద్ద టాక్ సినీ రంగంలో వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు.

కాస్త టైం దొరికితే చాలు వెంటనే టూర్స్ వేస్తుంటారు. తాజాగా వీళ్ళిద్దరూ గోవాకు వెళ్లి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే వెళ్లేటప్పుడు ఎయిర్పోర్టులో విజయ్ కనిపించగానే సడన్ గా కలిసినట్లుగా వ్యవహరించారు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు.

దీంతో అందరికీ వీరు మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని అందరికీ అర్థమైంది. మీరు ప్రేమలో ఉన్నారా? అని రష్మికను అడిగితే, మేము మంచి ఫ్రెండ్స్ అంటూ మాట దాటేస్తుంది. వీళ్ళు గోవాకు వెళ్లి వచ్చిన సంగతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఏదేమైనా వీళ్ళు కలిసి నటిస్తున్న సినిమా త్వరగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే రష్మిక మాత్రం పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. వరుస సినిమాలతో బిజీగా మారింది. ఎంత బిజీగా ఉన్నా విజయ్ తో కలిసి కచ్చితంగా నటిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. వీళ్ళ జోడి, రొమాన్స్ మూడోసారి చూడటానికి ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker